South Actors Own Private Jets: ఫలానా సినీ నటుడికి సొంత కారవ్యాన్‌ ఉందని సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్ల క్రితం చెప్పుకునే వాళ్లు. రాన్రానూ కారవ్యాన్‌ కామన్‌ అయిపోయింది. ఇప్పుడు, సొంత విమానాలు ఎవరెవరికి ఉన్నాయో అభిమానులు ఆరా తీస్తున్నారు.


‘బాహుబలి’, ‘కెజీఎఫ్ 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ కొత్త ఎత్తులకు చేరుకుంది, ప్రపంచానికి అద్భుతంగా కనిపించింది. సౌత్‌ ఇండియన్‌ యాక్టర్లు పాన్‌-ఇండియా సూపర్‌స్టార్స్‌గా, వరల్డ్‌ ఫేమస్‌ యాక్టర్లుగా మారారు. సౌత్‌లో బ్లాక్‌బస్టర్ల తర్వాత కొంతమంది నటుల లైఫ్‌స్టైల్‌ కూడా మారింది. ప్రైవేట్‌ జెట్‌ విషయానికి వస్తే, దక్షిణాది నటుల్లో ఏడుగురికి సొంత విమానాలు ఉన్నాయి.


లైఫ్ స్టైల్ ఆసియా లెక్క ప్రకారం, 'మన్మధుడు' అక్కినేని నాగార్జున సంపద విలువ దాదాపు 3010 కోట్ల రూపాయలు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని అత్యంత కొద్దిమంది ఉద్ధండపిండాల్లో నాగ్‌ ఒకడు. నటనలోనే కాదు, వ్యాపారంలోనూ తాను దిగ్గజమేనని ఏళ్ల క్రితమే నాగార్జున ప్రూవ్‌ చేసుకున్నాడు. తన కుటుంబ విహారయాత్రల కోసం ఒక ప్రైవేట్ జెట్‌ను కూడా కొన్నాడు.


మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌ తన తండ్రికి తగ్గ తనయుడు. స్క్రీన్ ప్రెజెన్స్, నటనలో నైపుణ్యానికి అతను కేరాఫ్‌ అడ్రస్‌. రామ్ చరణ్‌ దగ్గర విలాసవంతమైన కార్లతో పాటు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. కుటుంబ విహారయాత్రల కోసం దానిని ఉపయోగించుకుంటాడు. టాలీవుడ్‌లోని అత్యంత విశ్వసనీయ నటుడిగా తన సత్తాను చరణ్‌ ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఆఫ్ ఇండియా రిపోర్ట్‌ ప్రకారం, రామ్‌ చరణ్‌ ఆస్తిపాస్తుల విలువ రూ. 1370 కోట్లు ఉంటుందని అంచనా.


డైనమిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టే అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలో ఒక థండర్‌ బోల్డ్‌ లాంటి వాడు. షూటింగ్‌ స్పాట్‌లో ఎంత పని చేసినా ఫుల్‌ ఛార్జ్‌లో ఉండే అల్లు అర్జున్‌, ఎట్లాంటి వారినైనా అయస్కాంతంలా ఆకర్షించగలడు. పుష్ప మూవీ తర్వాత ప్రాంతీయ పరిమితులను చెరిపేసిన ఈ నటుడి నికర విలువ రూ. 460 కోట్లుగా GQ ఇండియా రిపోర్ట్‌ చేసింది. ఆరు సీట్ల ప్రైవేట్ జెట్‌కు అల్లు అర్జున్ యాజమాని. స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత అతను అందుకున్న బహుమతి అది.


‘లేడీ సూపర్‌స్టార్‌’ నయనతార స్టార్‌డమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడున్న స్టార్‌ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్‌, ఫెసిలిటీస్‌ నయనతార తీసుకుంటుంది. GQ ఇండియా ప్రకారం, నయన్‌ ఆస్తుల విలువ సుమారుగా రూ. 200 కోట్లుగా అంచనా. ఫ్యామిలీతో కలిసి జాలీగా ప్రపంచ యాత్రకు వెళ్లడానికి ఆమె దగ్గర ఒక ప్రైవేట్ జెట్‌ ఉంది.


దక్షిణ భారత నటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే వ్యక్తుల్లో ఒకడు ప్రిన్స్ మహేష్‌ బాబు. కుటుంబంతో కలిసి విలాసంగా గడపడానికి ఒక ప్రైవేట్ జెట్‌ కొన్నాడు. అతని భార్య నమ్రత శిరోద్కర్, తమ కుటుంబ విహారయాత్రల ఫొటోలను తరచుగా పోస్ట్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్ ఆసియా ప్రకారం, మహేష్‌ బాబు నికర విలువ రూ. 273 కోట్లుగా అంచనా.


దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమను శాసిస్తున్న తలైవా రజనీకాంత్, లెజెండరీ కెరీర్‌తో సిసలైన సూపర్‌ స్టార్‌గా నిలిచారు. లైఫ్ స్టైల్ ఆసియా రిపోర్ట్‌ ప్రకారం, తలైవా నికర విలువ రూ.430 కోట్లుగా అంచనా. దీనికి అదనంగా, సినిమా షూటింగ్‌లు, ఫ్యామిలీ వెకేషన్స్‌ కోసం ఒక ప్రైవేట్ జెట్‌ తీసుకున్నారు.


బాహుబలి పాత్రకు ప్రాణం పోసిన ప్రభాస్‌కు బలమైన ఫ్యాన్‌ నెట్‌వర్క్‌ ఉంది. CNBC TV18 ప్రకారం రెబెల్‌ స్టార్‌ నికర విలువ 240 కోట్ల పైమాటే. వృత్తి పట్ల అచంచలమైన నిబద్ధత, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ అతనికి డైహార్డ్‌ ఫ్యాన్స్‌ను సంపాదించి పెట్టాయి. ప్రభాస్ తన షూటింగ్‌లు, ఇతర పనుల కోసం ఒక ప్రైవేట్ జెట్‌ కొన్నాడు.


మరో ఆసక్తికర కథనం: రెండున్నరేళ్ల తర్వాత రికార్డ్ బద్ధలు, చారిత్రాత్మక స్థాయిలో ఫారెక్స్‌ నిల్వలు