గుప్పెడంతమనసు జూలై 12 ఎపిసోడ్ (Guppedanta Manasu July 12th Written Update)


గెస్టులు వస్తున్నారని ప్రిన్సిపాల్ చెప్పడంతో రిసీవ్ చేసుకునేందుకు అందరూ బయటకు వెళతారు. వసుధార కూడా లేస్తుంటే వద్దని మళ్లీ జాగ్రత్తల చిట్టా చెప్పి లోపలే కూర్చోమంటాడు. అందరూ బయటకు వెళతారు. ఎవ్వరికీ కనిపించకుండా శైలేంద్ర కూడా వాళ్లని అనుసరిస్తాడు. రిషి లుక్ మారిపోవడంతో దూరం నుంచి రిషిని చూసి..ఆ క్యాప్ పెట్టుకున్న వాడు బాగా తెలిసిన వాడిలా కనిపిస్తున్నాడు దగ్గరకు వెళ్లి చూద్దాం అనుకుంటూ..కొద్దిసేపట్లో పిన్ని, బాబాయ్ వస్తారు కదా చూద్దాం అనుకుంటాడు. ఇంతలో జగతి మహేంద్ర దిగుతారు...కారు దిగి రిషి ని చూస్తూ అలాగే నిల్చుండిపోతారు... అంతలో జగతి రిషి వైపు పరిగెత్తుతుంది.. మహేంద్ర పిలుస్తున్నా వినిపించుకోకుండా కన్నీళ్లతో రిషిని హగ్ చేసుకుంటుంది. మళ్లీ అమ్మా అని పిలుస్తావా, నన్ను క్షమిస్తావా అని అడుగుతుంది. ఆ చుట్టూ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోతారు. రిషి ఇబ్బందిగా మొహం పెడతాడు. జగతి అని మహేంద్ర పిలవడంతో జగతి ఊహనుంచి బయటకు వస్తుంది...( జగతి రిషిని హగ్ చేసుకోవడం, అమ్మా అని పిలవమనడం జగతి ఊహ)..


మహేంద్ర, జగతిని రిసీవ్ చేసుకున్న ప్రిన్పిపాల్ అందర్నీ పరిచయం చేస్తాడు. రిషి అనే పేరు విని శైలేంద్ర షాక్ అవుతాడు. 
శైలేంద్ర: వీళ్లొస్తే కానీ నేను గుర్తుపట్టలేకపోయాను..ఇందుకా పిన్నీ బాబాయ్ లు ఎమోషన్ అయ్యారు..అనుకుంటాడు
బొకే ఇచ్చి వెల్ కమ్ చెబుతాడు రిషి..( ఈ సీన్ చూసి తీరాల్సిందే..KGF బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేసి తల్లి-కొడుకుల ఏమోషన్ పిండేశాడు)
అందరూ లోపలకు వెళ్లిపోయినా రిషి బయటే ఉండిపోతాడు..
శైలేంద్ర: అసలు రిషి ఇంకా బతికి ఉండడం ఏంటి నమ్మలేకపోతున్నాను..చాలా కన్ఫ్యూజన్ గా ఉంది అనుకుంటాడు...
లోపలకు వెళ్లిన జగతి-మహేంద్రను చూసి వసుధార షాక్ అవుతుంది...
ప్రిన్సిపాల్ వసుధారకి పరిచయం చేస్తాడు..


Also Read: అంత ప్రేమదాచుకుని ఈగో ఎందుకయ్యా - వసుని చూసేసిన శైలేంద్ర - ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్!


ఆ తర్వాత బయట కూర్చుని రిషి ఆలోచనలో పడతాడు...
శైలేంద్ర: రిషిని గమనించిన శైలేంద్ర నేను చూస్తున్నది నిజమేనా ఇన్నేళ్లూ వాడు చేనిపోయాడని అనుకున్నాం కదా అంటే అదంతా నా భ్రమా..నేను పొరపాటు పడ్డానా..నా దగ్గర డబ్బులు తీసుకుని నన్ను మోసం చేశారా అనుకుంటూ..అప్పట్లో రిషిని చంపమని పురమాయించిన వ్యక్తికి కాల్ చేస్తాడు. నేను అప్పుడు అప్పగించిన పని పర్ ఫెక్ట్ గా చేశారా అని అడుగుతాడు. ఆ రోజే వాడిని వేసేశాం కదా అని శైలేంద్ర గట్టిగా అడుగుతాడు. వాడింకా బతికే ఉన్నాడని శైలేంద్ర చెప్పడంతో... వాడు స్పాట్ డెడ్ అయిపోయాడు, అంబులెన్సులో తీసుకెళ్లారని వాడు చెబుతాడు. చెబుతుంటే అర్థం కాలేదా నా కళ్లముందే ఉన్నాడని క్లారిటీ ఇస్తాడు శైలేంద్ర. 


బయటే ఉండిపోయిన రిషి..లోపలకు వెళ్లాలా వద్దా సెమినార్ తో మాట్లాడగలనా లేదా..నన్ను ఎందుకిలా ఇరకాటంలో పడేశావ్ అనుకుంటాడు. లోపల ప్రన్సిపాల్ సహా అందరూ రిషి కోసం ఎదురుచూస్తారు. పాండన్య్ ను వెళ్లి చూసిరమ్మంటాడు ప్రిన్సిపాల్. 
రిషి: వాళ్లు కావాలని వచ్చారా..యాధృచ్ఛికంగా వచ్చారా..ఇప్పుడు నేను వాళ్లని ఫేస్ చేయాలా, నన్ను మోసగాళ్లు అన్నవాళ్లముందే మోటివేషన్ స్పీచ్ ఇవ్వాలా..ఏదైనా కానీ స్టూడెంట్స్ కోసం ఫేస్ చేసి తీరాల్సిందే. ఇలాంటివి జరిగినప్పుడే కదా మనిషి రాటు దేలుతాడు... స్టూడెంట్స్ భవిష్యత్ కోసం నేను స్పీచ్ ఇచ్చి తీరాలి అనుకుంటాడు


Also Read: 'ఐలవ్యూ రిషి' అంటూ షాకిచ్చిన ఏంజెల్- మహేంద్రని చంపేస్తానని జగతిని బెదిరించిన శైలేంద్ర


ఆ రౌడీ శైలేంద్ర కి కాల్ చేసి వాడు బతికే ఉన్నాడట సార్ అని చెప్పగానే శైలేంద్ర ఫైర్ అవుతాడు. వాడు ఎలా బ్రతికాడో అర్థంకావడం లేదంటాడు. అన్నీ నాకు అనవసరం వాడిని వేసేస్తానని వేసేయలేదు నా డబ్బులు నాకివ్వండి అని రెచ్చగొడతాడు. సార్ మేం వేసేస్తాం సార్ మేం చేస్తాం మా పని అదే కదా నమ్మండి, అయినా ఇన్నేళ్లు డబ్బులెందుకుంటాయి అంటాడు అటువైపు రౌడీ. అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు ఇప్పుడు వాడి మనుషులంతా వాడిచుట్టూ చేరి రక్షణ కవచంలా ఉంటారు ఏమీ చేయలేరని అసహనంగా ఉంటాడు..


ఎపిసోడ్ ముగిసింది...