Rangula Ratnam July 10th: హాస్పిటల్లో ఉన్న వర్ష తన దగ్గర ఉన్న తాళిబొట్టును ఆకాష్ కి ఇచ్చి మంచి అమ్మాయిని చూసుకొని ఈ తాళిబొట్టు కట్టమని అంటుంది. ఇక ఆకాష్ తన చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చెప్పినట్టే కడతాను.. నాకు ఈ తాళి విలువ తెలిసింది.. కానీ ఈ తాళి కట్టేది ఎవరికో కాదు నీకే.. అప్పుడు అందరి ముందు కట్టాను కానీ ఈ తాళి విలువ తెలవదు.. ఇప్పుడు ఈ తాళి విలువ తెలుసు కాబట్టి కడతాను అని తన మెడలో తాడు వేస్తాడు. 


దాంతో వర్ష చాలా ఎమోషనల్ అవుతూ భర్తను పట్టుకొని కన్నీరు పెట్టుకుంటుంది. మరోవైపు జానకి కూతురు, అల్లుడిని ఇంటికి తీసుకురావాలి అని తన భర్తతో చెబుతుంది. సీత ప్రెగ్నెంట్ అని ఇప్పుడు వారిని అలా వదిలేయటం కరెక్ట్ కాదు అని అనటంతో దానికి సత్యం కూడా సీతని పిలిచి పురుడయ్యేదాకా ఇక్కడే ఉంచుకుందాం అంటాడు. సీత ఒక్కతే కాదు రఘు కూడా వస్తాడు అని జానకి అనటంతో రఘు మాత్రం రావద్దు అని అంటాడు.


వెంటనే జానకి సత్యం ను తన చెల్లెలి ఫోటో దగ్గరికి తీసుకెళ్లి నీ చెల్లి పై నీకు ఇంత ప్రేమ ఉంటే తన కడుపులో పుట్టిన రఘు ఎందుకు అంత కోపం అంటూ గట్టిగా నిలదీస్తుంది. నువ్వు, నీ కూతురు అవమానించిన దానికి తిరిగి రఘు మీ పైనే కోపాన్ని పెంచుకోవాలి కానీ చూస్తూ మాటలు పడ్డాడు అని అంటుంది. ఇక నీ చెల్లెలు చనిపోయింది కాబట్టి శంకర్ కు పూర్ణ ను ఇచ్చి పెళ్లి చేశావు.. పూర్ణ రఘుని కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంది అని.. కానీ నువ్వు మాత్రమే నీ మేనల్లుడిని చాలా బాధ పెడుతున్నావు అని కోపంతో అక్కడినుంచి వెళ్తుంది.


దాంతో సత్యం బాధపడతాడు. ఆ తర్వాత స్వప్న కూరగాయలు తీసుకొని వస్తూ ఉండగా కొందరు రౌడీలు తనపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నిస్తారు. వెంటనే రఘు అక్కడికి వచ్చి ఆ రౌడీలను చితక్కొడతాడు. దాంతో స్వప్న రఘుకు సారీ చెబుతుంది. మిమ్మల్ని ఒకప్పుడు చాలా బాధ పెట్టాను అని చెప్పుకుంటూ బాధపడుతుంది. ఇక స్వప్న ఇంటికి వెళ్తానని బయలుదేరుతుండగా కారులో డ్రాప్ చేస్తాను అని అంటాడు.


కానీ స్వప్న ఇప్పుడే కష్టం విలువ మనుషుల విలువ తెలిసిందని అనటంతో సిద్దు లాగా నువ్వు కూడా దూరంగా ఉండాలనుకుంటున్నావా అని అనడంతో వెంటనే రఘు కారు ఎక్కి వెళ్తుంది. ఇంటికి చేరుకున్నాక ఇంటికి రమ్మని అంటుంది. కానీ రఘు మాత్రం తనకి పని ఉంది అనడంతో.. వెంటనే స్వప్న అంటే మా ఇంటికి రావడం ఇష్టం లేదేమో అన్నట్లుగా మాట్లాడుతుంది.


దాంతో రఘు అలా ఏమీ లేదు అని మీరు మారినందుకు సంతోషంగా ఉందని అంటాడు. స్వప్న కూడా గతంలో తాను చేసిన తప్పులను చెబుతూ బాధపడుతూ ఉంటుంది. దేవత లాంటి అత్తయ్యని కూడా బాధపెట్టాను అని చెబుతుంది. ఇంట్లోకి వెళ్ళాక సిద్దుకి జరిగిన విషయం చెప్పటంతో మరి అన్నయ్య ఇంట్లోకి రాకుండా వెళ్లాడు ఎందుకు అనటంతో.. ఏదో పని ఉంది అని అంటుంది స్వప్న. ఇక స్వప్న వారందరినీ చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది అంటూ.. తన తల్లిదండ్రులు డబ్బుంటే చాలు ఎవరు అక్కర్లేదు అన్నట్లుగా నేర్పించారు అని.. అందుకే అందర్నీ బాధ పెట్టాను అని బాధపడుతుంది.


వాళ్ళ ప్రేమలు, అభిమానాలు చూస్తుంటే వారిపట్ల ఎంత తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తుంది అని సిద్దు తో చెప్పుకుంటూ బాధపడుతుంది. ఇక స్వప్న మారినందుకు సిద్దు కూడా సంతోషపడతాడు. తరువాయి భాగంలో డాక్టర్ శంకర్ కు చూపు రాదు అని సత్యం కు చెబుతుంటే సత్యం మాటలు విని వీడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు అని కోపంగా అనుకుంటాడు శంకర్. ఇక ఎవరైనా కళ్ళు ఇస్తేనే చూపు వస్తుంది అని డాక్టర్ అనడంతో.. అయితే నా కళ్ళు ఇస్తాను అని సత్యం అంటాడు. దాంతో శంకర్, పూర్ణ ల గుండె తళుక్కుమంటుంది.


Also Read: Madhuranagarilo July 10th: సంయుక్త అడ్డు తొలగించుకున్న శ్యామ్.. అపర్ణ మాటలకు నిజం తెలుసుకున్న కూతురు?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial