ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి. ఆయన బాటలో ప్రయాణించిన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ సైతం అదే స్థాయిలో అభిమానులను సంపాదించారు. చిరు తమ్ముడిగానే కాకుండా పవర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిరు పుట్టిన రోజు నేపథ్యంలో పవన్.. తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. అలనాటి పొటోతో చిరంజీవికి విసెష్ చెప్పారు.


అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు


అన్నయ్య పుట్టినరోజుకు ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేశారు పవన్. చాలా ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ చాలా చిన్నగా ఉన్నప్పటి ఫోటో ఒకటి ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చారు. ఈ ఫోటోలో చిరంజీవి కేక్ కట్ చేస్తుండగా.. పవన్ కళ్యాణ్ పక్కన నిలుచున్నారు. ‘అడుగడుగునా స్ఫూర్తినిచ్చిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు’ అనే క్యాప్షన్‌తో ఈ థ్రోబ్యాక్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. ఈ పోస్ట్ కామెంట్స్‌లో కూడా పవన్ ఫాలోవర్స్ అంతా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.






పవన్ కళ్యాణ్.. తన అన్న చిరంజీవి మీద అభిమానం, ప్రేమ గురించి సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటారు. తన అన్న వల్లే తను ఈ స్థాయిలో ఉన్నానని బహిరంగంగానే చాలాసార్లు తెలిపారు పవన్. అసలైతే తనకు హీరోగా మారాలన్న ఆలోచన మొదట్లో లేదని, కానీ అన్న కోసమే యాక్టింగ్ చేయడం మొదలుపెట్టానని కూడా అన్నారు. ఒకప్పుడు మెగాస్టార్ తమ్ముడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన పవన్.. ఆ తర్వాత తన స్టైల్‌తో ప్రత్యేకంగా అభిమానులను సంపాదించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ అభిమానులే. అయితే, ఈ అభిమానం రాజకీయాలకు మాత్రం కలిసి రావడం లేదు. అభిమానులను నమ్ముకుని, ప్రజలకు సేవ చేయడం కోసం ‘ప్రజారాజ్యం’ పార్టీని ఏర్పాటు చేసిన చిరంజీవి.. ఆ తర్వాత ఎలాంటి ఫలితాలు చూశారో తెలిసిందే. ప్రస్తుతం పవన్ పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నాడు. మరి, విజయం సాధిస్తారా లేదా అనేది చూడాలి.


చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా  Mega156 & Mega157 సినిమాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి తన కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ 156వ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో Mega156 మూవీ ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.


''4 దశాబ్దాలుగా వెండితెరను శాసించిన లెగసీ! భావోద్వేగాలను రేకెత్తించే వ్యక్తిత్వం! ఆఫ్ స్క్రీన్ లోనూ సెలబ్రేట్ చేసుకునే వ్యక్తి.. 155 చిత్రాల తర్వాత, ఇప్పుడు #MEGA156 సినిమా ఒక మెగా రాకింగ్ ఎంటర్టైనర్ అవుతుంది'' అని మేకర్స్ ట్వీట్ చేసారు. ''ప్రేక్షకులను అలరించే, తరతరాలకు స్ఫూర్తినిచ్చే ప్రయాణం.. ఆన్ స్క్రీన్ బ్రిలియెన్స్ కి, ఆఫ్ స్క్రీన్ మాగ్నానిమిటీకి నిర్వచనంగా నిలిచిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు'' అని పేర్కొన్నారు. 


Also Read: 'చంద్రయాన్ 3' పోస్ట్‌పై స్పందించిన ప్రకాశ్ రాజ్, అది జస్ట్ జోక్?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial