గుప్పెడంతమనసు జూలై 11 ఎపిసోడ్ (Guppedanta Manasu July 11th Written Update)


కాలేజీకి బయలుదేరుతారు విశ్వనాథం, రిషి..ఇంతలో వసుధార వచ్చి తానుకూడా వస్తానంటుంది. గాయాలు తగ్గకుండా వద్దని రిషి చెప్పినా సెమినార్ మిస్సవడం ఇష్టంలేదని చెబుతుంది. ఇక చేసేది లేక అయితే ఏంజెల్ ని రమ్మనండి వసుకి ఏదైనా సమస్య వస్తే తను తీసుకొచ్చేస్తుందంటాడు. ఏంజెల్ ని పిలిచిన విశ్వనాథం రమ్మని చెబితే..వసుని చూసుకునేందుకు రిషి ఉన్నాడుగా రాను అనేస్తుంది కానీ రిషి ఆర్డర్ వేయడంతో సరే అంటుంది ఏంజెల్. అందరూ కాలేజీకి బయలుదేరుతారు. దార్లో వసుధారకి కాలునొప్పి రాకుండా ఉండేందుకు ఏంజెల్ ని పిలిచి జాగ్రత్తల లిస్ట్ చెబుతాడు. ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావ్ డైరెక్ట్ గా వసుధారకే చెప్పొచ్చుకదా, అయినా వసుధారతో మాట్లాడడానికి నీకు ఇబ్బందేంటని అడుగుతుంది. రిషి-వసు ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు. కారు పక్కకి ఆపు గట్టిగా అడుగుతుంది. రిషి కారు ఆపిన వెంటనే విశ్వం నువ్వు వెనక్కు రా వసుధారా నువ్వు ముందుకెళ్లు అని ఆర్డర్ వేస్తుంది ఏంజెల్. వెనుక సీట్లో కన్నా ముందుసీట్లో కూర్చుంటే కాలుకి కంఫర్ట్ గా ఉంటుందంటుంది. బలవంతంగా వసుధారని తీసుకెళ్లి రిషి పక్కన కూర్చోబెడుతుంది. ఇప్పుడు పక్కపక్కనే ఉన్నారుగా నువ్వు చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పు అన్న ఏంజెల్ ముందు నువ్వు మాట్లాడు వసుధారా అంటుంది ఏంజెల్. ఇద్దరూ మాట్లాడుకోవాలని పట్టుబడుతుంది. ఏంజెల్ మాత్రం ఇద్దరి డైలాగ్స్ చెబుతూ భలే కామెడీ చేస్తుంది. ఇంతలో కాలేజీ వచ్చేస్తుంది.


Also Read: 'ఐలవ్యూ రిషి' అంటూ షాకిచ్చిన ఏంజెల్- మహేంద్రని చంపేస్తానని జగతిని బెదిరించిన శైలేంద్ర


కాలేజీలో పాండ్యన్ బ్యాచ్ అంతా సెమినార్ కి ఏర్పాట్లు చేస్తారు. గతంలో కాలేజీలో ఏం జరిగినా మనమే చెడగొట్టేవారం ఇప్పుడు మనమే దగ్గరుండి అరెంజ్మెంట్స్ చేస్తున్నాం, అంతా రిషిసార్ వల్లే అని మాట్లాడుకుంటారు. ఇంతలో కాలేజీలోకి ఎంట్రీ ఇస్తారు విశ్వనాథం టీమ్. కార్లో ఉన్నప్పుడు రిషి చెప్పిన జాగ్రత్తలన్నీ ఏంజెల్ వసుధారకి గుర్తుచేస్తూ సెటైర్స్ వేస్తుంది. అంతా రెడీ అయిపోయిందని చెబుతాడు పాండ్యన్. మేడం మీరు రావడం హ్యాపీగా ఉందంటారు వసుధారని చూసిన ప్రిన్సిపాల్. ఈ సెమినార్ సక్సెస్ చేయాలని మాట్లాడుకుంటారు. ఇంతకీ ఎవరెవరు వస్తున్నారని రిషి అడిగితే పేర్లు బయటకు చెప్పొద్దన్నారని ప్రిన్సిపాల్ అంటాడు. అదేంటి అని అడిగితే వాళ్లకి పబ్లిసిటీ ఇష్టం ఉండదేమో అని విశ్వనాథం అంటాడు. ప్రిన్సిపాల్, విశ్వనాథం వెళ్లిపోతారు..


ఏంజెల్-రిషి-వసు


తర్వాత వసుధార కి మళ్లీ జాగ్రత్తల లిస్టు మొదలెడతాడు..ఏంజెల్ నువ్వు మేడం పక్కనే ఉండు అంటాడు. వసుధార రాకముందు ఒకలా ఉన్నావు వసు వచ్చిన తర్వాత రకరకాలుగా కనిపిస్తున్నావ్. మీ ఇద్దరూ మాట్లాడుకోరు కానీ మీ మధ్య ఏదో బాండ్ ఉన్నట్టే ఉంటుంది. ఏంటా రిలేషన్ అని ఏంజెల్ అడుగుతుంది. ఇది ఇన్వెస్ట్ గేషన్ టైమ్ కాదు సెమినార్ టైమ్ అని చెప్పేసి వెళ్లి కూర్చోమని పంపించేస్తాడు.


Also Read: జూలై 11 రాశిఫలాలు, ఈ రాశివారు సవాళ్లను స్వీకరించే ఉత్సాహంతో ఉంటారు


సెమినార్ ఇవ్వాల్సిన పెన్ డ్రైవ్ అది రెడీగా ఉందా అని రిషి ఏర్పాట్లు చేసుకుంటాడు. కేడీ బ్యాచ్ మంచిగా ఉండడం చూసి విశ్వనాథం మురిసిపోతాడు. అంతా రిషి వల్లే అని వసు అంటే..నీ వల్లే నాకు తెలిసింది రిషికి చెప్పాను ఆ క్రెడిట్ నీక్కూడా దక్కుతుందటాడు విశ్వనాథం.  ఏంజెల్ కి కాల్ రావడంతో బయటకు వస్తుంది..ఇంతలో వచ్చిన రిషి నిన్ను వసుధార దగ్గర ఉండమన్నా కదా అనగానే..నేనేమైనా తనకి బాడీగర్డ్ నా నాక్కూడా తనపై కన్సర్న్ ఉందంటూనన్ను విసిగించకు అని కూల్ గా చెబుతుంది.


వసుని చూసేసిన శైలేంద్ర


రిషి-వసు పనిచేసే కాలేజీ బయటకు వచ్చిన శైలేంద్ర..కారు ఆపి ఇక్కడకు ఎందుకు వస్తున్నారు..పిన్ని.. బాబాయ్ కి నిజం చెప్పేసిందా అనుకుంటాడు. ఇంతలో ఎవరి నుంచో కాల్ వస్తుంది..వాళ్లిద్దరూ అదే కాలేజీకి వస్తున్నారని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కాలేజీ బయట మాస్క్ పెట్టుకుని ఉన్న శైలేంద్రని గమనించిన పాండ్యన్ మీరెవరు అని అడుగుతాడు. మాస్క్ తీయమంటే తనకు కాఫ్ ఉందని చెబుతాడు. ఆడిటోరియం అక్కడుంది వెళ్లండని లోపలకు పంపిస్తాడు. లోపలకు వెళ్లిన శైలేంద్ర వసుధారని చూసి షాక్ అవుతాడు. అంటే బాబాయ్, పిన్ని తనని కలిసేందుకు వస్తున్నారా, వసుధారని కలుస్తున్నారంటే ముగ్గురూ కలసి ఏం ప్లాన్ చేస్తున్నారో...వచ్చేవరకూ వెయిట్ చేసి వీళ్లప్లానేంటో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇంతలో కాలేజీకి వస్తుంటారు జగతి-మహేంద్ర. రిషి ఎలా రియాక్టవుతాడో అని టెన్షన్ పడుతుంటారు.