Madhuranagarilo July 8th: రాధ, పండు బయటికి రాగా అప్పుడే శ్యామ్ బైక్ తీసుకొని వస్తాడు. ఇక పండు బైక్లో వెళ్దాము అనడంతో రాధ రాను అంటుంది. ఏం కాదులే మమ్మీ అని పండు అనటంతో కారులో వెళ్దాము అని అంటుంది. కారు మమ్మీ వాళ్ళు తీసుకెళ్లారు అని శ్యామ్ అంటాడు. స్కూటీ మీద వస్తాను అని అంటుంది. అది గన్నవరం కి నేనే ఇచ్చాను అని అంటాడు శ్యామ్.


దాంతో తప్పనిసరిలో రాధ శ్యామ్ బండి ఎక్కుతుంది. ఇక శ్యామ్ మాట్లాడాలని ప్రయత్నిస్తుండగా రాధ మాత్రం కోపంగా సమాధానం ఇస్తూ ఉంటుంది. దానితో వారిద్దరి మధ్య కూర్చున్న పండు మీరిద్దరూ గొడవపడుతున్నారా మాట్లాడుకుంటున్నారా అని అడుగుతాడు. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత మధ్యలో ఉన్న పండు చాలా ఇబ్బంది పడుతూ బండి ఆపిస్తాడు.


ఏం జరిగింది అని అడగటంతో ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను అని మళ్లీ అక్కడ కాసేపు డ్రామా ప్లే అవుతుంది. అలా పండు ముందర కూర్చుంటాడు. ఇక రాధ వెనకాల కూర్చుని ఇబ్బంది బండి ఆపిస్తుంది. మళ్లీ అక్కడ కూడా కాసేపు చిన్న వార్ జరుగుతుంది. ఆ తర్వాత తప్పదు అన్నట్లుగా బండి ఎక్కి వెళ్తుంది. మరోవైపు నెల్సన్ గోపాల్ కు సంబంధం తీసుకొని వస్తాడు.


ఇక గోపాల్ కు అమ్మాయి నచ్చుతుంది. అమ్మాయికి కూడా గోపాల్ నచ్చుతాడు. ఇక ముహూర్తాలు మాట్లాడుకునే సమయంలో గన్నవరం స్వామీజీ వేషంలో వచ్చి ఆ సంబంధాన్ని చెడగొడతాడు. ఇక రాధ వాళ్ళు బైక్ పై ప్రయాణిస్తూ ఉండగా శ్యామ్ పండుతో నీకు ఒకటి చెప్పాలి అంటూ లవ్ యూ అని అంటాడు. ఇది చెప్పడానికి ఇంత టైం పట్టిందా అంటూ తను కూడా లవ్ యూ టూ అని అంటాడు.


ఇక శ్యామ్ రాధకి ఎలాగైనా విషయం చెప్పాలి అంటే పండుని కాసేపు పక్కకి తప్పించాలి అని అక్కడ బండి ఆపి పానీ పూరి తినిపించడానికి తీసుకెళ్తాడు. పానిపూరి తినమని చెప్పి తను రాధ దగ్గరికి వచ్చి నీకు ఒక విషయం చెప్పాలి అంటూ తనను పక్కకి రమ్మని చేయి పట్టుకుంటాడు. కానీ రాధ వదలమని అంటుంది. అప్పుడే పోలీసులు అక్కడికి రాగా శ్యామ్ తనని ఈవ్ టీజింగ్ చేస్తున్నాడు అని దగ్గరికి రావటంతో వెంటనే రాధ అక్కడి నుంచి పక్కకు వెళుతుంది.


ఈవ్ టీజింగ్ చేస్తున్నావని శ్యామ్ ను తీసుకెళ్తుండగా రాధ వచ్చి తాము ఫ్రెండ్స్ అని నాకు పానిపురి ఇష్టం లేకుండా బలవంతంగా తినడానికి రమ్మంటున్నాడు అని తను ఈవ్ టీజింగ్ చెయ్యట్లేదు అని చెప్పటంతో పోలీసులు సారీ చెప్పి అక్కడి నుండి వెళ్తారు. ఇక అప్పుడే పండు తినడం అయిపోవడంతో బిల్ పే చేయడానికి వెళ్తాడు. వెంటనే రాధ శ్యామ్ సమయం చూసుకొని ఎప్పుడైనా ప్రపోజ్ చేస్తాడు అని భయపడి సంయుక్తను అక్కడికి రప్పించాలి అని ఫోన్ చేస్తుంది. తరువాయి భాగంలో చీకటి పడ్డాక శ్యామ్ లవ్ సింబల్ తో ఉన్న బెలూన్ తీసుకొచ్చి రాధకు ప్రపోజ్ చేస్తాడు. అదే సమయంలో అక్కడికి మధుర దంపతులు రావడంతో వారిద్దరిని అలా చూసి షాక్ అవుతారు.


Also Read: Krishnamma kalipindi iddarini July 7th: కోడలికి డబ్బు సహాయం చేసిన సునంద.. చెల్లెలను కాపాడుకున్న గౌరీ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial