"Life was given to us a billion years ago. Now you know what to do with it." అంటుంది లూసీ. మనిషి జీవితం బిలియన్ల సంవత్సరాలుగా పరిణామం చెందుతూ ఉంది. ఈ లైఫ్ పర్పస్ ఏమిటో తెలుసుకొని, మనకిచ్చిన టైంలో మన కర్తవ్యాన్ని నిర్వర్తించటం నిర్వర్తించాలనే అర్థంతో 'లూసీ' సినిమాలో టైటిల్ క్యారెక్టర్ పోషించిన స్కార్లెట్ జాన్సన్ చెప్పే మాటల ఉద్దేశ్యం అది. ‘లూసీ’ 2014లో విడుదలైన ఫ్రెంచ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్. ప్రపంచవ్యాప్తంగా 469 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్‌ను బద్దలు కొట్టిన చిత్రం.


లూసీ తైవాన్‌లో చదువుకుంటున్న అమెరికన్ అమ్మాయి. ఆమె బాయ్‌ఫ్రెండ్ రిచర్డ్ ఆమెను సౌత్ కొరియాకు చెందిన ఒక డ్రగ్ లార్డ్‌కి, డ్రగ్స్ మ్యూల్‌గా పని చేసేలా మోసగిస్తాడు. లూసీ ఆ డ్రగ్ లార్డ్ జాంగ్‌కు నాలుగు ప్యాకెట్ల అత్యంత విలువైన సింథటిక్ డ్రగ్ అయిన CPH4 ఉన్న బ్రీఫ్‌కేస్‌ను అందజేస్తుంది. ఆమెను వారు అక్కడే బంధించి, యూరప్ కు డ్రగ్ రవాణా చేయటానికి ఆమె పొత్తికడుపులో బలవంతంగా డ్రగ్ ప్యాకెట్ పెట్టి కుడతారు. లూసీ విదిలించుకోవటానికి ఫైట్ చేసినపుడు ఆమెను వారు కడుపులో తన్నుతారు. అపుడు డ్రగ్ ప్యాకెట్ పగిలిపోయి, డ్రగ్ ఆమె శరీరంలోకి విడుదల అవుతుంది. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఒక మామూలు అమ్మాయి సూపర్ హ్యూమన్ పవర్స్ తో ఏమేం చేస్తుందన్నదే కథ. ఇదొక సైన్స్ ఫిక్షన్ అయినప్పటికి ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. 


సినిమా మొదట్లో ప్రొఫెసర్ నోర్మన్ హ్యూమన్ బ్రెయిన్ కెపాసిటీకి సంబంధించిన సెమినార్ ఇచ్చే సీన్, లూసీ డ్రగ్ రాకెట్లో చిక్కుకునే సీన్ పార్లల్ గా నడుస్తుంటాయి. కడుపులో డ్రగ్ ప్యాకెట్ పగిలిపోయిన తర్వాత లూసీ బ్రెయిన్ కెపాసిటీ 10% పెరుగుతుంది. లూసీకి టెలీపతీ, టెలీకైనెసిస్, మెంటల్ టైం ట్రావెల్ వంటి శక్తులు వస్తాయి. నొప్పిని భరించే శక్తి పెరుగుతుంది. మెంటల్ కెపాసిటీ పెరిగాక ఎమోషన్స్ తగ్గుతాయి. తన కొత్త శక్తులతో తనను బంధించిన వారిని చంపి బయటపడుతుంది. అప్పటికి ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుందనే విషయం లూసీకి తెలియదు. ఆమె తన కడుపులోని డ్రగ్ ప్యాకెట్ ని తీసేయించుకోవటానికి హాస్పిటల్ వెళ్లినపుడు ఆ డ్రగ్ ఆరునెలల గర్భిణులకు పిండం ఎదగటానికి అతి తక్కువ మోతాదులో ఇస్తారని అక్కడి ఆపరేటింగ్ డాక్టర్ ద్వారా తెలుసుకుంటుంది. ఆమె మిస్టర్ జాంగ్ ఉన్న హోటల్ కి వెళ్లి టెలీపతి శక్తిని ఉపయోగించి మిగిలిన మూడు డ్రగ్ ప్యాకెట్స్ జాంగ్ మెదడులోనుంచి బయటకు తీస్తుంది.


లూసీ తన పరిస్థితిని పరిశోధించటానికి ప్రొఫెసర్ నోర్మన్ ను సంప్రదిస్తుంది. ఆమె మిగిలిన డ్రగ్స్ సంపాదించి తన బ్రెయిన్ కెపాసిటీని ఒక్కో దశ పెంచుతూపోతున్నపుడు ఎలాంటి పనులు చేస్తుంది. మెదడు ఏ రకమైన పరిణామానికి గురవుతుంది. తర్వాత లూసీ ఎలా విచ్ఛిన్నమైపోతుంది అనే మలుపులు రెప్పార్పనీయవు. 


లూసీ సెరిబ్రల్ కెపాసిటీ 99కి చేరిన తర్వాత ఆమె టైం ట్రావెల్  మొట్ట మొదటి మనిషి అయిన 'లూసీ'ని కలుసుకుంటుంది. ఈ సినిమాలో అంతర్గతంగా కొన్ని కాన్సెప్ట్ లను ఇంక్లూడ్ చేసారు. క్రియేషన్ ఆఫ్ ఆడమ్ (Creation of Adam) పెయింటింగ్ క్రిస్టియానిటీలో మొదటి మనిషి ఆడమ్ అని నమ్ముతారు. దేవుడు మనిషిని సృష్టించాడు అనే విషయాన్ని, ఈ పెయింటింగ్ లో దేవుడు తన వేలితో తను సృషించిన మనిషిని తాకుతున్నట్టు ఉంటుంది. సినిమా క్లైమాక్స్ లో ఇప్పటి లూసీ, పుట్టుక మొదలైనప్పటి ఆదిమ లూసీని సృష్టించినట్టు తన వేలు తాకుతున్నట్టు పిక్చరైజ్ చేసారు. టైం ని, స్పేస్ ని జయించే సామర్థ్యం తో టైం ట్రావెల్ సాధ్యపడుతుందని లూసీ నిరూపిస్తుంది. "Life was given to us a billion years ago. Now you know what to do with it." అనే డైలాగ్ తో చిత్రం ముగుస్తుంది .


సైన్స్ కి, రెలీజియన్ కి ఉన్న సంబంధాన్ని అత్యంత శక్తివంతమైన ఆర్గాన్ అయిన మెదడు 100 శాతం తన శక్తిని ఉపయోగించగలిగితే అపుడు చావు ఉండదు. మనిషే దేవుడు అనే కాన్సెప్ట్ ను యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా మలచిన ఈ సినిమా ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసినది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


 Also Read: మనుషులంతా జంతువులుగా మారిపోతే? వామ్మో, ఈ మూవీ మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది - ఒళ్లు గగూర్పాటు కలిగించే స్టోరీ