Trending
Ajith Accident Video: షూటింగ్‌లో యాక్సిడెంట్ - డూప్ లేకుండా రిస్కీ స్టంట్ చేసిన అజిత్
Vidaa Muyarchi action scenes making video: కోలీవుడ్ యాక్షన్ హీరో అజిత్ ఓ సినిమా షూటింగ్‌లో ఉండగా యాక్సిడెంట్ అయ్యింది. అయితే... అదృష్టవశాత్తూ ఆయనకు ఏమీ కాలేదు. గత ఏడాది నవంబర్‌లో ఈ ఘటన జరిగింది.
బైక్ రైడింగ్, కార్ రేసింగ్ అంటే ఇష్టం కనబరిచే యాక్షన్ హీరోలలో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) ఒకరు. తన సినిమాల్లోనూ బైక్ రైడింగ్, యాక్షన్ సీన్లు సొంతంగా చేయడం ఆయనకు అలవాటు. గతంలో ఆ విధంగా ఎన్నోసార్లు చేశారు. గత ఏడాది ఓ సినిమా షూటింగులో ఆ విధంగా చేయగా... యాక్సిడెంట్ అయ్యింది. అయితే... అదృష్టవశాత్తూ ఆయనకు ఏమీ కాలేదు. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఆ వీడియో విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
కారులో యాక్షన్ సీక్వెన్స్, ఛేజ్ తీస్తుండగా...
ఇప్పుడు అజిత్ కుమార్ 'విదా ముయార్చి' (Vidaa Muyarchi) అని ఓ యాక్షన్ సినిమా చేస్తున్నారు. హీరోగా ఆయనకు 62వ చిత్రమిది. అందుకని, కొన్ని రోజులు AK 62 Movie అని వ్యవహరించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేస్తున్న చేస్తున్నారు. ప్రజెంట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత ఏడాది నవంబర్‌లో అజర్ బైజాన్ దేశంలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేశారు. అప్పుడు జరిగిన యాక్షన్ వీడియో లేటెస్టుగా లైకా సంస్థ బయట పెట్టింది.
అసలు షూటింగులో ఏం జరిగింది?
అజర్ బైజాన్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో అజిత్ కుమార్ సొంతంగా వెహికల్ డ్రైవ్ చేశారు. రోడ్డు మీద వెళుతున్న సమయంలో ఒక్కసారిగా కారు అదుపు తప్పింది. పక్కకి వెళ్లి పడింది. డూప్ లేకుండా అజిత్ ఓన్ డ్రైవింగ్ చేయడంతో చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయని కోలీవుడ్ టాక్. రిస్కీ స్టంట్స్ చేయడం అజిత్ కుమార్ (Ajith risky stunts)కు కొత్త ఏమీ కాదు. తెలుగులో 'గ్యాంబ్లర్' పేరుతో విడుదలైన 'మంకత్తా' సినిమాలో కూడా రిస్కీ బైక్ స్టంట్ చేశారు.
Also Read: విజయ్ దేవరకొండది బలుపా... పొగరా? కాన్ఫిడెన్సా? ఆయన బిహేవియర్ మీద డీటెయిల్డ్ అనాలసిస్
'విదా ముయార్చి' సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్య, ఉదయనిధి స్టాలిన్, అరుణ్ విజయ్ వంటి చిన్న హీరోలతో సినిమాలు చేసిన ఆయనకు ఫస్ట్ టైమ్ భారీ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష కథనాయికగా నటిస్తుండగా... రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ హౌస్ రిస్కీ స్టంట్ వీడియో విడుదల చేసిన తర్వాత నుంచి అజిత్ డెడికేషన్, కమిట్మెంట్ మీద ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.