బుల్లితెర సంచలనం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఆరంభంలో సోసో గా నడిచినా వారాలు గడుస్తున్న కొద్ద ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తూ పోతోంది. దీంతో ఇప్పుడిప్పుడే ఐదో సీజన్ పై ఆసక్తి పెరుగుతోంది.  మొదట్లో 19 మంది కంటెస్టెంట్లను దింపడంతో పాటు ఆరంభంలో గొడవలు,  బూతులు, రొమాన్స్ తో మజా పంచారు. అయినప్పటికీ ఒక్కరోజు గందరగోళం నడిచింది. ఓ దశలో హౌస్ మేట్స్ రచ్చ చూసిన ప్రేక్షకులు వీళ్లకి పువ్వుల్ని, అమ్మాయిల్ని చూపించండ్రా బాబోయ్ అన్నారు. అలా ఐదువారాలు గడిచిపోయింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడోవారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదోవారం హమీద ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఆరో వారం ఏకంగా పది మంది నామినేషన్స్ లో ఉన్నారు. దీనికి సంభందించి షాకింగ్ ప్రోమో విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు.






ఈవారం మీకు నచ్చని వారెవరు అన్నది చెప్పమని బిగ్ బాస్ ఆదేశించడంతో...ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పారు. మొత్తంగా చూస్తుంటే ప్రియ, లోబో నాలుగు ఓట్లు పడడంతో ఇద్దరూ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని నాగార్జున  ప్రకటించారు. డోర్స్ ఓపెన్ చేయమని చెప్పిన నాగార్జున ఇద్దర్లో ఎవరు ఉండాలి ఎవరు వెళ్లాలో హౌస్ మేట్స్ నిర్ణయించుకోవాలని చెప్పారు. దీంతో ఇంటి సభ్యులు లోబో వైపు కొందరు, ప్రియ వైపు మరికొందరు మద్దతు ప్రకటించారు. ఎవరికి మద్దతివ్వాలో అర్థంకాక యానీ మాస్టర్ ఆగిపోవడంతో క్విక్ యానీ అని నాగార్జున మరోసారి చెప్పారు. ఒకరు ఎలిమినేట్ అయిపోయారన్నది క్లారిటీ వచ్చేసింది. మరి లోబో-ప్రియలో ఎవరు వెళ్లారన్నది కొద్ది సేపట్లో తెలిసిపోతుంది... 



ఈ లెక్కన ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందన్నది క్లారిటీ వచ్చేసింది. అంటే ఈ రోజు ఒకరు వెళ్లిపోగా ఆదివారం రోజు ఓటింగ్ ప్రకారం మరొకరు ఎలిమినేట్ అవుతారన్నది టాక్. అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే..వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఈ వారమే ఉండబోతుందన్నది టాక్. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరోవైపు ఇంతకన్నా ముందే వదిలిన ప్రోమోలో యాంకర్ రవిని గట్టిగానే క్వశ్చన్ చేశారు హోస్ట్ నాగార్జున. ప్రతీ వారం నామినేషన్స్‌లో ఉండి సేవ్ అవుతూ వస్తోన్న రవి ఈ వారం కూడా నామినేషన్స్ లో ఉన్నాడు. గతంలో లహరి, ప్రియ అడ్డంగా బుక్ అయిన రవి మరోసారి నాగార్జునకి దొరికిపోయాడు.



సింగిల్ మెన్‌ను వదిలేసి యాంకరింగ్ ఛాన్సుల కోసం తన వెంట తిరుగుతుంది లహరి అంటూ ప్రియతో చెప్పాడు రవి. అదే మాట లహరి అడిగితే లేదని మాట తప్పాడు. కానీ వీకెండ్‌లో నాగార్జున వచ్చి అసలు నిజం బయటపెట్టడంతో రవి బుక్ అయిపోయాడు. అదే వారం లహరి ఎలిమినేట్ అయిపోయింది. అక్కడ తప్పు చేసింది రవి అయితే.. శిక్ష పడింది మాత్రం లహరికి. తాజాగా మరోసారి ఇదే జరిగింది. రవి తప్పు చేస్తే శ్వేత జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఐడియా ఇచ్చింది రవి అంటూ శ్వేతా ఓపెన్ అయిపోయింది. మాట మారుస్తున్నాడంటూ రవికి షాక్ ఇచ్చింది. దాంతో రవి మరోసారి బుక్ అయిపోయాడు. మరోవైపు లోబోపై కూడా సీరియస్ అయ్యాడు నాగార్జున. రవి చెప్పాడని గడ్డి తినమంటే తింటావా అంటూ ప్రశ్నించారు. ఈ హడావుడి మొత్తం అయ్యాక నటరాజ్ మాస్టర్ చెప్పిందే కరెక్ట్ అన్నారు నాగార్జున. గతంలో రవిని...నటరాజ్ మాస్టర్ గుంటనక్క అన్నాడు.


Also Read:  పాపిట్లో సింధూరం..మెడలో నల్లపూసలు.. బాలయ్య బ్యూటీ పెళ్లెప్పుడు చేసుకుందబ్బా...
Also Read:  ఫస్ట్ టైం కార్పొరేట్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా స్టార్ హీరో
Also Read: ఆహా 'టాక్ షో' కోసం బాలయ్యకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్….!
Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. 'మా' అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారోత్సవంలో మోహన్ బాబు కామెంట్స్ వైరల్
Also Read: 'జబర్ధస్త్' షో కి జడ్జీగా వస్తానన్న బాలకృష్ణ, నటసింహంతో ఫోన్లో మాట్లాడిన రోజా
Also Read: వరుడు కావలెను' సినిమా విడుదల ఎప్పుడంటే...
Also Read: సత్యదేవ్ కొత్త సినిమా గాడ్సే... లుక్ అదిరిందిగా
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి