'కార్తికేయ 2' సెన్సేషనల్ సక్సెస్ సాధించడమే కాదు... యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddhartha)ను పాన్ ఇండియా స్టార్ చేసింది. దేశవ్యాప్తంగా తనకు వచ్చిన ఇమేజ్, గుర్తింపును దృష్టిలో పెట్టుకుని కొత్త సినిమాలు చేస్తున్నారు. అందులో పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'స్వయంభు' ఒకటి. అందులో సంయుక్తా మీనన్ ఓ హీరోయిన్. నభా నటేష్ మరో కథానాయికగా నటిస్తున్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 


నిఖిల్ 'స్వయంభు' సినిమాలో నభా
Nabha Natesh In Swayambhu Movie: 'స్వయంభు'లోని ఇద్దరు హీరోయిన్లలో నభా నటేష్ ఒకరని ఇవాళ సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది. అంతే కాదు... ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ముక్కు పుడక, చెవి దిద్దులు, పాపిడి బిళ్ల చూస్తుంటే పీరియాడిక్ లుక్ నభాకు పర్ఫెక్ట్ సెట్ అయ్యాయని చెప్పవచ్చు. యువరాణిగా నభా బావున్నారు.


Also Read'ఫ్యామిలీ స్టార్' ఫస్ట్ రివ్యూస్ వచ్చేశాయ్ - 'దిల్' రాజు భార్య, విజయ్ దేవరకొండ తండ్రి సినిమా చూసి ఏమన్నారంటే?






గాయం కావడంతో కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నభా నటేష్ కొంత విరామం తర్వాత ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గాయం నుంచి ఆవిడ కోలుకోవడంతో పాటు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియోలో చూపించారు.


Also Readవిజయ్ దేవరకొండది బలుపా... పొగరా? కాన్ఫిడెన్సా? ఆయన బిహేవియర్ మీద డీటెయిల్డ్ అనాలసిస్



Swayambhu movie cast and crew: హీరోగా నిఖిల్ 20వ సినిమా 'స్వయంభు'. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకుడు. 'ఠాగూర్' మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఫెరోషియస్ వారియర్ రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన ఆయన ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోందీ 'స్వయంభు'. ఇది కాకుండా నిఖిల్ మరో రెండు సినిమాలు చేస్తున్నారు.


Also Read: ఉద్యమంతో ఒక తరాన్ని మేల్కొల్పిన నాయకుడి కథ... తెలంగాణ జితేందర్ రెడ్డి బయోపిక్



'స్వయంభు' చిత్రానికి 'కెజియఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ సంగీత దర్శకుడు. స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు చేసిన మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిఖిల్ హీరోగా, సంయుక్తా మీనన్ & నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు: వాసుదేవ్ మునెప్పగారి, ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాహరన్, సహ నిర్మాతలు: విజయ్ కామిశెట్టి - జిటి ఆనంద్, నిర్మాతలు: భువన్ - శ్రీకర్, నిర్మాణ సంస్థ: పిక్సెల్ స్టూడియోస్, సమర్పణ: ఠాగూర్ మధు, రచన & దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి.