కళ్యాణ్ చిటికెలో అప్పుని స్టేషన్ నుంచి విడిపిస్తాడు. కనకం టీ పెట్టి తీసుకెళ్ళి కళ్యాణ్ కి ఇవ్వమని చెప్తుంది. ఇదేమీ తనకి పెళ్లి చూపులు కాదని అంటుంది. అప్పు టీ తీసుకుని వస్తుంటే కళ్యాణ్ విచిత్రంగా చూస్తాడు. పోలీస్ స్టేషన్ లో ఉన్న విషయం కావ్యకి చెప్పొద్దని అప్పు రిక్వెస్ట్ చేస్తుంది. సరేనని వెళ్లిపోగానే పప్పు సుద్ద అనుకున్నా గట్టి వాడే అనుకుంటుంది. కావ్య గదిలోకి వచ్చేసరికి రాజ్ డబ్బులు పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు. అన్నీ హక్కులు కావలంటుంది కానీ ఆర్థిక స్వతంత్రం కావలని అడగదు ఏంటి ఈ తింగరబుచ్చి అనుకుంటాడు. చేతిలో ఆ నోట్ల కట్టలు ఏంటి? మీ అమ్మ థాంక్స్ చెప్పి బదులు తీర్చుకున్నారు. మీరు నోట్ల కట్టలు ఇచ్చి థాంక్స్ చెప్తారా? మానవత్వానికి వెల కడుతున్నారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. డబ్బులు లెక్క పెట్టుకుంటున్నానని అబద్దం చెప్పి కవర్ చేస్తాడు. డబ్బులు ఇవ్వనివ్వకుండా నోరు చేతులు కట్టేసిందే అనుకుంటాడు.


Also Read: 'ఐలవ్యూ రిషి' అంటూ షాకిచ్చిన ఏంజెల్- మహేంద్రని చంపేస్తానని జగతిని బెదిరించిన శైలేంద్ర


తన బాబాయ్ కి ఫోన్ చేసినట్టుగా కలరింగ్ ఇస్తూ ఇన్ డైరెక్ట్ గా డబ్బు కబోర్డ్ లో పెడుతున్నా అవసరానికి ఎవరైనా తీసుకుని వాడుకోవచ్చని గట్టిగా అరుస్తాడు. అప్పుడే తన బాబాయ్ వచ్చి నేను ఇక్కడే ఉంటే ఎవరికి ఫోన్లో చెప్తున్నావని గాలి తీసేస్తాడు. నిజంగా ఆ డబ్బు నాకోసమే అక్కడ పెడుతున్నారా డైరెక్ట్ గా చెప్పలేక ఇబ్బంది పడుతున్నారా అని అనుకుంటుంది. ఈ పిచ్చిదానికి ఎలా చెప్పాలి, డబ్బు తీసుకోమంటే ఏదో ఒకటి అంటుంది. ఎలాగైనా తనకి ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేకుండా బ్యాంక్ లో వేయాలని అనుకుంటాడు. వెంటనే సంతోష్ అనే వ్యక్తికి ఫోన్ చేసి బ్యాంక్ నుంచి ఎగ్జిక్యూటివ్ ని పంపించమని చెప్తాడు. కనకం కళ్యాణ్ కి ఫోన్ చేసి కావ్యత్వ మాట్లాడుతుంది. అత్తగారి ఇంట్లో నీ పరిస్థితి ఎలా ఉందని అడుగుతుంది. బాగానే ఉన్నానని అంటుంది. అక్కడ ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరిగింది అంట కదా ఏమైందని అడుగుతుంది. అవును మా అత్తకి నామీద కోపం వచ్చి అరిస్తే మాయన నన్ను ఏమి అనకుండా చూసుకున్నారని చెప్తుంది. తన కాపురం గురించి ఆలోచించాల్సిన పని లేదని ధైర్యం చెప్తుంది.


Also Read: 'నిన్ను ఇంట్లో నుంచి గెంటేసి నా మాజీ మొగుడ్ని' లాగేసుకుంటానంటూ వేదకి ఛాలెంజ్ విసిరిన మాళవిక


కనకం విషయం భర్తకి చెప్పేసరికి కాస్త ఊరటగా అనిపిస్తుంది. కళ్యాణ్ రాసిన కవిత తనకి బాగా నచ్చిందని కావ్య తీసుకుంటుంది. అది తీసుకొచ్చి కబోర్డ్ లో పెట్టబోతుంటే అందులో డబ్బులు ఉంటాయి. ఇక బ్యాంక్ నుంచి ఏంజెట్ వస్తాడు. తనే పిలిపించానని రాజ్ చెప్తాడు. కళావతికి ఒక్కదానికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయిస్తానని అంటే ఏదో ఒకటి అనుకుంటారని అందరికీ అకౌంట్ ఓపెన్ చేయిస్తున్నానని అబద్దం చెప్తాడు. పొరపాటున మనసులో ఉన్నది కూడా కక్కేస్తాడు. కళావతికి ఒక్కదానికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయిస్తానని అనుకుంటారా?ఏంటని అనేసరికి అందరూ నవ్వుకుంటారు. ఇక ఇంట్లో అందరికీ బ్యాంక్ అకౌంట్ ఫామ్స్ ఫిల్ చేయించి చివరిలో ఒకటి మిగిలిందని ఏజెంట్ చెప్తాడు. అది కాస్త పెళ్ళాం పేరు మీద పెట్టిస్తాడు.