Sneha Ullal Photos: పాపిట్లో సింధూరం..మెడలో నల్లపూసలు.. బాలయ్య బ్యూటీ పెళ్లెప్పుడు చేసుకుందబ్బా...
(Image Credit/ snehaullal Instagram) జూనియర్ ఐశ్వర్యరాయ్ అనిపించుకున్న స్నేహా ఉల్లాల్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం జోరుగానే ఉంటోంది. రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. మంగళసూత్రం, సింధూరంతో సంప్రదాయబద్ధంగా కనిపించిన స్నేహ ఉల్లాల్ ని చూసిన నెటిజన్లు ‘మేడమ్ మీకు పెళ్లి ఎప్పుడు అయ్యింది?’ అంటూ కామెంట్లు పెట్టారు. స్పందించిన స్నేహ యాడ్ షూట్ కోసమే మెడలో మంగళసూత్రం ధరించానని తనకు ఇంకా పెళ్లి కాలేదని ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది.
(Image Credit/ snehaullal Instagram) బీటౌన్లో ‘లక్కీ’ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన స్నేహ... ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘నేను మీకు తెలుసా’, ‘కరెంట్’, ‘సింహా’ సినిమాల్లో నటించినా ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. 2014లో వచ్చిన ‘అంతా నీ ఇష్టం’ తర్వాత స్క్రీన్ కి దూరమైన స్నేహ ‘ఎక్స్‌పైరీ డేట్’ అనే వెబ్‌సిరీస్‌తో మళ్లీ మెరిసింది.
(Image Credit/ snehaullal Instagram) మధ్యలో వచ్చిన గ్యాప్ అంతా ఆఫర్స్ రాక కాదు అనారోగ్యం కారణంగా అని చెప్పింది స్నేహ. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే రక్తానికి సంబంధించిన అనారోగ్యమిది. ఇది రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పుకొచ్చింది. స్నేహా ప్రస్తుతం ఎయిట్ అనే సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది.
(Image Credit/ snehaullal Instagram) స్నేహ ఉల్లాల్
(Image Credit/ snehaullal Instagram) స్నేహ ఉల్లాల్
(Image Credit/ snehaullal Instagram) స్నేహ ఉల్లాల్
(Image Credit/ snehaullal Instagram) స్నేహ ఉల్లాల్