Nikhil-Sudheer Varma: 'స్వామిరారా' టీమ్ మూడోసారి…

'స్వామిరారా', 'కేశవ' సినిమాలతో అలరించిన కాంబినేషన్​ హీరో నిఖిల్-డైరెక్టర్ సుధీర్​వర్మ మూడోసారి కలిసి పనిచేయనున్నారు. దసరా సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

Continues below advertisement

సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్  సిద్దార్థ్ - కలర్స్ స్వాతి నటించిన ''స్వామిరారా'' సూపర్ హిట్టైంది.  2013లో వచ్చిన ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ , స్క్రీన్ ప్లే తో అదుర్స్ అనిపించింది. ప్రేక్షకులు ఈ సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఓ రకంగా నిఖిల్ కి కూడా ఇది టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.  'స్వామిరారా' సినిమా తర్వాత నిఖిల్ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. చిన్న కాన్సెప్ట్ తీసుకొని అన్ని వర్గాల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా రూపొందిన ఆ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. సుధీర్ వర్మకు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఇదే కాంబినేషన్ లో అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే వార్తలు హల్ చల్ చేశాయి. కానీ సినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు.  ఆ తర్వాత నిఖిల్ - సుధీర్ కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా ''కేశవ''  ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ అయినప్పటికీ  ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.  ఇప్పుడు మూడోసారి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఈ హీరో-దర్శకుడు.  దసరా సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై  BVSN ప్రసాద్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ బ్యానర్ లో వస్తోన్న 32వ ప్రాజెక్ట్ ఇది. నవంబర్ 1న ఈ సినిమా ప్రారంభం కానుంది. అప్పుడే షూటింగ్ కోసం 40 రోజుల లండన్ షెడ్యూల్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. కార్తీక్ స్వరాలు సమకూర్చనున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన టీం అప్ డేట్స్ త్వరలోనే వెల్లడి కానున్నాయి. 

Continues below advertisement

నిఖిల్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే  పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో '18 పేజెస్' సినిమా షూటింగ్ పూర్తైంది.  చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు ఎడిటర్ గ్యారీ బీహెచ్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఓ స్పై థ్రిల్లర్ ను మొదలు పెట్టాడు. ఈ ప్రాజెక్ట్స్ హడావుడి నడుస్తుండగానే సుధీర్ వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  మరోవైపు దర్శకుడు సుధీర్ వర్మ దక్షిణ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్ నైట్ రన్నర్స్' సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ కామెడీ చిత్రంలో రెజీనా కాసాండ్రా - నివేదా థామస్  నటిస్తున్నారు. 

Also Read: 'వరుడు కావలెను' సినిమా విడుదల ఎప్పుడంటే...
Also Read: క్రేజీ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ తర్వాతి సినిమా.. పండగ రోజు రెండు కొత్త సినిమాలతో చెర్రీ రచ్చ!
Also Read: జైలు నుంచి వీడియో కాల్.. ఆర్యన్‌కు రూ.4,500 మనీ ఆర్డర్ పంపిన షారుక్!
Also Read: సమంత బైలింగ్యువల్ సినిమా.. 'జై భీమ్' టీజర్ తో అదరగొట్టిన సూర్య..
Also Read : నాని ఊర మాస్ గెటప్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola