ముంబై, ఢిల్లీ లేదా పంజాబ్... ఉత్తరాది నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్లు ఎవరైనా సరే, టాలీవుడ్ తమకు రెండో ఇల్లు వంటిది అని చెబుతూ ఉంటారు. తెలుగు నేర్చుకుని హైదరాబాద్ సిటీలో సెటిల్ అవ్వాలని ఉందని, ఇక్కడి ప్రజలతో పాటు సిటీ కల్చర్ తనకు బాగా నచ్చిందని చెప్పడం కూడా కామన్. యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా (Raashii Khanna) చెప్పడం కాదు... చేతల్లో చూపించారు. ఇక్కడ సెటిల్ అవ్వడం కాదు... ఇల్లు మీద ఇల్లు కొంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...


మూడో ఇంట్లో అడుగు పెట్టిన రాశీ ఖన్నా
Raashii Khanna buys new home in Hyderabad: హైదరాబాద్ సిటీలో రాశీ ఖన్నా కొత్త ఇల్లు కొన్నారు. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం చేశారు. ఆల్రెడీ ఆమెకు భాగ్య నగరంలో రెండు ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు గృహ ప్రవేశం చేసినది మూడో ఫ్లాట్. తల్లితో పాటు కొంత మంది సన్నిహితులను మాత్రమే ఈ శుభ కార్యానికి రాశీ ఖన్నా ఆహ్వానించింది. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట లీక్ అయ్యాయి.






తెలుగులో యంగ్ హీరోల సరసన పలు హిట్ సినిమాలు చేసిన రాశీ ఖన్నా... అటు తమిళ సినిమాలు సైతం చేశారు. ప్రస్తుతం హిందీలో వరుసగా వెబ్ సిరీస్, ఫిలిమ్స్ చేస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి రాశీ ఖన్నా నటించిన 'యోధ' ఈ మధ్య థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రజెంట్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ మీద కాన్సంట్రేట్ చేసిన రాశీ ఖన్నా... గృహప్రవేశం కోసం హైదరాబాద్ వచ్చారు.


Also Read'ఫ్యామిలీ స్టార్' ఫస్ట్ రివ్యూస్ వచ్చేశాయ్ - 'దిల్' రాజు భార్య, విజయ్ దేవరకొండ తండ్రి సినిమా చూసి ఏమన్నారంటే?


Raashi Khanna upcoming movies: ప్రస్తుతం తెలుగులో రాశీ ఖన్నా 'తెలుసు కదా' సినిమా చేస్తున్నారు. 'టిల్లు స్క్వేర్' సినిమా సక్సెస్ హుషారులో ఉన్న సిద్ధూ జొన్నలగడ్డ అందులో హీరో. నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. తమిళంలో సుందర్ సి 'అరణ్మణై 4' చేశారు. ఇటీవల విడుదలైన ఆ సినిమా ట్రైలర్, అందులో రాశీ ఖన్నా లుక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. హిందీలో '12th fail' ఫేమ్ విక్రాంత్ మెస్సీతో 'ది సబర్మతీ రిపోర్ట్' సినిమా చేశారు.


Also Readవిజయ్ దేవరకొండది బలుపా... పొగరా? కాన్ఫిడెన్సా? ఆయన బిహేవియర్ మీద డీటెయిల్డ్ అనాలసిస్



హిందీ సినిమా 'మద్రాస్ కేఫ్'తో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన రాశీ ఖన్నా... ఆ వెంటనే తెలుగు సినిమాల్లోకి వచ్చారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలు నటించిన 'మనం'లో అతిథి పాత్ర చేశారు. నాగశౌర్య సరసన 'ఊహలు గుసగుసలాడే'తో కథానాయికగా టాలీవుడ్ కెరీర్ స్టార్ట్ చేశారు. 'జిల్', 'బెంగాల్ టైగర్', 'జై లవ కుశ', 'రాజా ది గ్రేట్', 'వెంకీ మామ', 'ప్రతి రోజూ పండగే' వంటి హిట్ ఫిలిమ్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.


Also Read: షూటింగ్‌లో యాక్సిడెంట్ - డూప్ లేకుండా రిస్కీ స్టంట్ చేసిన అజిత్