Bhagavad Gita On Relationship: భగవద్గీత మన జీవితానికి అవసరమైన అన్ని అంశాల‌ను బోధిస్తుంది. ఇది చాలా ప్రాచీన‌మైన‌, ప్రభావవంతమైన గ్రంథం. మనమందరం ప్రేమలో పడతాం, జీవితంలో ఏదో ఒక సమయంలో, శృంగార సంబంధాలను అనుభవించని మానవుడు ఈ భూమిపై లేడు. మానవ సంబంధాలు సంక్లిష్టంగా ఉంటాయి. బంధువులు, ఆత్మీయులు మనల్ని ఏదో ఒక విధంగా బాధిస్తూనే ఉంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు సంబంధాల‌ గురించి ప్రత్యేకంగా ప్ర‌స్తావించాడు. వాటిని అనుసరించడం చాలా ముఖ్యం. భగవద్గీతలో బంధం గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు..?


Also Read : సక్సెస్ ఫుల్ పర్సన్ కావాలంటే మీలో ఏ ల‌క్ష‌ణాలు ఉండాలో తెలుసా?


ప్రేమ అన్నిటినీ జయిస్తుంది
శ్రీకృష్ణుడు గీతలో ఇలా చెప్పాడు. ప్రేమతో మనం ఏదైనా సాధించగలం. ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా అధిగమించే శక్తి ప్రేమకు ఉంది. ద్వేషం, కోపం, ప్రతీకారం, ఇతర భావోద్వేగాల కార‌ణంగా మనకు శత్రువులు ఏర్ప‌డ‌తారు. ప్రేమను పంచడం, ప్రేమను అందించ‌డం ద్వారా ఎవ‌రినైనా మనవైపు ఆకర్షించగలమని అర్థం చేసుకోవాలి. ప్రతి జీవికి ప్రేమ అవసరం. 


మిమ్మల్ని మీరు ప్రేమించండి, అందరినీ ప్రేమించండి
అంతర్గత శాంతిని స్వీయ-అవగాహన ద్వారా మాత్రమే పొంద‌వచ్చు. మిమ్మల్ని మీరు నిజంగా అర్థం చేసుకున్న తర్వాత మీలో సున్నితమైన ప్రేమ భావన ఏర్పడుతుంది. ఇది ప్రేమ స్వచ్ఛమైన రూపం. మీ పట్ల మీకు అలాంటి ప్రేమ ఉంటే, మీరు ఖచ్చితంగా ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించడం ప్రారంభిస్తారు. శారీరక, మానసిక అవసరాల నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవడానికి ప్రేమ సహాయం చేస్తుంది.


ప్రేమ, కరుణ, భక్తిపై దృష్టి పెట్టండి
"ఏదైనా చేయాల‌నుకుంటే దురాశ, అహంకారం, మోహం, అసూయతో కాకుండా.. ప్రేమ, కరుణ, వినయం, భక్తితో చేయాలి" అని మహాభారతంలో శ్రీకృష్ణుడు స్ప‌ష్టంచేశాడు. దురాశ, అహంకారం, కామం, అసూయ ప్రతికూల భావోద్వేగాలు. అవి మాన‌వుల్లో నిరాశను కలిగిస్తాయి. మనం అలాంటి భావోద్వేగాల నుంచి బయటికి రాలేక‌పోతే, మనం ఎప్పటికీ విజయం సాధించలేము, మంచి సంబంధాలను ఏర్పరచుకోలేము. ఎప్ప‌టికీ అసంతృప్తితో కూడిన జీవితాన్ని గడుపుతాము. ప్రేమ బంధంలో ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది.


ఉదారంగా ఉండండి
భగవద్గీత ఇతరులను మనలాగే చూడాలని బోధిస్తుంది. మనం ఇతరులను మనలాగే ప్రేమగా చూసినప్పుడు, మనం వారితో చెడుగా ప్రవర్తించము. సులభమైన ప్రేమ సంబంధాన్ని కలిగి ఉండాలంటే, మీరు మొదట అవతలి వ్యక్తి పట్ల ప్రేమను చూపించాలి. తద్వారా మీ జీవితం ఎంత అందంగా ఉందో మీరు చూడవచ్చు.


Also Read : ఈ రెండు పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవద్దని భగవద్గీత చెబుతోంది!


అంచనాలు లేని ప్రేమ
భగవద్గీతలో "మనతో ప్రేమలో ఉన్న వ్యక్తిచేసే త‌ప్పొప్పుల‌ను క్ష‌మించాలి" అని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేయడం సహజం. మాన‌వులంతా పూర్తిగా మంచివారు కాదు, పూర్తిగా చెడ్డవారు కాదు. మాన‌వ జ‌న్మ‌ అనేది మిశ్రమ గుణాల సమ్మేళనం. ఇతరులు కూడా మనలాగే మంచిచెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి, వారికి అన్నీ తెలుసని భావించి మనం వారి నుంచి ఎప్పుడూ ఏదీ ఆశించకూడదు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.