Tillu Square OTT Streaming Date and Time Deets Inside: సిద్ధు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్‌' (Tillu Square Movie) మూవీ ప్రస్తుతం థియేటర్లో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతుంది. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ రివ్యూస్‌తో బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ సినిమా రూ. 91 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. ఇక వంద కోట్లకు ఇంకా ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఈ సినిమా. ఈ వీక్‌ ఎండ్‌లోపు వందకోట్ల బెంచ్‌ మార్క్‌ క్రాస్‌ చేయడం పక్కా అంటున్నారు ట్రేడ్‌ పండితులు. అలా రికార్డు వసూళ్లుతో ప్రస్తుతం 'టిల్లు స్క్వేర్‌' బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది.


ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ రొమాన్స్‌ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సిద్ధు పంచ్‌ డైలాగ్స్‌, డైలాగ్‌ డెలివరికి యూత్‌ బాగా కనెక్ట్‌ అయ్యింది. ప్రతి సీన్‌లో తనదైన పంచ్‌లు, కామెడీతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. మొత్తానికి డీజే టిల్లు లాగే టిల్లు స్క్వేర్‌ను వన్‌ మ్యాన్‌ షోలా ముందుకు నడిపించాడు. ఇందులో సిద్ధు మ్యానరిజంకు అమ్మాయిలు మాత్రం ఫిదా అవుతున్నారు. ఫైనల్‌గా ఈ మూవీ ఫస్ట్‌ వీక్‌లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించి మేకర్స్‌ను లాభాల్లో పడేసింది. ఇక థియేటర్లో ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీలో సందడి చేయబోతుందట. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన తాజాగా ఓ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.


నెల రోజుల్లోనే ఓటీటీకి?


Tillu Square OTT Update: డీజే టిల్లు బ్లాక్‌బస్టర్‌తో టిల్లు స్క్వేర్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో విడుదలకు ముందే ఫ్యాన్సీ రేటు ఈ చిత్రం అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఈనెల 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌ ఇవ్వనుందనే గుసగుసల వినిపిస్తున్నాయి. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌ దీనిపై ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా ఇవ్వనుందట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని, అంతా ఒకే అయితే 'టిల్లు స్క్వేర్‌'ను ఏప్రిల్‌ 26న విడుదల చేసేందుకు సదరు సంస్థ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. అయితే కొందరు ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. 'టిల్లు స్క్వేర్‌' బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది.. కాబట్టి ఈ మూవీ రెండు నెలల తర్వాతే ఓటీటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ రావాలంటే నెటిఫ్లిక్స్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 


Also Read: Raashii Khanna New Home: హైదరాబాద్‌లో మూడో ఇల్లు కొన్న రాశీ ఖన్నా - లీకైన గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?