'బాహుబలి' సినిమా గుర్తు ఉందా? అందులో సేతుపతి పాత్రలో నటించిన రాకేష్ వర్రే (Rakesh Varre) గుర్తు ఉన్నారా? అదేనండీ... గుడిలో తన మీద చెయ్యి వేయబోతే అనుష్క వేళ్ళు నరికేస్తారు కదా! ఆ తర్వాత రాజదర్బార్ సన్నివేశంలో ప్రభాస్ చేతిలో శిక్షకు గురి అవుతారు. ఆ రాకేష్ వర్రే నిర్మాతగా మారారు.  


రాకేష్ వర్రే నిర్మాణంలో 'పేకమేడలు'
రాకేష్ వర్రే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించారు. ఇంతకు ముందు ఆయన హీరోగా నటించిన 'ఎవ్వరికీ చెప్పొద్దు'ను ఆ పతాకంపై నిర్మించారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఓటీటీలోనూ మంచి ఆదరణ సొంతం చేసుకుంది.


ఇప్పుడు రాకేష్ వర్రే మరో సినిమా నిర్మించారు. అయితే... అందులో హీరో ఆయన కాదు. కొత్త హీరో హీరోయిన్లను ఎంకరేజ్ చేస్తూ 'పేకమేడలు' సినిమా నిర్మించారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ సంస్థలో ప్రొడక్షన్ నంబర్ 2గా రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ (Pekamedalu First Look) మోషన్ పోస్టర్ ఈ రోజు విడుదల చేశారు.



'నా పేరు శివ', 'అంధగారం' తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ (Vinod Kishan)ను 'పేక మేడలు'తో హీరోగా పరిచయం చేస్తున్నారు రాకేష్ వర్రీ. ఈ సినిమాలో వినోద్ కిషన్ సరసన అనూష కృష్ణ నటిస్తున్నారు. ఆమెకూ తొలి తెలుగు చిత్రమిది. చిత్ర దర్శకుడు నీలగిరి మామిళ్ళకు సైతం ఇది మొదటి సినిమా. ఇంకా ఈ సినిమాలో యాభై మంది నూతన నటీనటులు ఉన్నారని రాకేష్ వర్రే తెలిపారు. 


ఆగస్టులో 'పేక మేడలు' విడుదల
Pekamedalu Movie Release Date : ఆగస్టులో 'పేక మేడలు' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు దర్శక - నిర్మాతలు తెలిపారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానటువంటి కథతో సినిమా తీసినట్లు, సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని వారు పేర్కొన్నారు. 


'పేక మేడలు' ఫస్ట్ లుక్ చూస్తే... 360 డిగ్రీస్ ఫోటోలో హీరో వినోద్ కిషన్ ఉన్నారు.  లుంగీ కట్టుకుని, పైన బనియన్ వేసిన అతడిని చూస్తే... బస్తీ పోరగాడు అనిపించక మానదు. పైగా...  హైదరాబాద్ బస్తీ, సిటీకి మధ్యలో ఆకాశానికి నిచ్చెన వేయడం చూస్తుంటే, ఊహల్లో పేక మేడలు కడుతున్నట్లు ఉంది.


Also Read మళ్ళీ రెమ్యూనరేషన్ పెంచేసిన శ్రీ లీల - నితిన్ సినిమాకు డిమాండ్ మామూలుగా లేదుగా!


వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తున్న 'పేక మెడలు' సినిమాకు సౌండ్ డిజైనర్ : రంగనాథ్ రేవి, సౌండ్ మిక్సింగ్ : కన్నన్ గన్ పత్, కూర్పు : సృజన అడుసుమిల్లి - హంజా అలీ, కాస్ట్యూమ్ డిజైనర్ : మేఘన శేషవపురి, స్క్రీన్ ప్లే : హంజా అలీ - శ్రీనివాస్ ఇట్టం - నీలగిరి మామిళ్ళ, మాటలు & పాటలు : భార్గవ కార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కేతన్ కుమార్, ఛాయాగ్రహణం : హరిచరణ్ కె, సంగీతం : స్మరన్, సహా నిర్మాత: వరుణ్ బోర, నిర్మాణ సంస్థ : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్, నిర్మాత : రాకేష్ వర్రే, రచన & దర్శకత్వం : నీలగిరి మామిళ్ళ.


Also Read : బాలీవుడ్‌కు మహానటి కీర్తీ సురేష్ - హీరో ఎవరంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial