Horoscope Today 2023 July 07th:  (జూలై 7 రాశిఫలాలు)


మేష రాశి 
ఈ రాశి వారికి ఈ రోజు మంచి రోజు. మీ సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మిమ్మల్ని ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్య లేదా ఆందోళనకు పరిష్కారం ఈ రోజు దొరుకుతుంది. మిమ్మల్ని మీరు నమ్మితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. పని ఒత్తిడి తగ్గించే మార్గాలు అన్వేషించండి. మీ వ్యక్తిగత జీవితంలో  జరిగే అద్భుతం వలన మీ కుటుంబం సంతోషిస్తుంది. ఉద్యోగస్తులు తమ మాటతీరును అదుపులో ఉంచుకోవాలి. ఉన్నత అధికారుల ముందు వాదించడం మానుకోండి. మీ పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండండి.


వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మంచి రోజు. మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.  ప్రమాదం జరిగే అవకాశముంది. మీ జీవిత భాగస్వామి మీ పై చూపే ప్రేమకి మీరు  అనుభూతి చెందుతారు. మిమ్మల్ని ఆవహించి ఉన్న నిరాశ మటుమాయమవుతుంది. ఈ రోజు మీరు  ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. మనస్సులో ఎలాంటి సందేహం తలెత్తనివ్వకండి .ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబంతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, 


మిథున రాశి
మిథున రాశి వారు ఈ రోజు బిజీ బిజీగా ఉంటారు.  వీరు ఎవరి సహాయం తీసుకోకుండా ఒంటరిగా అన్ని పనులు తామే చేసుకుంటారు. మీరు మీ జీవిత భాగస్వామి పై చూపే శ్రద్ద వలన వారు మిమ్మల్ని మరింత ప్రేమిస్తారు. మీ కష్టకాలంలో మీకు మద్దతుగా నిలిచిన వ్యక్తుల సహాయంతో , మీరు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను వెతుకుతారు. దీనివల్ల మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. గురువులు, పెద్దల ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. 


Also Read: ఈ సారి రెండు శ్రావణమాసాలు, మరి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు!


కర్కాటక రాశి 
కర్కాటక రాశి వారికి ఈ రోజు అత్యంత శుభప్రదం. మీరు ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉండదు. వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి స్త్రీ పురుషులు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.  రోజంతా మీరు సంతోషంగా ఉంటారు .
 
సింహ రాశి 
సింహ రాశి వారు ఈ రోజు సంతోషం గా గడుపుతారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇది మీ మనస్సును చాలా సంతోషపరుస్తుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.  ప్రయాణాల్లో అనవసర ఖర్చులు చేయకండి.  మీరు వృద్ధులైతే, మీ వలన ఈ రోజు  మీ మనవలు ఆనందాన్ని పొందుతారు. ఇది మీకు చాలా అనుభూతినిస్తుంది.  మీరు ఎవరినైనా ప్రేమిస్తే  వారితో మనస్ఫూర్తిగా ఉండండి . ప్రేమ వ్యవహారం తో పాటు  కెరీర్ పై కూడా  కాస్త శ్రద్ధ పెట్టండి.


కన్యా రాశి 
ఈ రాశి వారికి ఈ రోజు  ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.  మీ మనసులో ఉన్న అయోమయం, గందరగోళం తొలగిపోతుంది. మీ వ్యక్తిత్వాన్ని మరింత సమర్థవంతంగా, బలంగా మార్చడానికి, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనండి . ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గించండి , పెట్టుబడులు వ్యవహారం లో ఆచి తూచి వ్యవహరించండి. మీ ఖర్చులను నియంత్రించుకోండి.  మాటల్లో  పరుష పదాలు ఉపయోగించవద్దు, సంబంధాలు దెబ్బతింటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశముంది.  మీ తోబుట్టువులు లేదా బంధువుల ఆరోగ్యం గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. భగవంతుని ధ్యానించండి.


తులా రాశి 
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. మీ విలువైన వస్తువులు చోరీకి గురయ్యే అవకాశం ఉంది. తోబుట్టువుల సహకారం  మిమ్మల్ని ముందుకు సాగడానికి ప్రోత్సహిస్తుంది. ఈ రోజు  మీరు మీ ప్రియమైన వ్యక్తిని కలుస్తారు.కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఈ రాశివారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  పిల్లల వలన  మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అనుకోని అతిధి రాక మిమ్మల్ని సంతోష పరుస్తుంది. 


వృశ్చిక రాశి 
ఈ రాశి వారికి ఈ రోజు ధనవృద్ధి. మీరు బద్దకాన్ని వదిలి కష్టపడవలసి ఉంటుంది. పిల్లల చదువుల గురించి కొంచెం ఆందోళన చెందుతారు, మీ పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. ఏదైనా పని ప్రారంభించే ముందు మీ ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోకండి, వారి ఆశీస్సులు మీకు మీ పిల్లలకి మేలు చేస్తాయి. 


Also Read: సింహరాశిలో శుక్ర సంచారం, మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!


ధనుస్సు రాశి 
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అంతగా కలిసి రాదు. ఒత్తిడి , అలసట ఎదుర్కోవాల్సి వస్తుంది.  ఈ రోజు మీ జీవిత భాగస్వామికి ప్రత్యేక బహుమతి ఇస్తారు.   పాత స్నేహితుడ్ని కలుస్తారు. వ్యాపారరంగం లో ఉన్నవారు పని మీద బయటికి వెళ్ళ వలసి ఉంటుంది. కొంత అలసటకు గురి అవుతారు.  మీ ప్రియమైనవారితో మీ సంబంధ బాంధవ్యాలు చెడిపోయే అవకాశముంది.  మీ కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వండి.  ధనుస్సు రాశి వారు కొన్నిసార్లు ఒంటరిగా చాలా సంతోషంగా ఉంటారు . 


మకర రాశి 
ఈ రోజు ఈ రాశి వారికి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.  మీరు మీ సోదరుడు లేదా సోదరి నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీ వైవాహిక జీవితం లో మీ జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది.  మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి తన వంతు ప్రయత్నం చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీరు ఈ రోజు ఆధ్యాత్మిక కార్య క్రమాల్లో పాల్గొంటారు. ఒక ప్రత్యేక అతిథి , స్నేహితుడు మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికి రావచ్చు. 


కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభ దినం. ప్రేమికులు విబేధాలకు దూరంగా ఉండండి. పెట్టుబడుల వ్యవహారంలో తొందరపడకండి. పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. ఈ రోజు సమయాన్ని వృధా చేయకండి.  వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు , ఇతర ఒత్తిడిల వలన మానసికంగా కుంగిపోతారు. 


మీన రాశి 
మీన రాశి వారికి ఈ రోజు మంచి రోజు. మీ ఇంట్లో  పరిస్థితులు నియంత్రించడానికి మీరు మీ  తోబుట్టువుల సహాయం తీసుకోవచ్చు. వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా  స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీరు కలత చెంది అందరికీ దూరంగా వెళ్లడం గురించి ఆలోచించవచ్చు లేదా మీరు పదవీ విరమణ గురించి ఆలోచించవచ్చు.