మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ పేరు వింటేనే యాక్షన్ లవర్స్‌ కు గూస్‌ బంప్స్ వస్తాయి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 7 సినిమాలు విడుదల అయ్యాయి. చివరి సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ 1’.  క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ప్రియులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. ఈ సినిమాలో టామ్ క్రూజ్ చేసే విన్యాసాలు ఒళ్లుగగూర్పాటుకు గురి చేశాయి.  61 ఏళ్ల వయస్సులోనూ టామ్ క్రూజ్.. కుర్రాడిలా స్టంట్స్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. చిన్న కారులో ఇరుకు వీధుల్లో డ్రైవింగ్, రైలుపై ఫైటింగ్స్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌ లో కూర్చోబెట్టాయి. బైకుతో సహా ఎత్తైన కొండపై నుంచి లోయలోకి దూకే సీన్ చూసి ఆశ్చర్యపోవాల్సిందే!


1996 నుంచి ‘మిషన్ ఇంపాజిబుల్’  ప్రాంచైజీ షురూ


హాలీవుడ్‌లో ‘జేమ్స్ బాండ్’ సినిమా తరహాలోనే ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాకు కూడా మాంచి డిమాండ్ ఉంది. 1996 సంవత్సరంలో ఈ ‘మిషన్ ఇంపాజిబుల్’ ఈ మూవీ సీరిస్ మొదలైంది. అప్పటి నుంచి నిర్విరామంగా ఈ చిత్రానికి సంబంధించి 7 మూవీ సీరిస్‌లు విడుదలయ్యాయి. అన్ని సినిమాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరించాయి. టామ్ క్రూజ్ ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రాల ద్వారా భారీగా రెమ్యునరేషన్ అందుకున్నారు.  


ఒక్కో ‘MI’ సిరీస్ ద్వారా క్రూజ్ ఎంత సంపాదించారంటే?   



  • టామ్ క్రూజ్ ప్రయాణం 1996లో బ్రియాన్ డి పాల్మా ‘మిషన్ ఇంపాజిబుల్‌’తో ప్రారంభమైంది. ఈ సినిమా కోసం $70 మిలియన్లు(సుమారు రూ. 574 కోట్లు) తీసుకున్నారు.

  • ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ అద్భుతమైన విజయం సాధించడంతో 2000లో ‘మిషన్: ఇంపాజిబుల్ 2’ పేరుతో సీక్వెల్ వచ్చింది. ఈ చిత్రం మరింత పెద్ద హిట్‌ అందుకుంది. ఈ మూవీ కోసం క్రూజ్ $100 మిలియన్లు (సుమారు రూ. 820 కోట్లు) తీసుకున్నారు. 

  • ‘మిషన్: ఇంపాజిబుల్ III’  సినిమాకు టామ్  సహ-నిర్మాతగా కూడా వ్యవహిరంచారు. దీంతో $75 మిలియన్లు(సుమారు రూ. 615 కోట్లు) రెమ్యునరేషన్ అందుకున్నారు.

  • ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుకోవడంతో ‘మిషన్: ఇంపాజిబుల్ - ఘోస్ట్ ప్రోటోకాల్’ తీసుకొచ్చారు. ఈ సినిమాకు గాను మొత్తం $75 మిలియన్లు (సుమారు రూ. 615 కోట్లు) అందుకున్నారు.

  • ఆ తర్వాత వచ్చిన ‘మిషన్: ఇంపాజిబుల్ - రోగ్ నేషన్’ కోసం క్రూజ్ $25 మిలియన్లు (సుమారు రూ. 205 కోట్లు) ఆడ్వాన్స్ తీసుకున్నారు. బ్యాకెండ్ డీల్స్ వివరాలు మాత్రం బయటకు వెల్లడించాలేదు.

  • ‘మిషన్: ఇంపాజిబుల్ - ఫాల్‌ అవుట్’ ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుత వసూళ్లు సాధించింది.  ఇటీవల విడుదలైన ‘మిషన్: ఇంపాజిబుల్ – డెడ్ రికనింగ్ పార్ట్ వన్’కు గాను క్రూజ్ $12-14 మిలియన్లు(సుమారు రూ. 98 - 115 కోట్లు) అడ్వాన్సుగా తీసుకున్నారు.

  • ఈ ప్రాజెక్ట్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న క్రూజ్ బాక్సాఫీస్ లాభాలలో వాటాను కూడా అందుకోనున్నారు.

  • మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజీ ఏడవ సిరీస్‌‌‌‌కు క్రూజ్ కనీసం $384 మిలియన్లు (సుమారు రూ. 3,152 కోట్లు) సంపాదించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.   


Read Also: అమెరికాలో అడుగు పెట్టిన ‘బాహుబలి’ బ్రదర్స్, శాన్ డియాగోలో ఇక రచ్చే!









Join Us on Telegram: https://t.me/abpdesamofficial