Bhagavad Gita in Telugu:  భగవద్గీత హిందూ మత ప్రధాన గ్రంథాలలో ఒకటి. దీనిని వేదాల ఉపనిషత్తు అని కూడా అంటారు. భగవద్గీతలో మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో అనేక‌ జ్ఞాన సంబంధిత‌ అంశాలు వివరించారు. దీని ముఖ్య ఉద్దేశం ధ‌ర్మం, జీవితం, మానవ గౌరవం గురించి అవగాహన పెంచడం.


భగవద్గీత బోధలను జీవితంలో అలవర్చుకుంటే మనిషి ఎంతో పురోగమిస్తాడు. మనం గర్వించదగ్గ భగవద్గీత మాత్రమే మనిషికి ఎలా జీవించాలో నేర్పే గ్రంథం. భగవద్గీత ధర్మం, కర్మ, ప్రేమ పాఠాన్ని బోధిస్తుంది. భగవద్గీత ప్రకారం, ఈ రెండు పరిస్థితులలో మనం ఏ కారణం చేతనైనా ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు.


సంతోషంలోను, దుఃఖంలోనూ నిర్ణయం తీసుకోకండి
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన ప్ర‌కారం, ఒకరు చాలా సంతోషంగా లేదా చాలా విచారంగా ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే ఈ రెండు పరిస్థితులు మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకోవడానికి అనుమతించవు. ముందుగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.


Also Read: గ్రామానికి, కుటుంబానికి ఆపద రాకూడదంటూ సమర్పించే బోనం, ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు!


జీవితంలో సమస్యలకు కారణం
కారణం లేకుండా మనిషి జీవితంలో సమస్యలు రావని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. సమస్యల రాక మన జీవితంలో ఏదో మార్పు రావాలి అనే సంకేతం.


అవకాశాన్ని దుర్వినియోగం చేయవద్దు
శ్రీ కృష్ణుడి ప్రకారం, ఎవరైనా మీకు మంచి అవకాశం ఇస్తే, ఏ కారణం చేతనైనా అతన్ని మోసం చేయవద్దు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే, అతనికి మళ్లీ ఆ అవకాశం ఇవ్వవద్దు. ఒకసారి మోసం చేసిన వ్యక్తి మరోసారి మోసం చేయడనడానికి ఎలాంటి రుజువు లేదు.


కోపాన్ని నియంత్రించుకోండి
రెండు క్షణాల కోపం ఎలాంటి ప్రేమ బంధాన్నైనా నాశనం చేస్తుంది. ఇది తప్పు అనే స్పృహ మనకు వచ్చే వరకు, కాలక్రమేణా సంబంధంలో చీలికలు వస్తాయని శ్రీకృష్ణుడు చెప్పాడు. కోపం చేతికి సలహా ఇచ్చే బదులు ఒక్క క్షణం ఓపిక పట్టడం మంచిది. కోపం సమయంలో కాస్త ఓపిక పడితే కనీసం వంద రోజుల కష్టాలను దూరం చేసుకోవచ్చు అంటాడు శ్రీ కృష్ణుడు. ప్రతి వ్యక్తి కోపం సమయంలో తనను తాను నియంత్రించుకోవడం నేర్చుకోవాలి.


రూపాన్ని బట్టి జీవించవద్దు
భగవద్గీత ప్రకారం, కేవలం ప్రదర్శన కోసం మంచిగా మారకూడదు. అంటే ఎవరో ఒకరు మనల్ని చూస్తున్నారని మనం చక్కగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని బయటి నుంచి మాత్రమే కాకుండా లోపల నుంచి అంటే ఆత్మ నుంచి కూడా చూస్తాడు.


Also Read: జూన్ 23 రాశిఫలాలు, ఈ రాశివారు బిజీ లైఫ్ లోంచి కొంత సమయం కుటుంబానికి కేటాయించాలి!


గెలుపు ఓటముల‌ను సమానంగా తీసుకోండి
ఓటమి, గెలుపు మన ఆలోచనపై ఆధారపడి ఉంటాయి. ఓటమిని అంగీకరిస్తే అది ఓటమి అవుతుంది. అదే ఓటమిని విజయంగా మార్చుకుంటే అది మన జీవితానికి సోపానం అవుతుంది. ఓటమి, గెలుపు మన సామర్థ్యంపై, మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్పాడు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.