చిరు ‘మెగా’ కాన్సెప్ట్ - పంచ భూతాలతో చిరంజీవి ప్రయోగం, 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జోనర్‌లో!


మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే 'మెగా 157' ప్రాజెక్టుకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న UV క్రియేషన్స్ సంస్థ కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టును రిలీజ్ చేస్తూ మెగాస్టార్ కి బర్త్ డే విషెస్ ను అందజేసింది. ఈసారి మెగాస్టార్ ఓ హిస్టారికల్ సోషియో ఫాంటసీ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నట్టు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాకి 'బింబిసార' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి)


'సలార్' ఖాతాలో మరో రికార్డ్ - లక్ష డాలర్లు దాటేసిన USA ప్రీ సేల్స్ !


సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీస్ లో 'సలార్' కూడా ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకి కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉండగా.. రిలీజ్ కి ముందే 'సలార్' సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తోంది. తాజాగా సలార్ మూవీ యూఎస్ లో టికెట్స్ ఫ్రీ సేల్స్ ద్వారా నయా రికార్డ్ క్రియేట్ చేసింది (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి).


పవన్ కళ్యాణ్ కుమారుడిగా జన్మించడం అకిరా తప్పా? నెటిజన్ ఘాటు ప్రశ్నకు రేణూ దేశాయ్ క్లారిటీ రిప్లై


ఒకానొక సమయంలో హిందీ చిత్రసీమను నేపోటిజం చర్చ ఇబ్బంది పెట్టింది. మరీ ముఖ్యంగా రణబీర్ కపూర్, ఆలియా భట్, అనన్యా పాండే తదితర తారలు చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నారు. స్టార్ కిడ్స్, చిత్రసీమతో సంబంధం ఉన్న యువతకు సులభంగా అవకాశాలు వస్తున్నాయని విమర్శలు వచ్చాయి. అయితే, వాళ్ళందరూ సినిమాల్లోకి వచ్చిన తర్వాత వారి గురించి చర్చ నడిచింది. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ (Akira Nandan) సినిమాల్లోకి రాలేదు. కానీ, అతను వార్తల్లో నిలిచారు. అందుకు కారణం ఏమిటి? పూర్తి వివరాలు ఏమిటి? అనేది చూస్తే... (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి).  


అది సెంటిమెంట్ కాదు - 'ఆర్ఎక్స్ 100', 'బెదురులంక' మధ్య కో ఇన్సిడెన్స్ : హీరో కార్తికేయ ఇంటర్వ్యూ


'ఆర్ఎక్స్ 100' సినిమాతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ (Kartikeya Gummakonda) నటించిన లేటెస్ట్ మూవీ 'బెదురులంక 2012' (Bedurulanka 2012 Movie). నేహా శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాను లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బెనర్జీ ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ శుక్రవారం (ఆగస్టు 25) సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఓ మీడియాతో ముచ్చటించిన కార్తికేయ, సినిమాకు సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి).


‘నీతోనే డాన్స్’ షోలో విజయ్ దేవరకొండ సందడి - అంతా రౌడీ పెళ్లి గురించే రచ్చ


బుల్లితెరపై ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలు, రియాలిటీ షోలు ప్రసారమవుతూ ప్రేక్షకులను బాగా ఎంజాయ్ చేసేలా చేస్తాయి. వాళ్ళ పర్ఫామెన్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఇక మధ్య మధ్యలో సెలబ్రెటీలు చేసే హంగామా కూడా మామూలుగా ఉండదు. అప్పుడప్పుడు స్పెషల్ గెస్ట్ లుగా హీరో హీరోయిన్స్ వచ్చి బాగా సందడి చేస్తారు. తాజాగా ‘నీతోనే డాన్స్’ షోకు విజయ్ దేవరకొండ వచ్చి బాగా సందడి చేశాడు (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి).



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial