Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒకరి జాతకం చూడాలంటే పుట్టిన సమయం, గ్రహాల స్థితిని గమనిస్తారు. జన్మ నక్షత్రాన్ని బట్టి, ఆ నక్షత్రంలో ఉండే నాలుగు పాదాల ఆధారంగా కూడా ఫలితాలు మారుతాయి. రాశి చక్రం, అంశ చక్రం ఆధారంగా భవిష్యత్ ని అంచనా వేయవచ్చు, ఏది అదృష్ట సమయం, ఏది కాదు, ఎవరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, ఎవరు ఏం సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది గ్రహస్థితి ఆధారంగా లెక్కించి చెబుతారు. ఇవన్నీ వ్యక్తిగతంగా చూసుకునే వివరాలే అయినప్పటికీ కొన్ని నక్షత్రాలు, కొన్ని రాశుల్లో జన్మించిన వారు మాత్రం రాజయోగం అనుభవిస్తారు. సాధారణంగా రాశిచక్రం, అంశచక్రం వేసేటప్పుడు గ్రహాల స్థానాన్ని బట్టి రాజయోగం ఉందో లేదో చెబుతారు. రాజయోగం అంటే ఆ వ్యక్తి జీవితంలో కష్టాలు తక్కువ ఉంటాయి, కొంచెం కష్టపడినా మంచి ఫలితం పొందుతారు. జీవితంలో ప్రతీదీ సులభంగా పొందుతారు.అయితే పుట్టినప్పటి నుంచీ రాజయోగాన్ని పొందే రాశులు మూడున్నాయి. ఆ రాశులేంటో చూద్దాం.


Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ వాహనం( టూ వీలర్ or ఫోర్ వీలర్) ఏ రంగు ఉండాలో తెలుసా!


సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం)


సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశివారు పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతారని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. చాలా తెలివైన వారు, చురుకైన వారు. వీరి వ్యక్తిత్వం పదునుగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం ఎక్కువ. అనుకున్న పనులు అవి మంచి అయినా చెడు అయినా చేయాలనుకుంటే వీళ్లని ఆపలేరెవ్వరు. జీవితంలో చాలా సంపాదిస్తారు. సకల భోగాలు అనుభవిస్తారు. సింహ రాశికి అధిపతి సూర్యుడు. సింహ రాశి వారికి అదృష్టవంతులు అవుతారని అంటారు. వారి వ్యక్తిత్వంలో పదును ఉంది. ప్రజలు వారి పట్ల ఆకర్షితులవుతారు. సింహ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. జీవితంలో చాలా సంపదలు సంపాదిస్తారు.


తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)


తులారాశిలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. వీరికి జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం బాగా వచ్చట. చాలా తెలివైన వారు, కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు అవుతారు. అయినప్పటికీ తక్కువ శ్రమతోనే మంచి ఫలితాలుసాధిస్తారు. జీవితంలో వీరికి అన్నీ కలిసొస్తాయి. ఏం పని చేసినా విజయం వరిస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని అధిగమించేస్తారు. బాగా సంపాదిస్తారు, హోదాగా జీవిస్తారు.


కుంభ రాశి  (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


కుంభ రాశి వారు పుట్టుకతోనే రాజయోగం ఉంటుందంటారు పండితులు. వీరెప్పుడూ చాలా ప్రశాతంగా ,సంతోషంగా ఉంటారు. కోపం వచ్చినా వీళ్లను తట్టుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. చదవడం, రాయడంలో చాలా నేర్పరులు. ఇంట్లో కన్నా సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. ఉన్నత హోదాల్లో వెలుగుతారు. వీళ్లు వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా వీరికంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. ఆస్తుల కన్నా గౌరవప్రదమైన పేరు తెచ్చుకుంటారు. 


Also Read: ఈ మూడు రాశుల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే జీవితం బిందాస్!


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial