Trivikram Enter Into Bollywood Ramayana: బాలీవుడ్‌ డైరెక్టర్‌ నితీష్‌ తివారి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'రామయణం' తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌, సాయి పల్లవి లీడ్‌ యాక్టర్స్‌గా కన్‌ఫాం అయ్యారు. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్‌పై ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ అయితే లేదు. కానీ, ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మాత్రం శరవేగంగా జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. అన్ని పనులు అయిపోగానే గ్రాండ్‌గా మూవీ లాంచ్‌ చేసి చకచక షూటింగ్‌ను పూర్తి చేసేందుకు నితీష్‌ గట్టిగా ప్లాన్‌ చేస్తున్నాడట. నితీష్‌ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్ని అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవల్లో రూపొందించబోతున్నారట. అందుకే ఈ మూవీ మేకింగ్‌ని ఛాలేంజింగ్‌ తీసుకుని గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నాడు.


ఇండియాలోనే ఇది అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం కావడంలో అంతా నితీష్‌ 'రామయణం' గురించే చర్చికుంటున్నారు. ఈ క్రమంలో ఇంకా సెట్స్‌పైకి రాకుండానే ఈ చిత్రం గురించి  రోజుకో పుకారు బయటకు వస్తుంది. ఇటీవల ఈ సినిమాలోని స్టార్‌ కాస్ట్‌ ఇదేనంటూ ఓ జాబితా బయటకు వచ్చింది. అయితే ఇది పాన్‌ ఇండియా మూవీ కావడంతో నితీష్‌ ప్రతి భాష అనువాదం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఏ భాషకు ఆ భాషలో మాటల కోసం ఆయన ప్రముఖులను సంప్రదిస్తున్నారట. ఈ క్రమంలో 'రామయణం' తెలుగు వెర్షన్‌ కోసం డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ సాయం కోరినట్టు ఇన్‌సైడ్‌ సర్కిల్లో టాక్. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ వార్తల్లో నిజమేంత అనేది తెలియదు కానీ. త్రివిక్రమ్‌ డైలాగ్‌ రైటింగ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


ఆయన డైలాగ్స్‌ ఒక్క ముక్కలో ఉన్న అందులో ఎంతో అర్థం ఉంటుంది. అందుకే ఆయనకు 'మాటల మాంత్రికుడు' అనే బిరుదు కూడా ఉంది. ఇక ఇతిహాసాలు, పురాణాల మీద మంచి పట్టు ఉన్న త్రివిక్రమ్‌ రామయణంకు అద్భుతమైన సంభాషణ ఇస్తాడనడంలో సందేహం లేదు. కానీ, ఆయన దీనికి ఒప్పుకుంటారో లేదో అనేదే సమస్య. త్రివిక్రమ్‌ డైరెక్టర్‌ అయ్యాక ఇతరు సినిమాలకు డైలాగ్స్‌ రాయడం మానేశారు. ఆయన సినిమాకు ఆయనే సంబాషణలు అందిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌తో ఉన్న సన్నిహితం, ఆయనపై ఉన్న అభిమానం మేరకు భీమ్లా నాయక్‌, బ్రో చిత్రాలకు కలం అందించారు. మరి రామయణం బాలీవుడ్‌ సినిమా కాబట్టి త్రివిక్రమ్‌ దినికి ఒప్పుకుంటారో! లేదో అనే సందేహాలు వస్తున్నాయి. ఇది ఇతిహాస చిత్రం కాబట్టి ఆయన దీనికి ఒప్పుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే నితీష్‌ రామయణాన్ని ఏ భాషకు ఆ భాషలో ప్రత్యేకంగా ప్లాన్‌ చేస్తున్నారట.



అవసరం అయితే హిందీతో పాటు  తెలుగు, తమిళం.. ఈ మూడు భాషల్లో వేరువేరుగా చిత్రీకరణ జరిపే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అలా అయితే త్రివిక్రమ్‌ ఎస్‌(Yes) చెప్పేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇదే నిజం అయ్యి త్రివిక్రమ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలే.. ఈ రామయణం తెలుగులో అద్భుతమైన సంబాషణలు చూడోచ్చు. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే సెకండ్‌ ఛాయిస్‌గా సాయి మాధవ్‌ బుర్రాని అనుకుంటున్నారట. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామయణంకు త్రివిక్రమ్‌ సంభాషణలు తొడైతే ఆ మూవీ నెక్ట్స్‌ లెవల్లో ఉంటాయనడం సందేహం లేదు. మరి దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి అప్‌డేట్‌ వస్తుందో చూడాలి!


Also Read: బాక్సాఫీసు వద్ద టిల్లుగాడి దూకుడు - వంద కోట్ల మార్క్‌కి దగ్గర్లో'టిల్లు స్క్వేర్‌', ఆరు రోజుల వసూళ్లు ఎంతంటే..