ముకుంద రేవతికి ఎదురు మాట్లాడుతుంది. త్యాగం పేరుతో నువ్వే నీ ప్రేమని వదులుకున్నావ్. మళ్ళీ పొందిన పాత ప్రేమ దొరకదు. నువ్వు ప్రేమించినప్పుడు మురారీ నీ ప్రేమికుడు కానీ ఇప్పుడు కృష్ణ మొగుడు. నీ వెనుక మా అక్క ఉందేమో చెప్పుడు మాటలు వింటుంది కానీ తప్పుడు మాటలు ఎప్పుడూ నమ్మదని రేవతి గట్టిగానే బదులిస్తుంది. భవానీ కృష్ణని తిట్టిన విషయం గుర్తు చేసుకుని మురారీ బాధపడతాడు. అయిన తను ఎందుకు మందు తాగుతుందని అనుకుంటాడు. కృష్ణ బాధగా వచ్చి నేనంటే పెద్దత్తయ్యకి ఎందుకు అంత కోపం. మీరు జమీందారులు మేము మిడిల్ క్లాస్. అందుకే నేను, గౌతమ్ సర్ అసలు నచ్చరని బాధపడుతుంది. అదేమీ లేదు కృష్ణ రూల్స్ పాటించకపోతే శివగామి అయిపోతుందని అంటాడు. నువ్వు మందు తాగడం ఏంటని అడుగుతాడు. నువ్వు ముకుందతో కలిసి వాళ్ళ అమ్మని చూడటానికి వెళ్ళినప్పుడు మందు వాసన చూశాను తాగలేదు మత్తు ఎక్కింది. నేను పావలా చేస్తే ముకుంద పదివేలు చేసి చెప్పిందని అంటుంది.


Also Read: కావ్య, కళ్యాణ్ ని స్టేషన్ నుంచి విడిపించిన రాజ్- హనీమూన్ కావాలంటూ రచ్చ చేసిన స్వప్న


పసిపాప లాంటి మనసు నీది దేవుడా ఈ అమ్మాయి నాకు భార్యగా రావాలని మురారీ మనసులో కోరుకుంటాడు. మురారీ గోడ మీద ఐలవ్యూ కృష్ణ అని పెట్టిన లైట్స్ కనిపించవు. వాటిని ఎవరు తీశారని మురారీ ఆలోచిస్తాడు. మధుకర్ కూడా కృష్ణని  భవానీ తిట్టినందుకు ఫీల్ అవుతాడు. ముకుంద మురారీ కళ్ళు మూసి లవ్ లైట్స్ దగ్గరకి తీసుకొచ్చి చూపించనట్టు మురిసిపోతుంది. అక్కడ ఐలవ్యూ మురారీ అని ఉంటుంది. అది చూసుకుంటూ ముకుంద ఉండగా మురారీ కోపంగా వచ్చి మారవా నువ్వు అని దాన్ని మొత్తం పీకేసి ఇకనైనా మారడానికి ట్రై చెయ్యి అనేసి కోపంగా వెళ్ళిపోతాడు. నేను ఎంత చేరువ అవాలని ట్రై చేస్తుంటే నన్ను దారుణంగా హర్ట్ చేస్తున్నావ్. మీరు ఇద్దరూ ఎలా కలుస్తారో నేను చూస్తానని ముకుంద రగిలిపోతుంది. ఇవాళ కృష్ణ మందు తాగిందని చెప్పింది రేపు వాళ్ళది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పేస్తుందని రేవతి ఆలోచిస్తూ ఉంటుంది.


Also Read: యష్, వేద మధ్య చిచ్చు పెట్టిన మాళవిక- అభిమన్యుకి బుర్ర తిరిగిపోయే షాకిచ్చిన నీలాంబరి


మురారీ రేవతి దగ్గరకి వచ్చి పచ్చడి, యాపిల్ తీసుకుని వెళ్తుంటే ముకుంద భవానీకి చూపిస్తుంది. ఏంటి అది అని అడుగుతుంది. పచ్చడిలో యాపిల్ నంచుకుని తింటే బాగుంటుందని చెప్తాడు. నీకు తెలియదా అంటే తెలియదు కృష్ణ చెప్పిందని అంటాడు. సిగ్గులేదా తింగరి పిల్లకి సేవలు చేయడానికని అరుస్తుంది. రేపు బోనాలు పండగ త్వరగా పడుకోమని చెప్తుంది. సందు దొరికింది కదా ముకుంద కృష్ణ గురించి ఎక్కించేందుకు ట్రై చేస్తుంటే భవానీ చిరాకుపడుతుంది. బోనాల పండుగ ఉపయోగించుకుని వీళ్లిద్దరిని విడదీసే ప్రయత్నం చేయాలని ముకుంద అనుకుంటుంది. కృష్ణ చెప్పినట్టు రేవతి కూడా యాపిల్ ని పచ్చడిలో నంచుకుని తింటుంది. మధుకర్, అలేఖ్య ముకుంద, మురారీ కలిసి ఉన్న ఫోటోస్ తీసుకుని భవానీ దగ్గరకి వెళ్తుంటే రేవతి ఆపుతుంది. ఫోటోస్ అని నసుగుతుంటే వాటిని రేవతి చూసి షాక్ అవుతుంది.