గుప్పెడంతమనసు జూలై 8 ఎపిసోడ్ (Guppedanta Manasu July 8th Written Update)
వసుధార కూడా పవర్ ఆఫ్ స్టడీస్ ప్రాజెక్టులో పార్టిసిపేట్ చేస్తుందని తెలిసి రిషి ఆలోచనలో పడతాడు. వసుధార నా సమీపంలో ఉంటే కాన్సన్ ట్రేట్ చేయలేను అనుకుంటూనే..ఎవ్వరూ నన్ను డిస్ట్రబ్ చేయలేరు. మిషన్ ఎడ్యుకేషన్ లా పవర్ ఆఫ్ స్టడీస్ ని తీర్చిదిద్దాలి అనుకుంటాడు.
జగతి-మహేంద్ర
మరోవైపు జగతి బట్టలు సర్దుకుంటూ ఎప్పుడు బయలుదేరుదాం మహేంద్ర అని అడుగుతుంది. రేపు మధ్యాహ్నం స్టార్ట్ అవుతాదం..నైట్ అక్కడ స్టే చేసి ఎల్లుండి మార్నింగ్ ఆ కాలేజికి వెళదాం అని చెబుతాడు. రిషిని అవమానించిన విషయం మొత్తం గుర్తుచేసుకుని జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇద్దరూ రిషి గురించి మాట్లాడుకుంటూ ఉండగా శైలేంద్ర మెట్లు ఎక్కి ఆ రూమ్ వైపు వస్తుంటాడు. తన క్షేమం కోసమే కదా ఇలా చేశావ్ అని ఓదార్చుతాడు. ఇన్నేళ్ల తర్వాత తనని చూడబోతున్నాను అనే ఫీలింగ్ నా మనసుని నిలకడగా ఉంచలేకపోతోంది. రేపు మనం అక్కడకు వెళుతున్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు అని జగతి అంటే అన్నయ్యకు చెబుదాం అంటాడు మహేంద్ర. వద్దు మహేంద్ర వాళ్లకి తెలిస్తే మనల్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది అంటుంది. ఆ మాటలు వింటాడు శైలేంద్ర
Also Read: ఈగోమాస్టర్ మనసులో ప్రేమ - బయటకు బెట్టు , రిషిధార దగ్గరకు మహేంద్ర - జగతి!
శైలేంద్ర - దేవయాని
వీళ్లు ఏదో ఫంక్షన్ కి వెళతాం అన్నారు కానీ ఏదో ప్లాన్ చేస్తున్నారని చెబుతాడు శైలేంద్ర. రేపు నువ్వు ఏ పనులు పెట్టుకోకుండా వాళ్లని ఫాలో అవ్వు అని సూచిస్తుంది దేవయాని
ఇంటికి చేరుకున్న రిషికి..ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ కనిపిస్తాడు. నువ్వేంటి ఇక్కడ అని అడిగితే వసుధార మేడం కోసం వచ్చానంటాడు. అవసరం లేదు నువ్వెళ్లు అని చెప్పేసి పంపించేస్తాడు. ఈ లోగా వసుధార కాలేజీకి బయలుదేరుతుంది. బయటకు వస్తుంటే అడ్డుగా నిల్చుంటాడు రిషి. తప్పుకోండి సార్ అని వసు అంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోండని చెబుతాడు. మీరు రారని రాలేరని ప్రిన్సిపాల్ తో చెప్పాను అని వసు అంటే మీరు రారని నేను ఆల్రెడీ చెప్పాను అయినా వెళతానంటే నా మాటకు విలువ ఇవ్వనట్టే అంటాడు.
రిషి: పూర్తిగా నడవసలేని స్థితిలో కాలేజీకి వెళ్లాల్సిన అవసరం ఏంటి, ఎవరికోసం వెళుతున్నారో తెలుసుకోవచ్చా
వసు: కాలేజీలో సెమినార్ జరగబోతోంది..నా పార్టిసిపేషన్ ఉంటే బావుంటుందని వస్తానన్నాను. అయినా నేను పని చేయాలి అనుకుంటున్నాను
రిషి: మీరు కోలుకునేవరకూ ఉండాలి
వసు: పైన గాయాల గురించి మాట్లాడడం లేదు..మనసుకి అయిన గాయాల గురించి మాట్లాడుతున్నాను.. అందుకే చాలా పని చేయాలని ఉంది
రిషి: ఎదుటి వారి మనసుకి అయిన గాయాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా..
వసు: మీరు ఏమైనా అనుకోండి నేను కాలేజీకి వెళతాను
రిషి: మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.. అంతగా అనుకుంటే మీరు చేయాలి అనుకున్న పని ఇంట్లోనే చేయండి
వసు: కాలేజిలో చేయాల్సిన పనిని ఇంట్లో ఎలా చేస్తాం
రిషి: అన్నింటికీ అమాయకురాలిలా మాట్లాడొద్దు..ఏం చేయాలో ఎలా చేయాలో చెబుతానంటు లోపలకు పంపించేస్తాడు
Also Read: ఈ రాశివారు మాటిస్తే తప్పకుండా నెరవేర్చుతారు, జూలై 8 రాశిఫలాలు
జగతి -మహేంద్ర
జగతి -మహేంద్ర ఇద్దరూ బయలుదేరుతారు. వెనుకే శైలేంద్ర ఫాలో అవుతాడు. కొడుకుని కలిసేందుకు వెళుతున్న జగతి సంతోషంగా ఉంటుంది. జరిగినవన్నీ తలుచుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నావ్ జగతి..రిషి గురించేనా అని అడుగుతాడు. ఎప్పుడెప్పుడు రిషిని చూస్తామా అని మనసు పాకులాడుతోంది అనుకుంటారు. రిషి నాతో మాట్లాడుతాడా..నా భారం దింపేసుకోవాలని ఉంది కానీ అది ఈ జన్మలో జరగదని అర్థమవతోందని బాధపడుతుంది. రిషి కనపడదానే నువ్వు ఎగ్జైట్ కావొద్దు జగతి అంటాడు మహేంద్ర. రిషి కోసం వెళ్లినట్టు తనకి తెలియకూడదని చెబుతాడు. మరోవైపు వాళ్లని ఫాలో అవుతున్న శైలేంద్ర..పిన్నీ-బాబాయ్ ఏ పనిపై వెళుతున్నారు..ఫాలో అవుతున్నా కదా అన్నీ తెలుస్తాయి అప్పుడేం చేయాలో ఆలోచిస్తాను అనుకుంటాడు.
దేవయాని-ధరణి
ఇంట్లో కంగారుగా తిరుగుతూ ఉంటుంది దేవయాని. ఇంకా శైలేంద్ర నుంచి కాల్ రాలేదేంటని ఆలోచిస్తుంటుంది. ఇంతలో ధరణి వచ్చి భోజనానికి పిలుస్తుంది. నువ్వెళ్లు అని కసురుతుంది దేవాయని. మీరెందుకు కంగారుగా ఉన్నారని అడిగితే నీకు చెప్పానా అంటుంది. నా మట్టి బుర్రకు కూడా కొన్ని విషయాలు అర్థమవుతాయంటుంది ధరణి.
దేవయాని-శైలేంద్ర
ఇంతలో శైలేంద్ర కాల్ చేసి..నేను వాళ్లని ఫాలో అవుతున్నాను ఇప్పుడు హోటల్లో ఉన్నారని చెబుతాడు. అక్కడ మనకు వ్యతిరేకంగా ఏమైనా జరిగితే వాళ్లని ఆపు అంటుంది దేవయాని. అదే జరిగితే వాళ్లని చంపేస్తానంటాడు శైలేంద్ర. ఫైర్ అయిన దేవయాని ముందు వాళ్లు ఎందుకు వెళ్లారో తెలుసుకో అప్పుడు ఏం చేయాలో చెబుతానంటుంది. అసలు ఈ తంటాలన్నీ అవసరమా అని రివర్సవుతాడు శైలేంద్ర.నాకు ఇక ఓపికలేదు అంటాడు. ఆ రిషి గాడు లేదు వీళ్లని కూడా మట్టిలో కలిపేస్తే నాకు అడ్డెవరూ ఉండరు అంటాడు. మహేంద్రకి ఏ హానీ తలపెట్టొద్దని దేవాయని చెబుతుంది కానీ శైలేంద్ర కాల్ కట్ చేస్తాడు.
వసు-రిషి
వసు కదల్లేని స్థితిలో ఉండడం వల్ల ఆన్ లైన్లో మీటింగ్ పెడతాడు రిషి. ఎవర్నీ ఇబ్బంది పెట్టాలని అనుకోలడం లేదు.. మనం అనుకున్న వర్క్ అంతా చైర్మన్ సార్ ఇంట్లోంచే చేద్దాం అంటాడు. పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాన్సెప్టుపై చర్చిస్తాడు.
ఎపిసోడ్ ముగిసింది