రాజ్ కి శృతి డిజైన్స్ వేసి తీసుకొచ్చి చూపిస్తుంది. వాటిని చూడగానే రాజ్ కోపంగా ఏంటి ఇవి, వీటిని డిజైన్స్ అంటారా? అని అరుస్తాడు. అసలు లాస్ట్ టైమ్ డిజైన్స్ వేసింది నువ్వేనా అని అడుగుతాడు. అవునని చెప్తుంది. నువ్వు ఇలా చేయకు టైమ్ లేదని తన మీద అరుస్తాడు. అప్పుడే ఎస్సై రాజ్ కి ఫోన్ చేస్తాడు. ఒకసారి స్టేషన్ కి రమ్మని ఎస్సై చెప్తే రానని టైమ్ పడుతుందని సీరియస్ గా అనేస్తాడు. అయితే మీ పనులు అయ్యే వరకు మీ ఆవిడ, తమ్ముడిని జాగ్రత్తగా స్టేషన్ లో చూసుకుంటాంలే అంటాడు. ఈ తింగరబుచ్చి ఏం చేసిందోనని టెన్షన్ గా స్టేషన్ కి బయల్దేరతాడు. ఇంట్లో వాళ్ళు టీవీ చూస్తుంటే స్వప్న వచ్చి చానెల్స్ అన్నీ మారుస్తుంది. రుద్రాణి, రాహుల్ అది చూసి ఇదేదో పనికి వచ్చేలా ఉంది మంట పెడదామని అనుకుంటుంది. ఏమైందని ఇంద్రాదేవి అడుగుతుంది.


స్వప్న: నా సమస్య చెప్తే మీరేమైన ఆరుస్తారా? తీరుస్తారా? అసలు నా భర్త సరిగా ఉంటే నాకు ఈ తిప్పలు ఎందుకు


రుద్రాణి: నీ బాధ ఏంటో చెప్పకుండా అందరినీ అంటావ్ ఏంటి


Also Read: యష్, వేద మధ్య చిచ్చు పెట్టిన మాళవిక- అభిమన్యుకి బుర్ర తిరిగిపోయే షాకిచ్చిన నీలాంబరి


స్వప్న: నాకు నాభర్త ప్రేమ కావాలి


అపర్ణ: అది అంగట్లో అమ్మే వస్తువు కాదు. ఇంతక ముందు ఒకసారి పడకగదిని పబ్లిక్ పెట్టావ్ ఇప్పుడు పడకనే పబ్లిక్ చేస్తున్నావా


స్వప్న: మాకు కొత్తగా పెళ్లైంది కనీసం మా హనీమూన్ గురించి ఎవరైనా ఆలోచించారా?


రుద్రాణి: నువ్వేమి కొత్తగా పెళ్లి చేసుకుని రాలేదు కడుపుతో వచ్చావు


స్వప్న: అందుకు కారణం మీ అబ్బాయి. అన్నింటికీ నన్ను అంటారు ఏంటి. అసలు మీ అబ్బాయి చేసిన వాగ్దానాలు తెలుసా? గోవాలో డెస్టినేషన్ మ్యారేజ్ అన్నాడు. ఫారిన్ లో ఫస్ట్ నైట్ అన్నాడు. అమెజాన్ ఫారెస్ట్ లో హనీమూన్ అన్నాడు


అపర్ణ: అవన్నీ నువ్వు పిచ్చిదానిలా నమ్మేసి సర్వస్వం సమర్పించుకున్నావ్ అంతేగా


ఇంద్రాదేవి: ఇది హక్కుల కోసం పోరాటం కాదు. అసంతృప్తితో చేసే కాపురం. నువ్వు కడుపుతో ఉన్న విషయం మాటి మాటికి గుర్తు చేయాల్సి వస్తుంది. ముందు బిడ్డ గురించి ఆలోచించు బిడ్డ పుట్టిన తర్వాత నేనే మీ ఇద్దరినీ ఫారిన్ పంపిస్తాను


Also Read: రంగంలోకి దిగిన భవానీ దేవి, ముకుంద ప్రేమ గురించి తెలుసుకుంటుందా?


రాజ్ కోపంగా స్టేషన్ కి వచ్చేసరికి కావ్య ముగ్గుల గురించి కానిస్టేబుల్ కి వివరిస్తూ ఉంటుంది. అది చూసి రాజ్ అసలు ఏం జరుగుతుందని అడుగుతాడు. ఏం చేశారు ఇంత దూరం ఎందుకు వచ్చిందని అంటాడు. నడ్డి విరిగిన ఎస్సై దగ్గరకి రాజ్ వచ్చేసరికి సెటైర్ వేస్తాడు. కావ్య కారుతో గుద్దేసిందని ఎస్సై చెప్తాడు. కావ్య అమాయకంగా సేవ్ చేయమని అడుగుతుంది. రాజ్ వెంటనే పై ఆఫీసర్స్ కి ఫోన్ చేసి కావ్య వాళ్ళని విడిచిపెట్టమని చెప్పిస్తాడు. దుగ్గిరాల వంశం పరువు తీశారని కళ్యాణ్ ని తిడతాడు. కావ్య, కళ్యాణ్ ఇద్దరూ తిక్కతిక్కగా మాట్లాడుతూ ఉంటారు.