యష్, వేద సంతోషంగా బయటకి వెళ్తుంటే మాళవిక ఎదురుపడుతుంది. ఇప్పుడే వసంత్ ని కలిసి వస్తున్నా తను అమెరికా వెళ్ళడం లేదట కదా అంటుంది. వెళ్తున్నాడని యష్ చెప్తాడు. వేద నువ్వే ఏదో చెప్పేసరికి వసంత్ మనసు మార్చుకున్నాడట కదా నువ్వు చాలా గ్రేట్ అంటుంది.
యష్: మాళవిక ఏం మాట్లాడుతున్నావ్. వేద తను చెప్పేది నిజమా.. వసంత్ అమెరికా వెళ్ళకుండా నువ్వు ఒప్పించావా
వేద: చిత్ర, వసంత్ ఇద్దరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. నేను కూడా వసంత్ కి అర్థం అయ్యేలా చెప్పాను
యష్: ఏం తెలుసు నీకు? నువ్వు ఎందుకు మధ్యలో కల్పించుకున్నావ్.
వేద: ఎందుకు అంతలా అంటున్నారు. ప్రమోషన్ ఎప్పుడైనా వస్తుంది కానీ ఫ్యామిలీ లైఫ్ గురించి ఆలోచించాలి కదా
యష్: నీ చెల్లెలి మాట విని వసంత్ కెరీర్ నాశనం చేశావు. ఎంత మంచి అవకాశం చేజార్చుకునేలా చేశావు
Also Read: రంగంలోకి దిగిన భవానీ దేవి, ముకుంద ప్రేమ గురించి తెలుసుకుంటుందా?
వేద: అసలు ఎందుకు నిర్ణయం మార్చుకున్నాడో తెలుసుకుని మాట్లాడండి
యష్: షటప్ వేద. అసలు వాళ్ళని వెళ్లొద్దని చెప్పడానికి నువ్వు ఎవరు? వెళతాడు అంతే.. అమెరికా వెళ్ళాలి ఎదగాలని చాలా ఆశ పడ్డాడు. అదేమీ తెలుసుకోకుండా వాడి మనసు మార్చడం తప్పు. వసంత్ ని అడ్డుకునే ప్రయత్నం చేయకు. కెరీర్ ఎంత బాగుంటే ఫ్యామిలీ అంత బాగుంటుంది.
యష్ సీరియస్ గా ఉంటే మాళవిక మళ్ళీ రెచ్చగోట్టేందుకు చూస్తుంది. యష్ కి అరవడం అలవాటు కదా తను క్యారెక్టర్ అదే అంటుంది. ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళ ముందు గొడవ పడటం మంచిది కాదు. మీరు తిట్టుకోండి కొట్టుకోండి కానీ ఆదిత్య మా నాన్న ఇలాంటి వాడు ఏంటని ఆదిత్య ఇంట్లో నుంచి పారిపోయేలా మాత్రం చేసుకోవద్దని మాళవిక అనేసి వెళ్ళిపోతుంది. వేద మాటని మాత్రం యష్ అంగీకరించడు.
నీలాంబరి బాధ తట్టుకోలేక అభిమన్యు భ్రమరాంబికని ఇంటికి పిలిపిస్తాడు. నీలాంబరి వాంతులు చేసుకుంటుంది. ఏమైంది ఫుడ్ పాయిజన్ అయ్యిందా అని అభి అడుగుతాడు. నీలు సిగ్గుపడుతూ తల్లిని కాబోతున్నానని చెప్తుంది. ఆ మాటకి షాకై అభి కళ్ళు తిరిగి పడిపోతాడు. వేద చిరాకుపడుతూ ఉంటే మాళవిక వచ్చి రెచ్చిగొట్టేలా మాట్లాడుతుంది. వాళ్ళ మాటలు సులోచన వింటుంది.
యష్ అప్పుడు నామీద ఎలా అరిచాడో ఇప్పుడు నీమీద కూడా అలాగే అరుస్తున్నాడని అనేసరికి వేద తన నోరు మూయిస్తుంది. కావాలని మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం కోసం వసంత్ సంగతి చెప్పావని వేద తిడుతుంది. మీ మధ్య గొడవలు సృష్టిస్తా మిమ్మల్ని విడదీస్తానని మాళవిక అంటుంది. అది కలలో కూడా జరగదు మా మధ్య నిప్పు పెట్టాలని అనుకుని నువ్వే తగలబడటం తప్ప ఏమిఈ చేయలేవని వేద లైట్ గా తీసుకుంటుంది. నువ్వు ఇలా ఉంటేనే నా పని సులువు అవుతుందని మాళవిక ధైర్యంగా చెప్తుంది. మాళవిక వెళ్తూ వెళ్తూ సులోచనని పలకరించి ఇద్దరికీ ఒకటే మాట అనేసి వెళ్ళిపోతుంది.
Also Read: పెళ్ళాం చేతికి డబ్బులివ్వలేక రాజ్ అగచాట్లు- అప్పు ప్రేమలో పడిపోయిన కళ్యాణ్!
వసంత్, చిత్ర యూఎస్ కి వెళ్ళకుండా ఉన్నదాని గురించి మాట్లాడుకుంటూ ఉండగా యష్ ఆవేశంగా వస్తాడు. తామిద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నామని చిత్ర చెప్తుంటే కాదు వేద, నువ్వు కలిసి తీసుకున్నా నిర్ణయమని అరుస్తాడు. కెరీర్ లో నిలదొక్కుకోవడానికి ఎంత ప్రయత్నించాడో మీకు తెలియదు వేద చెప్పిందని మనసు మార్చుకున్నారని తిడతాడు.