సమంత బైలింగ్యువల్ సినిమా..

  


ఈ మధ్యనే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసిన సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. రీసెంట్ గా ఓ బాలీవుడ్ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఓ బైలింగ్యువల్ సినిమాలో కనిపించడానికి సిద్ధమైపోయింది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. సమంత ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు శాంతరూబేన్ జ్ఞానశేఖరన్ బైలింగ్యువల్ సినిమాను రూపొందించబోతున్నాడు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై  ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించబోతున్నారు. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 







 'జై భీమ్' టీజర్ తో అదరగొట్టిన సూర్య.. 


వరుస సినిమాలతో అదరగొడుతున్న సూర్య ప్రస్తుతం 'జై భీమ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ బయటకొచ్చింది. తక్కువ జాతి, అణగారిన కుటుంబాల కోసం పాటుపడే లాయర్ గా సూర్య టీజర్ లో కనిపించారు. ఒక్క టీజర్ తోనే ఇంపాక్ట్ చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. టీజర్ లో వినిపించిన కొన్ని డైలాగ్స్, సూర్య సీరియస్ లుక్ హైలైట్స్ గా నిలిచాయి. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు.  తమిళంలో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.