Tollywood Updates Today : ప్రభాస్ ఫస్ట్ లుక్, మిథునం రచయిత కన్నుమూత, పవన్ పొలిటికల్ విజన్ - నేటి టాప్ సినీ విశేషాలు

'ప్రాజెక్ట్ కె' ఫస్ట్ లుక్ నుంచి పవన్ పొలిటికల్ విజన్ గురించి సముద్రఖని చేసిన వ్యాఖ్యల వరకు... ఈ రోజు ఐదు గంటల వరకు జరిగిన టాప్ 5 సినిమా విశేషాలు 

Continues below advertisement

'ప్రాజెక్ట్ కె'లో హాలీవుడ్ సూపర్ హీరోలను తలదన్నేలా రెబల్ స్టార్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా (Project K Movie). ఈ నెల 21న టైటిల్ రివీల్ చేయనున్నారు. అంత కంటే ముందు అభిమానులకు కానుక ఇచ్చారు. ఈ రోజు ప్రభాస్ ఫస్ట్ లుక్ (Prabhas First Look Project K) విడుదల చేశారు. దీని కంటే ముందు దీపికా పదుకోన్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ లుక్ చూస్తే యోధుడిగా ఉన్నారు. హాలీవుడ్ సూపర్ హీరోలను తలదన్నేలా ఆయన లుక్ ఉందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి). 

Continues below advertisement

పవన్ కళ్యాణ్ జాతీయ నాయకుడు, ఆయన విజన్ వేరు - సముద్రఖని సంచలన వ్యాఖ్యలు

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కేవలం తెలుగు చిత్రసీమలో కథానాయకుడు మాత్రమే కాదు... తెలుగు రాష్ట్ర రాజకీయాలలో చాలా కీలకమైన వ్యక్తి. జనసేన పార్టీ  అధినేత. సినిమాలు, రాజకీయాలను వేర్వేరుగా చూడాలని పవన్ సహా చిత్రసీమ ప్రముఖులు చెప్పే మాట. అయితే... జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాల్లో సన్నివేశాలను రాజకీయ కోణంలో చూసే ప్రేక్షకులు, తెలుగు ప్రజలు ఉన్నారు. పవన్ సినిమాల్లో నటించిన, పవన్ సినిమాలకు పని చేసిన దర్శక నిర్మాతలు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సముద్రఖని కూడా పవన్ పొలిటికల్ విజన్ గురించి మాట్లాడారు (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి). 

లారీ కిందపడి చనిపోదాం అనుకున్నా, చివరికి డ్రైవర్‌గా మారా: ‘ప్రేమదేశం’ అబ్బాస్

సినీ హీరో అబ్బాస్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ‘ప్రేమదేశం’ అబ్బాస్ అంటే ఇప్పటితరం కూడా గుర్తుపడతారు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. తమిళ్ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించాడు. తర్వాత వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. అప్పట్లో అబ్బాస్ కు అమ్మాయిల కలల రాజకుమారుడిగా పేరు ఉండేది. అంతేకాదు అబ్బాస్ కటింగ్ కు కూడా విపరీతమైన క్రేజ్ ఉండేది. యూత్ లో అంత క్రేజ్ సంపాదించుకున్న అబ్బాస్ కొన్నాళ్ల తర్వాత సినిమాల నుంచి దూరం అయ్యాడు. కుటుంబాన్ని పోషించుకోవడానికి మెకానిక్, డ్రైవర్ గా మారాడు. అతను ఎక్కడ ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు అనేది చాలా రోజులు ఎవరికీ తెలియలేదు. ఇటీవలే ఇండియా వచ్చిన అబ్బాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన గతాన్ని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అబ్బాస్ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).  

'మిథునం' రచయిత శ్రీరమణ కన్నుమూత

ప్రముఖ రచయిత, సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీ రమణ (70) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు (జులై 19) బుధవారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న 'మిథునం' సినిమాకు కథ అందించారు. బాపు, రమణ వంటి దిగ్గజాలతో కలిసి పని చేసిన అనుభవం ఆయనది. పేరడీ రచనలకు శ్రీ రమణ ఎంతగానో ప్రసిద్ధి చెందారు (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).

జీవిత, రాజశేఖర్‌‌లకు జైలుశిక్ష - చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పరువునష్టం కేసులో కీలక తీర్పు!

పరువు నష్టం కేసులో ప్రముఖ సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు  గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యాయ స్థానం వారికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. హైదరాబాద్ నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెజిస్ట్రేట్ ఈ సంచలన తీర్పును వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై గతంలో  వారు చేసిన ఆరోపణలకు సంబంధించి దాఖలైన పరువు నష్టం దావాపై విచారణ జరిపిన న్యాయస్థానం జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement