Sithara Entertainments Upcoming Films: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) - సూర్యదేవర నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓవైపు పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు మీడియం రేంజ్ చిత్రాలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు రూపొందిస్తూ మంచి అభిరుచి గల నిర్మాతలు అనిపించుకున్నారు. 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' బ్యానర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసే సినిమాలను మాత్రేమే నిర్మిస్తూ.. దాని అనుబంధ సంస్థ 'సితార ఎంటర్టైన్మెంట్స్' పేరు మీద ఇతర చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తూ ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. అలానే ఈ మధ్య కాలంలో 'ఫార్చూన్ ఫోర్ సినిమాస్' బ్యానర్ ను ఏర్పాటు చేసి త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్యను కూడా తమ సినిమాలో నిర్మాణంలో భాగం చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Aadu Jeevitham 9 Days Box Office Collections: మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్‌ మూవీ 'ది గోట్‌ లైఫ్‌'(తెలుగులో 'ఆడు జీవితం'). డైరెక్టర్‌ బ్లెస్సీ రూపొందించిన ఈ సినిమా మార్చి 28న పాన్‌ ఇండియా స్థాయిలో విడులైంది. మూవీ రిలీజై వారం గడిచినా ఇప్పటికే థియేటర్లో సక్సెస్‌ఫుల్‌ రన్‌ అవుతుంది. రెండో వారంలోకి అడుగుపెట్టినా ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద అదే ఆదరణతో దూసుకుపోతుంది. ఫలితంగా ఈ మూవీ ఫస్ట్‌ వీక్‌లోనే రికార్డు వసూళ్లు సాధించింది. విడుదలైన తొమ్మిది రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసి మలయాళ ఇండస్ట్రీలో రికార్డు సెట్‌ చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Rashmika Mandanna Photo from Pushpa 2: మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప 2’. అల్లు అర్జున్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. బన్నీ నటించిన ‘పుష్ప’ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఆ సినిమా విడుదలై రెండున్నర ఏండ్లు అవుతుంది. దీనికి సీక్వెల్ వస్తున్న ‘పుష్ప 2’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


GV Prakash ABout Clash With Dhanush: తమిళ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్‌ గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. ఆస్కార్‌ అవార్డు విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్‌ మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తనదైన అద్భుతమైన కంపోజింగ్‌తో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వగానే యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సెన్సేషన్‌ అయ్యాడు. ఒక్క తమిళంలోనే తెలుగులోనూ పలు చిత్రాలకు సంగీతం అందించిన జీవీ ప్రకాశ్‌ నటుడిగాను నిరూపించుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు 'డియర్‌' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా తమిళ్‌ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా జీవీ ప్రకాశ్‌ హీరో ధనుష్‌తో ఉన్న గొడవలపై స్పందించాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Ram Gopal Varma Gives Clarity About His Political Entry: సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసుకునే నిర్ణయాలు చాలా షాకింగ్‌గా ఉంటాయి. కొన్నిరోజుల క్రితం ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టుగా ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించినా కూడా ప్రేక్షకులు నమ్మలేదు. కొన్నిరోజులకే ఈ విషయం సినీ సర్కిల్స్‌లో మాత్రమే కాదు.. రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తను చేసిన ట్వీట్‌ను నెటిజన్లు పూర్తిగా అర్థం చేసుకోలేదంటూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌పై పోటీకి దిగే విషయంపై ఆయన వివరణ ఇచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)