Tillu Square Box Office 6 Days Collection: బాక్సాఫీసు వద్ద టిల్లుగాడు (Tillu Square Box Office Collections) అదరగొడుతున్నాడు. తగ్గేదే లే అంటూ వంద కోట్ల దిశగా పరుగులుపెడుతున్నారు. యంగ్‌ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన టిల్లు స్క్వేర్‌ మార్చి 29న విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన ఫస్ట్‌డే ఫస్ట్‌ షో నుంచి ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. 'డీజే టిల్లు' సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా వరల్డ్‌ బాక్సాఫీసు వద్ద దూకుడు చూపిస్తుంది. ఫస్ట్‌ పార్ట్‌కు మించిన ఫన్‌, ట్విస్ట్‌ ఉండటంతో ఆడియన్స్‌ని 'టిల్లు స్క్వేర్‌' ఆకట్టుకుంటుంది. దీంతో థియేటర్లకు జనాలు క్యూ కడుతుండటంతో రోజురోజుకు మరింత వసూళ్లు పెంచుకుంటూ పోతుంది. మొత్తానికి అదిరిపోయే టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 91 గ్రాస్‌ వసూళ్లు చేసింది.


ఇక వంద కోట్ల బెంజ్‌ మార్క్‌కు ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉందంటూ తాజాగా మూవీ టీం టిల్లు స్క్వేర్‌ వసూళ్లు వివరాలు వెల్లడించింది. చూస్తుంటే నేటి కలెక్షన్స్‌తో రూ.100 కోట్ల మార్క్‌ కొట్టేలా ఉన్నాడు టిల్లు గాడు. సిద్ధూ జొన్నలగడ్డ క్రేజ్‌ గురించి చెప్పనవసరం లేదు. తనదైన డైలాగ్‌, మ్యానరిజంతో యూత్‌ను బాగా ఆకట్టుకున్నాడు. ఇక డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌కు చిత్రాలను వన్‌ మ్యాన్‌ షో నడిపించాడు. తనదైన డైలాగ్‌ డెలివరితో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. డీజే టిల్లు మించి ఇందులో మరింత ఫన్‌ అందించాడు. ఫైనల్‌గా 'టిల్లు స్క్వేర్‌'తో వంద కోట్ల హీరో అనిపించుకోబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ  నిర్మించిన ఈ చిత్రాన్ని మల్లిక్‌ రామ్‌ డైరెక్టె చేశారు. ఈ సినిమాలో సిద్ధు హీరోగా నటించడమే కాదు.. స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. 







'టిల్లు స్క్వేర్‌'కి ఫ్యాన్సీ డీల్‌


Tillu Square OTT Release and Streaming Platform: ఈ మధ్య మూవీ థియేటర్లోకి రాగానే వెంటనే ఏ ఓటీటీ అని వెతికేస్తున్నారు ఆడియన్స్‌. బిగ్‌స్క్రీన్‌పైకి వచ్చిన రెండ వ్యవధి లేదా రెండు నెలల వ్యవధిలోనే ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుంది. మూవీకి ఉన్న బజ్‌ ప్రకారం ఓటీటీలు డీల్స్‌ కుదుర్చుకుంటున్నాయి. డీజే టిల్లుతో భారీ విజయంతో టిల్లు స్క్వేర్‌పై అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజ్‌ దృష్ట్యా  మూవీ కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీగా పడగా ఫైనల్‌గా నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ డీల్‌కు టిల్లు స్క్వేర్‌ రైట్స్‌ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌, స్ట్రీమింగ్‌పై నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ప్రకటన రానుంది. మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కాబట్టి రెండు నెలల తర్వాతే ఈ సినిమా ఓటీటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిత్రం మే రెండో వారం లేదా మూడో వారంలో ఓటీటీ రానుందని తెలుస్తోంది. ఇది నెటిఫ్లిక్స్‌, మూవీ మేకర్స్‌తో ఒప్పందం ప్రకారం 'టిల్లు స్క్వేర్‌'ను డిజిటల్‌ స్ట్రీమింగ్‌కి రానుంది.