Rashmika Birthday: మళ్లీ దొరికిన రష్మిక, విజయ్ దేవరకొండ - బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు!
రష్మిక బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం విజయ్ దేవరకొండ విదేశాలు వెళ్లారని ఫిల్మ్ నగర్ టాక్. సోషల్ మీడియాలో పోస్టులతో మరోసారి వాళ్లిద్దరూ దొరికేశారు.

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారని ఫిల్మ్ నగర్ అంతా కోడై కూస్తోంది. అయితే... వాళ్లిద్దరూ 'యస్! మేం ప్రేమలో ఉన్నాం' అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ, హింట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో చేసే పోస్టుల కారణంగా నెటిజనులు దొరికేస్తున్నారు. లేటెస్టుగా మరోసారి దొరికేశారు.
అబుదాబీలో రష్మిక & విజయ్ దేవరకొండ!
ఏప్రిల్ 5న రష్మిక బర్త్ డే! ఆ రోజే విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'ఫ్యామిలీ స్టార్' విడుదల అవుతోంది. ప్రొడ్యూసర్ 'దిల్' రాజు మొదటి సినిమా 'దిల్' 21 ఏళ్ల క్రితం ఆ రోజే విడుదలైంది. అయితే... లవర్ బర్త్ డేకి గిఫ్టుగా విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలు అయ్యాయి. అది పక్కన పెడితే...
ప్రజెంట్ రష్మిక అబుదాబీలో ఉన్నారు. అక్కడ ఓ రిసార్టులో ఉన్నట్టు ఫోటోలు షేర్ చేశారు. అందులో ఓ నెమలి కనిపించింది. విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' అమెరికా రిలీజ్ గురించి ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులోనూ నెమలి ఉంది. దాంతో ఇద్దరూ కలిసి అబుదాబీ వెళ్లినట్టు నెటిజనులు రెండు ఫోటోలను పక్క పక్కన పెట్టి ప్రూఫ్స్ చూపిస్తున్నారు.
అమెరికాలో రష్మిక బర్త్ డే సెలబ్రేట్ చేయాలని విజయ్ దేవరకొండ ప్లాన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే... అందులో నిజం లేదు. 'ఫ్యామిలీ స్టార్' రిలీజ్ కోసం అమెరికా వెళుతూ వెళుతూ మధ్యలో అబుదాబీలో ఆగారని తెలిసింది. అబుదాబీలో బర్త్ డే సెలబ్రేట్ చేసిన తర్వాత అమెరికా వెళతారు. విజయ్ & రష్మికతో పాటు దేవరకొండ ఫ్యామిలీ కూడా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదీ సంగతి!
Also Read: విజయ్ దేవరకొండది బలుపా... పొగరా? కాన్ఫిడెన్సా? ఆయన బిహేవియర్ మీద డీటెయిల్డ్ అనాలసిస్
'ఫ్యామిలీ స్టార్' సినిమాలో అతిథిగా రష్మిక!
విజయ్ దేవరకొండ & రష్మికా మందన్నా అభిమానులకు మరో గుడ్ న్యూస్ ఏమిటంటే... 'ఫ్యామిలీ స్టార్'లో నేషనల్ క్రష్ అతిథి పాత్రలో నటించారు. మరి, ఆవిడ రోల్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగితే చాలు!
Also Read: నిఖిల్ 'స్వయంభు'లో నభా నటేష్ - యువరాణిగా ఫస్ట్ లుక్ చూశారా?