గుప్పెడంతమనసు జూలై 7 ఎపిసోడ్ (Guppedanta Manasu July 7th Written Update)


 మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి ఫణీంద్ర-మహేంద్ర-జగతి డిస్కస్ చేసుకుంటారు. మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలను మొత్తం జగతికి అప్పగిస్తూ ఫైల్ ప్రిపేర్ చేస్తారు. దానిపై ఫణీంద్ర సైన్ చేస్తాడు. దేవయాని-శైలేంద్ర మాత్రం అంగీకరించరు. ఇప్పుడెలాగూ బాధ్యతలన్నీ పిన్నే చూసుకుంటోంది కదా అని సైన్ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే ఇదంతా మినిస్టర్ గారి ఆర్డర్ అని మెలిక పెడతాడు ఫణీంద్ర. అదే సమయంలో జగతిని పొగిడి తన డైరెక్షన్లో వర్క్ చేయాలని శైలేంద్రకి సూచిస్తాడు. దేవయాని కక్కలేక మింగలే అంగీకరిస్తుంది. ఎట్టకేలకు సైన్ చేస్తారు దేవయాని, శైలేంద్ర. ఇదంతా చూసిన ధరణి మాత్రం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులో శైలేంద్ర కి ఛాన్స్ ఇవ్వకూడదనే ఇలాచేస్తున్నారని అర్థమాంది చిన్న అత్తయ్య అనుకుంటుంది. సంతకాలు అయ్యాక అంతా లోపలకు వెళ్లిపోతారు. 


దేవయాని-జగతి


ఇదంతా నువ్వేకదా చేయించిందని దేవయాని అంటే..మీరు ఏది అనుకుంటే అదే అని రిప్లై ఇస్తుంది జగతి. హద్దుదాటి ప్రవర్తిస్తున్నావని దేవాయని ఫైర్ అయితే ఎవరు అని రివర్స్ అవుతుంది. పెంచిన మమకారం లేకుండా రిషిపై హత్యాప్రయత్నం చేసారని మండిపడుతుంది. ఇకపై ఏ ప్లాన్ వేయొద్దు ఏవీ ఫలించవు అని జగతి అంటే..నీ ధైర్యం ఎన్నాళ్లుంటుందో చూస్తానంటుంది. జగతి ఇచ్చిన సమాధానానికి దేవయాని వెళ్లిపోతుంది. నా కొడుకే DBST కాలేజీ రాజు, రారాజు..భగవంతుడు మీకు బుద్ధి చేప్పే రోజు వస్తుందనుకుంటుంది. ఇదంతా మహేంద్ర వింటాడు.


Also Read: వసుకి సమయానికి తగు సేవలు చేస్తోన్న రిషి, 'మిషన్ ఎడ్యుకేషన్' కి పోటీగా 'పవర్ ఆఫ్ స్టడీస్'!


మరోవైపు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న వసుధారకి ప్రిన్సిపాల్ కాల్ చేస్తాడు. కాలేజీలో సెమినార్ కండక్ట్ చేయాలి అనుకుంటున్నాం అంటూ పవర్ ఆఫ్ స్టడీస్ మీద అని చెబుతాడు. రిషి సార్ ఈ టాపిక్ చెప్పారా అని నేరుగా అడిగేస్తుంది. సరే మీకు విషయం తెలిసింది వస్తారు కదా మేడం అంటాడు..తప్పకుండా వస్తానంటుంది వసుధార.


జగతి-మహేంద్ర


మరోవైపు రూమ్ లోకి వెళ్లిన మహేంద్ర దేవయాని-జగతి మధ్య డిస్కషన్ గురించి ఆలోచిస్తాడు. లోపలకు వచ్చిన జగతితో..ఎందుకింత ధైర్యంగా మాట్లాడుతున్నావ్ ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కి ఆటంకాలు కలిగిస్తారని భయం వ్యక్తం చేస్తాడు. కానీ జగతి ధైర్యం చెబుతుంది..నాకు శైలేంద్ర బాగా అర్థమయ్యాడు అందుకే ప్రతీదానికి ఓ అంచనా వేసి ప్రీ ప్లాన్డ్ గా ఉంటున్నాను..తను ఫ్రస్ట్రేషన్లో అడుగు ముందుకు వేయలేడు, వేయనివ్వను..ఒక్కసారి భయపడినందుకే నా కొడుకుని దూరం చేసుకున్నాను, వసుకి తన ప్రేమ-తల్లి దూరం అవడానికి కారణం అయ్యాను, భయపడినందుకు నేను చెల్లించుకున్న మూల్యం చాలు..ఇకపై ఎలాంటి చెడు జరగడానికి వీల్లేదు..అందుకే నేను భయపడను. నీకు అన్ని విషయాలు తెలుసని వాళ్లకి రాకూడదు..ప్రతిక్షణం చాలా జాగ్రత్తగా ఉండు..అనువణువు గమనిస్తూ ముందుకెళ్లు అని హితబోధ చేస్తుంది. ఆడపులి అని ఎందుకంటారో నీకోపం చూస్తుంటే తెలుస్తోంది...నీ ధైర్యంతో రిషి వెనక్కు తీసుకురావాలని మహేంద్ర అంటే.. నా శక్తి నువ్వే మహేంద్ర అని తనతో మాట్లాడడం మానేసిన విషయం గుర్తుచేసుకుని బాధపడుతుంది. వాళ్లకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంటారు. రిషి-వసు గురించి తలుచుకుని బాధపడతారు.


Also Read:  ఈ రాశివారికి ధనవృద్ధి ఉంటుంది కానీ బద్ధకం వీడండి, జూలై 7 రాశిఫలాలు


కాలేజీలో లెక్చరర్స్ అందరూ కూర్చుని సెమినార్ గురుంచి మాట్లాడుకుంటారు. ఇంతలో రిషి వచ్చి సెమినార్ గురించి ఎప్పుడు డిస్కస్ చేసుకుందాం అని అడిగితే  క్లాసులయ్యాక మాట్లాడుదాం సార్ ఈ లోగా వసుధార మేడం కూడా వస్తారని అంటారు. షాక్ అయిన రిషి వసుధార రావడం ఏంటని పైర్ అవుతాడు. ప్రిన్సిపాల్ సార్ మాట్లాడారు..ఆమె కూడా వస్తాన్నారు..కారు పంపిస్తున్నారని చెబుతారు. అప్పుడే ఎలా వస్తుంది గాయం మానకపోతే లైఫ్ లాంగ్ పెయిన్ ఉండిపోతుంది..అంతగా అవసరం అయితే ఏను వసుధార మేడంతో డిస్కస్ చేసి ఆ తర్వాత మీతో కూర్చుని మాట్లాడతాను అని వెళ్లిపోతాడు. రిషి అతిగా రియాక్టవడం చూసి కాలేజీ స్టాఫ్ లో సార్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అనుకుంటారు...


రేపు నేను మహేంద్ర పనిమీద కాస్త దూరం వెళుతున్నాం తిరిగి వచ్చేసరికి రెండు మూడు రోజులు పట్టొచ్చని జగతి చెబుతుంది. ఇంతకీ ఎక్కడికి వెళుతున్నారని దేవయాని అడిగితే ఔటాఫ్ స్టేషన్ వదినా ముఖ్యమైన పనిపై వెళుతున్నాం అని రిప్లై ఇస్తాడు మహేంద్ర. మీరు వెళ్లిపోతే కాలేజీ పనులు ఎలా బాబాయ్ అని శైలేంద్ర అడ్డకట్ట వేస్తే..ఆల్రెడీ కాలేజీ స్టాఫ్ తో మాట్లాడాం వాళ్లకి ఫోన్లో అందుబాటులో ఉంటాం అని చెబుతాడు మహేంద్ర. నేను రానా అని ఫణీంద్ర అంటే..వద్దులే అన్నయ్య అంటారు. అయితే నేనుకూడా వస్తానంటాడు శైలేంద్ర. ఇంతకీ ఎక్కడికి, ఏం ఫంక్షన్ అది అంటూ డిస్కషన్ మొదలెడతాడు శైలేంద్ర..ధరణి కావాలనే ఈ కర్రీ వేసుకోండి అంటూ శైలేంద్రను డైవర్ట్ చేస్తుంది. ఇంతలో ఫణీంద్ర రియాక్టై..ఊరెళ్లి తొందరగా వచ్చేయండని చెబుతాడు. పిన్ని బాబాయ్ కి ఏం చెప్పిందో ఏమో వీళ్ల ప్రవర్తన వింతగా ఉందనే అనుమానం వస్తుంది శైలేంద్రకి...
ఎపిసోడ్ ముగిసింది