జీవితంలో పెళ్లి ఒక ముఖ్యమైన మలుపు. ఇద్దరు వ్యక్తుల జీవితాలను ఒకటిగా కలిపే సూత్రం పెళ్లి. పెళ్లి చేసుకునే దంపతుల జీవితాలు మాత్రమే కాదు మనసులు, ఆత్మలు కలిపే బంధంగా శాస్త్రం అభివర్ణిస్తుంది. అందుకే వివాహం నిశ్చయం చేసే ముందు తప్పకుండా వధూవరుల జాతకాలు సరిచూస్తారు. జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి  ఎలాంటి   జాతకాలు ఉన్న ఇద్దరు వ్యక్తులకు మధ్య పొంతన కుదురుతుందనేది వారి రాశి, నక్షత్రాలను బట్టి నిర్ణయిస్తుంటారు. కొన్ని రాశులకు చెందిన అమ్మాయిలకు మంచి భార్యలుగా ఉండే లక్షణాలు ఉంటాయంటారు పండితులు. వారెవరో,  ఏ రాశులకు చెందినవారో చూద్దాం.


మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)


మేష రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి స్త్రీలు మంచి పనిమంతులు. నైపుణ్యం కలిగి, శక్తివంతులైన మహిళలు. వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే భర్తను చాలా బాగా చూసుకోగలరు. ఈ రాశి అమ్మాయిని పెళ్లి చేసుకున్న పురుషుడి జీవితం సౌకర్యవంతంగా సాగుతుంది. అంతే కాదు ఈ రాశి అమ్మాయిలు మంచి సరదాాగా ఉంటారట. అందుకే వీరితో జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది.


Also Read: వీలైతే ప్రేమిద్దాం పోయేదేముంది- భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కూడా ఇదే చెప్పాడు!


వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)


వృషభ రాశికి చెందిన స్త్రీలు చాలా మంచి నడవడిక కలిగి ఉంటారు. చాలా బాధ్యత కలిగినవారిగా చెప్పవచ్చు. కుటుంబ సభ్యులందరి బాధ్యత తనదిగా భావించే మహిళలు వీరు. పూర్తి కుటుంబ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలిగే వీరి ప్రతిభ వల్ల భర్త చాలా రిలాక్స్‌డ్‌గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాశి అమ్మాయిని పెళ్లి చేసుకునే పురుషులు వృత్తిలో బాగా రాణిస్తారు. అంతేకాదు ఈ మహిళలది మంచి ఆర్థిక ప్రయోజనాలు కలిగించే జాతకంగా చెప్పవచ్చు.


కన్యా రాశి  (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)


కన్యారాశి అమ్మాయిలకు కుటుంబంపై శ్రద్ధ చాలా ఎక్కువంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.  నిరాడంబరమైన స్త్రీలు వీరు. గర్వం కాస్త కూడా ఉండదు. చాలా ప్రాక్టికల్ వ్యక్తులుగా చెప్పవచ్చు. ప్రతి చిన్న డీటెయిలింగ్ మీద కూడా చాలా శ్రద్ధ కనబరుస్తారు. ఒకరకంగా పర్ఫెక్షనిస్టులుగా ఉంటారు. చాలా క్రమశిక్షణతో జీవితం గడిపేందుకు ఇష్టపడతారు కూడా. అందువల్ల వీరు తాము మాత్రమే కాదు, ఇంట్లో ప్రతి విషయంలోనూ క్రమశిక్షణకు ప్రాధాన్యతను ఇచ్చే దృఢమైన వ్యక్తిత్వంతో వ్యవహరిస్తారు. అందువల్ల జీవితంలో పనులన్నీ ఒక క్రమపద్ధతిలో సాగిపోతుంటాయి. ఇలాంటి అమ్మయిని భార్యగా పొందిన పురుషుడికి జీవితం సులభంగా, ఆనందంగా సాగిపోతుందని నిరభ్యంతరంగా చెప్పవచ్చు.


Also read : గర్భవతిని పాము కాటెయ్యదు, ఎందుకో తెలుసా!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial