Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒకరి జాతకం చూడాలంటే పుట్టిన సమయం, గ్రహాల స్థితిని గమనిస్తారు. జన్మ నక్షత్రాన్ని బట్టి, ఆ నక్షత్రంలో ఉండే నాలుగు పాదాల ఆధారంగా కూడా ఫలితాలు మారుతాయి. రాశి చక్రం, అంశ చక్రం ఆధారంగా భవిష్యత్ ని అంచనా వేయవచ్చు, ఏది అదృష్ట సమయం, ఏది కాదు, ఎవరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, ఎవరు ఏం సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది గ్రహస్థితి ఆధారంగా లెక్కించి చెబుతారు. అయితే ఇప్పుడంటే వాహనం అనేది నిత్యవసరంగా మారింది కానీ ఒకప్పుడు వాహనం (టూ వీలర్ కావొచ్చు, ఫోర్ వీలర్ కావొచ్చు) విలాసానికి చిహ్నంగా భావించేవారు. అందుకే కొనుగోలు చేసే సమయం నుంచి మొదటిసారి వాడే సమయం వరకూ మంచి రోజా కాదా, తిథి బావుందా, తారాబలం సరిపోయిందా అని చూసుకుని మరీ కొనుగోలు చేసేవారు. ఎందుకంటే విలాసానికి చిహ్నం అన్నమాట పక్కనపెడితే గ్రహస్థితి అనుకూలంగా లేని సమయంలో వాహనం కొనుగోలు చేసినా, వినియోగించినా దానివల్ల లాభం కన్నా ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని చాలామంది భయం. అందుకే గ్రహస్థితి అనుకూల-ప్రతికూలతలు విశ్వశించేవారు మంచి రోజు చూసి వాహనం కొంటారు. అయితే మీరు ఏ రంగు వాహనం కొనుగోలు చేస్తే మంచిదో మీ నక్షత్రం నిర్ణయిస్తుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. 


ALso Read: జూలై 5 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశులవారు ఆర్థికంగా లాభపడతారు


ఇల్లు లానే కారు కూడా జీవితంలో విజయానికి సంకేతంగా భావించేవారున్నారు. వాహనాన్ని సొంతం చేసుకోవడంలో ఒకరి జాతకంలో ముఖ్యమైన పాత్ర పోషించే గ్రహం శుక్రుడు. ఎందుకంటే శుక్రుడు సంపద, భౌతిక సుఖాలు, విలాసాలకు చిహ్నం. వాహనం కొనడానికి శని కూడా జాతకంలో మంచి స్థితిలో ఉండాలి. అన్నీ అనుకూలిస్తేనే అనుకున్నట్టుగా వాహనం కొనుగోలు చేయగలరు. అదే సమయంలో వాహనం సంఖ్య, వాహనం రంగు కోసం కూడా జ్యోతిష్యుడి సలహా తీసుకుంటారు. 


ALso Read: ఈ ఏడాది శ్రావణం అధికమాసం, ఇంతకీ అధికమాసం - క్షయమాసం అంటే ఏంటి!


ఏ నక్షత్రం వారికి ఏ రంగు వాహనం అనుకూలం


అశ్విని
సిల్వర్ కలర్ ఈ నక్షత్రం వారికి ఫస్ట్ ప్రయార్టీ, సెకెండ్ ప్రయార్టీ రెడ్ 


భరణి
వైట్ , సిల్వర్ కలర్ 


కృత్తిక
రెడ్, వైట్


రోహిణి
వైట్ కలర్ వాహనం బాగా అనుకూలం.. తప్పదంటే సిల్వర్ కూడా తీసుకోవచ్చు


మృగశిర
ఈ నక్షత్రం వారికి రెడ్ కామన్ కలర్...రెడ్ వద్దనుకుంటే సెకెండ్ ప్రయార్టీ కింద మొదటి రెండు పాదాలకు వైట్, మూడు నాలు పాదాలకు ఎల్లో


ఆరుద్ర
బ్లూ , బ్లాక్ , బ్రౌన్ మూడు రంగులు నప్పుతాయి..లాస్ట్ ప్రయార్టీ గ్రీన్


పునర్వసు
వైట్, సిల్వర్ కలర్ నప్పుతాయి లాస్ట్ ప్రయార్టీ గ్రీన్


పుష్యమి
పుష్యమి నక్షత్రంవారికి నప్పే వాహనం రంగు బ్లూ,  బ్లాక్, వైట్


ఆశ్లేష
ఈ నక్షత్రం వారికి గ్రీన్, వైట్ రంగు వాహనాలు అనుకూలం


మఖ
వైట్ అండ్ సిల్వర్ వాహనం అనుకూలం


పుబ్బ
పుబ్బ నక్షత్రం వారికి వైట్, సిల్వర్ రంగు వాహనాలు నప్పుతాయి తప్పదంటే రెడ్


ఉత్తర
రెడ్ ఫస్ట్ ప్రయార్టీ తప్పదంటే వైట్ పర్వాలేదు


హస్త
హస్త నక్షత్రం వారికి వైట్, సిల్వర్,  బ్లూ రంగు వాహనాలు అనుకూలం


చిత్త
రెడ్ మంచిది, తప్పదంటే సిల్వర్  కూడా నప్పుతుంది


స్వాతి
బ్రౌన్, సిల్వర్


విశాఖ
ఎల్లో, సిల్వర్..వైట్ కూడా


అనూరాధ
బ్లూ అంట్ బ్లాక్...తప్పదంటే రెడ్


జ్యేష్ట
వైట్ అండ్ సిల్వర్, గ్రీన్


మూల
వైట్,సిల్వర్
 
పూర్వాషాడ
సిల్వర్, ఎల్లో


ఉత్తరాషాడ
రెడ్, ఎల్లో ఒకటో పాదం, రెండ్ అండ్ బ్లూ మిగిలిన రెండు పాదాలు


శ్రవణం
వైట్, సిల్వర్..లాస్ట్ ప్రయార్టీ బ్లూ


ధనిష్ట
ఈ నక్షత్రం వారికి రెడ్, బ్లూ కలిసొచ్చే వాహనం రంగులు


శతభిషం
బ్లూ, బ్లాక్, బ్రౌన్


పూర్వాభాద్ర
ఎల్లో,బ్లూ


ఉత్తరాభాద్ర
బ్లూ, బ్లాక్ 


రేవతి
గ్రీన్,  వైట్ 


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial