రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారని ఫిల్మ్ నగర్ అంతా కోడై కూస్తోంది. అయితే... వాళ్లిద్దరూ 'యస్! మేం ప్రేమలో ఉన్నాం' అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ, హింట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో చేసే పోస్టుల కారణంగా నెటిజనులు దొరికేస్తున్నారు. లేటెస్టుగా మరోసారి దొరికేశారు. ఏప్రిల్ 5న రష్మిక బర్త్ డే! ఆ రోజే విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'ఫ్యామిలీ స్టార్' విడుదల అవుతోంది. ప్రొడ్యూసర్ 'దిల్' రాజు మొదటి సినిమా 'దిల్' 21 ఏళ్ల క్రితం ఆ రోజే విడుదలైంది. అయితే... లవర్ బర్త్ డేకి గిఫ్టుగా విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలు అయ్యాయి. అది పక్కన పెడితే... (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Vijay Devarakonda's Family Star Movie Review: 'ది' విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. 'గీత గోవిందం' తర్వాత ఆయనతో దర్శకుడు పరశురామ్ చేసిన చిత్రమిది. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరైన ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ ప్రొడ్యూస్ చేశారు. అమెరికాలో ఈ రోజు ప్రీమియర్ షోలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో మీడియా, ఫ్యామిలీలకు సైతం సినిమా చూపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, అంత కంటే ముందు ఒక షో వేశారు. విజయ్ దేవరకొండ, 'దిల్' రాజు ఫ్యామిలీలు సినిమా చూశాయి. మరి, వాళ్ల నుంచి వచ్చిన ఫస్ట్ రివ్యూ ఏంటో తెలుసా? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Tillu Square OTT Streaming Date and Time Deets Inside: సిద్ధు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్‌' (Tillu Square Movie) మూవీ ప్రస్తుతం థియేటర్లో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతుంది. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ రివ్యూస్‌తో బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ సినిమా రూ. 91 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. ఇక వంద కోట్లకు ఇంకా ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఈ సినిమా. ఈ వీక్‌ ఎండ్‌లోపు వందకోట్ల బెంచ్‌ మార్క్‌ క్రాస్‌ చేయడం పక్కా అంటున్నారు ట్రేడ్‌ పండితులు. అలా రికార్డు వసూళ్లుతో ప్రస్తుతం 'టిల్లు స్క్వేర్‌' బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Boney Kapoor Abput Actress Sridevi Biopic: భారతీయ సినీ పరిశ్రమలో దిగ్గజ నటిగా వెలుగొందారు దివంగత శ్రీదేవి. సౌత్, నార్త్ అనే తేడాలేకుండా ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి మెప్పించారు. దుబాయ్‌లో అనూహ్య రీతిలో ఆమె చనిపోవడంతో సినీ అభిమానులు షాక్ అయ్యారు. యావత్ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె మరణం తర్వాత చాలా మంది శ్రీదేవి బయోపిక్ తెరకెక్కించేందుకు ప్రయత్నించారు. తాజాగా ఇదే విషయంపై ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)



బైక్ రైడింగ్, కార్ రేసింగ్ అంటే ఇష్టం కనబరిచే యాక్షన్ హీరోలలో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) ఒకరు. తన సినిమాల్లోనూ బైక్ రైడింగ్, యాక్షన్ సీన్లు సొంతంగా చేయడం ఆయనకు అలవాటు. గతంలో ఆ విధంగా ఎన్నోసార్లు చేశారు. గత ఏడాది ఓ సినిమా షూటింగులో ఆ విధంగా చేయగా... యాక్సిడెంట్ అయ్యింది. అయితే... అదృష్టవశాత్తూ ఆయనకు ఏమీ కాలేదు. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఆ వీడియో విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఇప్పుడు అజిత్ కుమార్ 'విదా ముయార్చి' (Vidaa Muyarchi) అని ఓ యాక్షన్ సినిమా చేస్తున్నారు. హీరోగా ఆయనకు 62వ చిత్రమిది. అందుకని, కొన్ని రోజులు AK 62 Movie అని వ్యవహరించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేస్తున్న చేస్తున్నారు. ప్రజెంట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత ఏడాది న‌వంబ‌ర్‌లో అజ‌ర్‌ బైజాన్ దేశంలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేశారు. అప్పుడు జరిగిన యాక్షన్ వీడియో లేటెస్టుగా లైకా సంస్థ బయట పెట్టింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Also Read: త్రివిక్రమ్‌ సాయం కోరిన బాలీవుడ్‌ 'రాయమణం'? - మరి మాటల మాంత్రికుడు రెస్పాన్స్‌ ఏంటో!