GV Prakash ABout Clash With Dhanush: తమిళ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్‌ గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. ఆస్కార్‌ అవార్డు విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్‌ మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తనదైన అద్భుతమైన కంపోజింగ్‌తో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వగానే యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సెన్సేషన్‌ అయ్యాడు. ఒక్క తమిళంలోనే తెలుగులోనూ పలు చిత్రాలకు సంగీతం అందించిన జీవీ ప్రకాశ్‌ నటుడిగాను నిరూపించుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు 'డియర్‌' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా తమిళ్‌ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా జీవీ ప్రకాశ్‌ హీరో ధనుష్‌తో ఉన్న గొడవలపై స్పందించాడు.


కాగా ఇండస్ట్రీలో జీవీ ప్రకాశ్‌, స్టార్‌ హీరో ధనుష్‌ ఇద్దరు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. అంతేకాదు ధనుష్‌ సినిమాలకు కూడా జీవీ అద్భుతమైన సంగీతం అందించాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు మ్యూజిక్‌ పరంగా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించాయి. అవే ‘మయక్కం ఎన్నా’, ఆడుకాల‌మ్, సార్, కెప్టెన్ మిల్ల‌ర్ సినిమా మ్యూజిక్‌ పరంగా హిట్‌ అయ్యాయి. అయితే 'మయక్కం ఎన్నా', 'ఆడుకాలమ్‌' సినిమాల తర్వాత ఉన్నట్టుండి వీరిద్దరి మధ్య మాటలు తగ్గాయి. 'సార్‌' సినిమా ముందు వరకు  కొంతకాలంగా ధనుష్‌ సినిమా క్రూలో జీవీ ప్రకాశ్‌ పేరు వినిపించలేదు. దాదాపు ఆరేళ్లు ఒకరి పేరు ఒకరు ఎక్కడ ప్రస్తావించలేదు. ఏదైనా ఇంటర్య్వూలో అడిగినా ఇద్దరు మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఇక ఈ విషయంపై ఇంతకాలానికి నోరు తెరిచాడు జీవీ. తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ధనుష్‌తో గొడవపై ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందిస్తూ.. అవును.. మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చిన విషయం నిజమే.. కానీ ఇప్పుడు అదంతా పోయింది, ఇద్దరు మునుపటి మంచి స్నేహితులం అయ్యామన్నాడు.


అవును మా మధ్య మనస్పర్థలు వచ్చాయి..


ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ ఇంటర్య్వూలో జీవీ ప్రకాష్‌ స్నేహితులతో ఉన్న సంబంధం గురించి వివరించాడు."ఎలాంటి పరిస్థితుల్లోనే మన పక్కన ఓ పిల్లర్‌లా ఉండేవాడే స్నేహితడు. అలాంటి మనకు సమస్య వచ్చినప్పుడల్లా పక్కనే ఉంటాడు. నిజం ఒక మనకు అవసరం వచ్చినప్పుడు నేను ఉన్నానురా అనే ధైర్యం ఇచ్చేవాడే స్నేహితుడు. అందులో ధనుష్‌ కూడా ఉంటాడు" అని చెప్పాడు. దీంతో ధనుష్‌తో గొడవ గురించి హోస్ట్‌ అతడిని ప్రశ్నించింది. దీనికి అవును నాకు, ధనుష్‌కి మధ్య మనస్పర్థలు వచ్చిన మాట నిజమే. ఫ్రెండ్స్‌ అన్నాక గొడవలు రావడం సాధారణ విషయమే. అందరి స్నేహితుల లాగే మా మనస్పర్థలు వచ్చాయి. దానివల్ల మేం ఆరేళ్లు మాట్లాడుకోలేదు. కాని, ఇప్పుడంతా సెట్‌ అయ్యింది. మళ్లీ మేం కలిసిపోయాకం. కలిసి సినిమాలు కూడా చేస్తున్నాం.రీసెంట్‌గానే ధనుష్‌తో రెండు సినిమాలు కూడా చేశాను" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. కాగా జీవీ ప్రకాశ్‌ తెలుగులో 'డార్లింగ్‌', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'సార్‌' చిత్రాలు చేశాడు.