సున్నితమైన ప్రేమ కథను, ఎమోషన్స్ ని అత్యధ్బుతంగా రూపొందించడంలో తగ్గేదేలే అంటారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ మధ్యే లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్టందుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఆ జోష్ లో ఉన్నారు. సాయి పల్లవి, నాగచైతన్య జంటగా తెరకెక్కిన ఈ సినిమా కథ, పాటలు, డైలాగ్స్ అన్నీ అదుర్స్ అనిపించాయి. సెప్టెంబర్ 24 న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే వాట్ నెక్ట్స్ అని శేఖర్ కమ్ములను ప్రశ్నిస్తే ...లీడర్ సినిమాకు సీక్వెల్ అన్నారట. దగ్గుపాటి రానా హీరోగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన లీడర్ మంచి విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న కమ్ముల ఈ సారి రానాతో కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అని తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్.
Also Read: షాకింగ్ ట్విస్ట్..ఈరోజే ఎలిమినేషన్ .. వాళ్లిద్దరిలో ఎవరంటే..
నాయకుడు నిజమైన రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నారని టాక్. పవన్ కళ్యాణ్ ఇప్పటీకే రాజకీయాల్లో ఉన్నందున ఈ సినిమా మరింత మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. పైగా రానున్న ఎన్నికల ముందు విడుదలకు ప్లాన్ చేసుకుంటే పొలిటికల్ గా కూడా కలిసొస్తుందని భావిస్తున్నారట. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ వినడానికి మాత్రం కిక్కిస్తోందంటున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఇక పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్స్ చూస్తే ఇప్పటికే భీమ్లానాయక్ , హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటి తర్వాత హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. ఇవన్నీ పూర్తైన తర్వాతే శేఖర్ కమ్ములతో సినిమా ఉంటే ఉండొచ్చు. మరి
Also Read: పాపిట్లో సింధూరం..మెడలో నల్లపూసలు.. బాలయ్య బ్యూటీ పెళ్లెప్పుడు చేసుకుందబ్బా...
ఇక శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరి' తర్వాత తమిళ హీరో ధనుష్ తో ఓ ప్యాన్ ఇండియా సినిమా చేయనున్నారు. ఒకప్పటి మద్రాసు బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. అందుకే కమ్ముల ధనుష్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్స్ దాదాపు పూర్తైంది. ఈ సినిమాను నారాయణదాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ధనుష్ ఇప్పటి వరకూ తెలుగులో డైరెక్ట్ మూవీ చేయలేదు ఇదే మొదటిది. ఇక ఈ ఇందులో కూడా హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తుందని తెలుస్తోంది. శేఖర్ కమ్ములతో ఫిదా, లవ్ స్టోరీ....ధనుష్ తో మారి 2 లో సాయిపల్లవి నటించింది.
Also Read: ఫస్ట్ టైం కార్పొరేట్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా స్టార్ హీరో
Also Read: ఆహా 'టాక్ షో' కోసం బాలయ్యకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్….!
Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. 'మా' అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారోత్సవంలో మోహన్ బాబు కామెంట్స్ వైరల్
Also Read: 'జబర్ధస్త్' షో కి జడ్జీగా వస్తానన్న బాలకృష్ణ, నటసింహంతో ఫోన్లో మాట్లాడిన రోజా
Also Read: వరుడు కావలెను' సినిమా విడుదల ఎప్పుడంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా.. ఎన్నికల ముందు విడుదలకు ప్లాన్
ABP Desam
Updated at:
16 Oct 2021 07:13 PM (IST)
Edited By: RamaLakshmibai
ఎంట్రీ తోనే రానా ఇరగదీశాడు అనిపించుకున్న సినిమా 'లీడర్'. ఈ సినిమాకు సీక్వెల్ తప్పకుండా తెరకెక్కిస్తానని చెప్పాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే సీక్వెల్లో హీరో రానా కాదు.
Rana-Pawan Kalyan
NEXT
PREV
Published at:
16 Oct 2021 07:06 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -