నందమూరి నటసింహం బాలకృష్ణ- రోజా కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టరే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బొబ్బిలి సింహం, భైరవద్వీపం ఏ రేంజ్ హిట్టయ్యాయో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీళ్లిద్దరి జోడికి ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పటికీ రోజా, బాలకృష్ణ ని జంటగా వెండితెరపై చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. రాజకీయాల సంగతి పక్కనపెడితే బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉండగా రోజా  బుల్లితెర పై షోస్ చేస్తోంది. ఇందులో భాగంగా జబర్దస్త్ షోలో ఉన్న రోజా బాలకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడారు. 

బుల్లితెరపై కడుపుబ్బా నవ్వించే షో గా దూసుకుపోతున్న జబర్ధస్త్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదల చేశారు. ఇందులో చలాకీ చంటి, సుధాకర్, శాంతిస్వరూప్, రాఘవ  పంచ్ లతో అలరించారు. ఆ తర్వాత యాంకర్ అనసూయ మాట్లాడుతూ  మేడమ్  అందరి సమక్షంలో ఇప్పుడు మీరు బాలకృష్ణ సర్ కు ఒక్కసారి కాల్ చేయాలి అని కోరింది. మూడ్ బావుంటే పర్వాలేదు లేకపోతే అనుకుంటూనే కాల్ చేశారు రోజా. హల్ సర్ బాగున్నారా ? అని అడగ్గా.. రోజాగారు నమస్కారం  బాగున్నానమ్మా  మన అఖండ షూటింగ్ లో ఉన్నాను అని చెప్పారు బాలకృష్ణ. అనంతరం మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేద్దాం .. భైరవద్వీపం పార్ట్ 2 నా లేకా బొబ్బిలి సింహం పార్ట్ 2నా అని అడుగుతున్నారు అని రోజా అనడంతో మన కాంబినేషన్ కోసం అందరూ ఎదురూచూస్తున్నారంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతేకాదు.... జబర్ధస్త్ జడ్జిగా తాను వస్తానంటూ నవ్వులు పూయించారు  బాలకృష్ణ. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: ఫస్ట్ టైం కార్పొరేట్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా స్టార్ హీరోAlso Read: ఆహా 'టాక్ షో' కోసం బాలయ్యకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్….!Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. 'మా' అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారోత్సవంలో మోహన్ బాబు కామెంట్స్ వైరల్Also Read: 'స్వామిరారా' టీమ్ మూడోసారి…Also Read: వరుడు కావలెను' సినిమా విడుదల ఎప్పుడంటే...Also Read: సత్యదేవ్ కొత్త సినిమా గాడ్సే... లుక్ అదిరిందిగాఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి