Aadu Jeevitham 9 Days Box Office Collections: మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్‌ మూవీ 'ది గోట్‌ లైఫ్‌'(తెలుగులో 'ఆడు జీవితం'). డైరెక్టర్‌ బ్లెస్సీ రూపొందించిన ఈ సినిమా మార్చి 28న పాన్‌ ఇండియా స్థాయిలో విడులైంది. మూవీ రిలీజై వారం గడిచినా ఇప్పటికే థియేటర్లో సక్సెస్‌ఫుల్‌ రన్‌ అవుతుంది. రెండో వారంలోకి అడుగుపెట్టినా ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద అదే ఆదరణతో దూసుకుపోతుంది. ఫలితంగా ఈ మూవీ ఫస్ట్‌ వీక్‌లోనే రికార్డు వసూళ్లు సాధించింది. విడుదలైన తొమ్మిది రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసి మలయాళ ఇండస్ట్రీలో రికార్డు సెట్‌ చేసింది.


ఆ బ్లాక్‌బస్టర్‌ మూవీ రికార్డు బ్రేక్‌


దీంతో ఈ ఏడాదే విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన 'మంజుమ్మెల్ బాయ్స్' రికార్డును 'ఆడుజీవితం' బ్రేక్‌ చేసింది. ఈ మూవీ మలయాళంలో విడుదలై రూ. 200 కోట్లకుపైగా గ్రాస్‌ వసూళ్లు చేసింది. అయితే ఇప్పటి వరకు మలయాళంలో ఫాస్టెస్ట్‌ గ్రాస్‌ వసూళ్లు చేసిన చిత్రం 'మంజుమ్మెల్ బాయ్స్' ఉంది. కానీ ఇప్పుడు ఆడు జీవితం ఆ రికార్డును సొంతం చేసుకుంది. అతి తక్కువ టైంలోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మలయాళ చిత్రంగా 'ఆడి జీవితం' రికార్డు నెలకొల్పింది. తాజాగా  మూవీ కలెక్షన్స్‌ వివరాలను మూవీ టీం వెల్లడించింది. ఇక ఇప్పటికీ ఈ మూవీ మలయాళంలో 200 థియేటర్లో స్క్రన్స్‌లో ఆడుతుండటం మరో విశేషం. కాగా మొత్తం వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం  1720 స్క్రీన్స్‌లో ప్రదర్శితమవుతోంది. సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టన ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందుతోంది. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా పెద్దగా ఆదరణ లభించడం లేదు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్లో తెలుగు వెర్షన్‌ రిలీజ్‌గా కాగా ఇక్కడి ఆడియన్స్‌ ఈ చిత్రాన్ని పెద్ద పట్టించుకోవడం లేదు.






కానీ మలయాళంలో సూపర్‌ రెస్పాన్స్‌ అందుకుంటుంది. ఇప్పటి వరకు ఉన్న మొత్తం మూవీ కలెక్షన్స్‌లో తొంభై శాతం మాల్‌వుడ్‌ నుంచే వసూళ్లు అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి మూవీ పడ్డ కష్టానికి మాత్రం ప్రతిఫలం  దక్కింది.ఈ సినిమా అనుకుని, షూటింగ్‌ పూర్తి చేసి రిలీజ్‌ చేయడానికి దాదాపు 16 ఏళ్లు పట్టినట్టు మూవీ టీం ప్రమోషన్స్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ 'ది గోట్‌ లైఫ్‌'(ఆడు జీవితం) చిత్రాన్ని తెరకెక్కించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్లో ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. 90'sలో జీవినోపాధి కోసం అరబ్‌ దేశాలకు వలస వెళ్లిన కేరళకు చెందిన నజీబ్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు హాలీవుడ్ నటుడు జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబేలు కీలక పాత్రలు ఫోషించారు. 


Also Read: 'ఫ్యామిలీ స్టార్‌' క్రింజ్‌ స్టార్‌, వరస్ట్‌ సినిమా - తమిళ్ క్రిటిక్‌ రివ్యూపై మండిపడుతున్న విజయ్‌ ఫ్యాన్స్‌