Neethone Dance: బుల్లితెరపై ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలు, రియాలిటీ షోలు ప్రసారమవుతూ ప్రేక్షకులను బాగా ఎంజాయ్ చేసేలా చేస్తాయి. వాళ్ళ పర్ఫామెన్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఇక మధ్య మధ్యలో సెలబ్రెటీలు చేసే హంగామా కూడా మామూలుగా ఉండదు. అప్పుడప్పుడు స్పెషల్ గెస్ట్ లుగా హీరో హీరోయిన్స్ వచ్చి బాగా సందడి చేస్తారు. తాజాగా ‘నీతోనే డాన్స్’ షోకు విజయ్ దేవరకొండ వచ్చి బాగా సందడి చేశాడు.
గత కొన్ని రోజుల నుంచి స్టార్ మా లో నీతోనే డాన్స్ షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో సదా, ఒకప్పటి నటి రాధ జడ్జిలుగా ఉండగా శ్రీముఖి యాంకర్ చేస్తూ తన అంద చందాలతో చూపులు తిప్పుకోకుండా చేస్తుంది. ఇక ఇందులో బుల్లితెర సీరియల్ నటి నటులు, మరి కొంతమంది సెలబ్రిటీలు రియల్ కపుల్స్ తో డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తూ బాగా ఆకట్టుకుంటూ ఉంటారు.
ఇక ఇప్పటికీ పలు ఎపిసోడ్లు పూర్తి కాగా మొత్తానికి గ్రాండ్ ఫినాలే కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు. ఇక అందులో సెలబ్రెటీల పర్ఫామెన్స్ మామూలుగా లేదని చెప్పాలి. ఒకరిని చూసి మరొకరు పోటీగా నిలిచారు. స్టెప్పులతో స్టేజిని అదరగొట్టేశారు. మధ్యలో శ్రీముఖి వారితో బాగా ఎంటర్టైన్మెంట్ చేయించింది. ఇక ఖుషి మూవీ ప్రమోషన్స్ భాగంలో విజయ్ దేవరకొండ కూడా ఈ షో కి వచ్చి బాగా సందడి చేశాడు.
ఎంట్రీ తోనే ‘‘అది నా పిల్ల’’ అని డైలాగ్ కొడుతూ ఖుషి సినిమాలోని సాంగ్ తో డాన్స్ చేశాడు. ఇక సదాతో అప్పట్లో థియేటర్లో మీ సినిమాలు చాలా చూశాము అంటూ తనను తన మాటలతో పడేశాడు. ఇక శ్రీముఖి అక్కడ పర్ఫామెన్స్ చేసిన సెలబ్రిటీలను తీసుకువచ్చి ఇందులో వీళ్లకు పెళ్లిళ్లు అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని విజయ్ దేవరకొండ ను ప్రశ్నించింది. దాంతో నటరాజ్ మాస్టర్ కు ఐదు సంవత్సరాలు కావచ్చు అనటంతో వెంటనే మాస్టర్ 13 ఇయర్స్ అని చెప్పి షాక్ ఇచ్చాడు.
ఇక మీ పెళ్లి ఎప్పుడు అని శ్రీముఖి విజయ్ ని అడగటంతో.. అందరితో మాట్లాడుతున్నాను అని విజయ్ డైలాగ్ చెబుతుండగా అందరిని చేసుకోవడం కుదరదు కదా అంటూ శ్రీముఖి పంచ్ వేసింది. ఇక ఇంట్లో వాళ్లు తమకు కావలసిన వాళ్ళని చేసుకోమని అంటున్నారని, వాళ్లు తొందర పెడుతున్నారు అని అన్నాడు. దీంతో రాధ వారి సంతోషం కోసం చేసుకోవాలి కదా అని అన్నారు. అందుకే వాళ్లనే పెళ్లి చేసుకోమని అన్నాను అని విజయ్ అనటంతో అక్కడ నవ్వులు విరిశాయి. మొత్తానికి ప్రోమో మొత్తం బాగా సందడిగా సాగిందని చెప్పాలి.
[/insta]
also read : Trinayani August 22th: నాగయ్యను కుండలో బంధించిన తిలోత్తమా.. అత్తపై అనుమాన పడుతున్న నయని?