Ram Gopal Varma Gives Clarity About His Political Entry: సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసుకునే నిర్ణయాలు చాలా షాకింగ్‌గా ఉంటాయి. కొన్నిరోజుల క్రితం ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టుగా ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించినా కూడా ప్రేక్షకులు నమ్మలేదు. కొన్నిరోజులకే ఈ విషయం సినీ సర్కిల్స్‌లో మాత్రమే కాదు.. రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తను చేసిన ట్వీట్‌ను నెటిజన్లు పూర్తిగా అర్థం చేసుకోలేదంటూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌పై పోటీకి దిగే విషయంపై ఆయన వివరణ ఇచ్చారు.


బుద్ధితక్కువ పని..


తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో ‘పిఠాపురం అంటే ఏమైనా గుర్తొస్తుందా’ అంటూ రామ్ గోపాల్ వర్మకు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘ఇప్పటికీ రాజకీయాల్లో నిలబడుతున్నావంటా అంటూ ఇంకా చాలామంది నాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. వాళ్లు ట్విటర్‌లో నేను ఇచ్చిన వివరణ చూడలేదు. వాళ్లు ఎక్కడో విని, అదే ఫిక్స్ అయిపోయారు’’ అంటూ రాజకీయాల్లోకి రావడం లాంటి బుద్ధి తక్కువ పని తాను చేయను అని తేల్చిచెప్పారు ఆర్జీవీ. మరి ఆరోజు అలా ట్వీట్ ఎందుకు చేశారు అని ప్రశ్నించగా.. తనకు ఎవరో ఒకరిని చిరాకు పెడుతూ ఉండడం ఇష్టమని తన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఇప్పటికీ ఈ దర్శకుడు పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుతున్నారంటూ ఫిక్స్ అయిపోయిన ప్రేక్షకులకు ఒక స్పష్టత వచ్చింది.


ఎందుకలా.?


ఇక సినిమాల విషయానికొస్తే.. ఒకప్పుడు కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట అనిపించుకున్న ఆర్జీవీ.. ఇప్పుడు పూర్తిగా రూటు మార్చారు. ఎక్కువగా పొలిటికల్ జోనర్‌లోనే మూవీస్‌ను తెరకెక్కిస్తున్నారు. అవి కాస్త కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తున్నాయి. వాటితో పాటు పూర్తిగా అడల్ట్ సినిమాలపైనే దృష్టిపెట్టారు ఆర్జీవీ. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా రీల్స్ చేస్తూ బ్రతికేస్తున్న కొందరు ముద్దుగుమ్మలను తన అడల్డ్ ఫిల్మ్స్ కోసం సెలక్ట్ చేసుకొని వారిని స్టార్లుగా మారుతున్నారు. ఈ విషయంపై ఆర్జీవీ స్పందించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను తీసుకొచ్చి సెలబ్రిటీలను చేస్తున్నారంటూ ఆయనపై వస్తున్న విమర్శలకు రిప్లై ఇచ్చారు.


అంతమంది రియాక్ట్ అయ్యారు..


‘‘అది కామన్‌గా జరుగుతున్నదే కదా. ఇన్‌స్టాలో నేను ఒక కేరళ అమ్మాయిని చూశా. తన వీడియోను ట్విటర్‌లో పెట్టి ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటే దానికి 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతమంది రియాక్ట్ అయ్యారంటే ఏదో ఉన్నట్టే కదా’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్లే తన సినిమాలకు క్రేజ్ వస్తుందని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఈ దర్శకుడు ‘శారీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందులో హీరోయిన్‌గా నటిస్తున్న ఆరాధ్య దేవి అనే కేరళ అమ్మాయిని ఇన్‌స్టాలో చూసి సెలక్ట్ చేశారు. తను మాత్రమే కాదు.. ఇంతకు ముందు కూడా చాలామంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు ఆర్జీవీ.


Also Read: స్టార్ హీరోల రెమ్యునరేషన్‌పై ఆర్జీవీ కామెంట్స్ - తప్పుదోవ పట్టించేందుకే అంటూ క్లారిటీ