దిల్లీ సింఘు సరిహద్దు వద్ద దారుణం జరిగింది. ఓ వ్యక్తి (35) హత్యకు గురయ్యాడు. రైతులు నిరసన చేస్తోన్న వేదికకు సమీపంలో ఉన్న బారికేడ్‌కు ఆ మృతదేహాన్ని వేలాడదీశారు. అయితే మృతి చెందిన వ్యక్తి ఎవరో ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ఈ ఘటన దేశాన్నే షాక్‌కు గురిచేసింది.
ఏమైంది..?
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దు వద్ద ఆందోళన చేస్తోన్న రైతుల వేదికకు అతి సమీపంలో ఈ ఘటన జరిగింది. మణికట్టును కత్తిరించి దారుణంగా హత్య చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కుండ్లీ పోలీసులు.
ఈ ఘటన బయటికి వచ్చిన వెంటనే ఇందుకు సంబంధించిన ఓ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ చిత్రం చూస్తే.. ఆ వ్యక్తిని ఎవరో తీవ్రంగా కొట్టి, మూకదాడి చేసిన చంపేసినట్లు తెలుస్తోంది.
మృతదేహాన్ని పంచనామా కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నిహంగాలు లేదా ఆయుధాలతో తిరిగే సిక్కు యోధులు ఎవరో ఈ హత్య చేసి ఉంటారని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎమ్) ఆరోపించింది. ఎందుకంటే తమ ఆందోళనను మొదటి రోజు నుంచి అడ్డుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారని రైతులు అన్నారు.
అవును మేమే చేశాం..!
అయితే ఈ హత్యను తామే చేసినట్లు నిహంగాలకు చెందిన 'నిరివైర్ ఖాల్స్-ఉద్నా దళ్' ఒప్పుకుంది. దైవదూషణ చేసినందుకే ఓ దళితుడ్ని హత్య చేశామని ఈ దళం ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది. దైవదూషణ చేస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి ఉంటుందని, పోలీసులు, ప్రభుత్వానికి మేం జవాబుదారీలం కామని ఈ వీడియోలో నిహంగాలు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి ఓ నిందితుడ్ని హరియాణా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సంచలన ఘటన..
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని దాదాపు 11 నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వారితో పలుసార్లు చర్చలు జరిపిన ఫలించలేదు. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు తేల్చిచెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితిలో రైతులపై దాడులు జరగడం యావత్ దేశాన్నే షాక్‌కు గురిచేస్తోంది. ఇటీవల జరిగిన లఖింపుర్ ఘటనే ఇంకా చల్లారలేదు.
కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలపై ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో నిరసన వ్యక్తం చేస్తోన్న రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. ఆ హింసాత్మక ఘటనలో మరో ఇద్దరు భాజపా కార్యకర్తలు, ఓ డ్రైవర్ సహా ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. ఆగ్ గత ఆదివారం జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్నే షాక్‌కు గురి చేసింది.
అయితే రైతులపైకి దూసుకువచ్చిన కారులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను అజయ్ మిశ్రా ఖండించారు.
Also Read: Manmohan Singh: నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం
Also Read: Kandahar Mosque Blast: మసీదులో బాంబు పేలుడు.. 16 మంది మృతి!
Also Read: Aryan Khan: జైలు నుంచి వీడియో కాల్.. ఆర్యన్‌కు రూ.4,500 మనీ ఆర్డర్ పంపిన షారుక్!