Naga Chaitanya Sobhita Wedding LIVE: అన్నపూర్ణలో అతిథుల సందడి... మొదలైన పెళ్లి... చైతూ - శోభిత మ్యారేజ్ లైవ్ అప్డేట్స్
Naga Chaitanya Sobhita Dhulipala Wedding LIVE Updates: అక్కినేని వారసుడు, యువ సామ్రాట్ నాగార్జున - శోభితా ధూళిపాళ పెళ్లి సందడి మొదలైంది. మరి, ఆ వెడ్డింగ్ లైవ్ అప్డేట్స్ ఏంటో చూద్దామా?
నాగ చైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి పీటలు ఎక్కారు. పెళ్లి దుస్తుల్లో కొత్త జంట ఎంత ముచ్చటగా ఉందో కదూ! ఆ ఫోటోలను మీరూ చూడండి.
అక్టోబర్ 21న తమ ఇంట్లో పెళ్లి పనులు మొదలైనట్టు శోభిత తెలిపారు. గోధుమ రాయి పసుపు దంచటం చేశామని ఆమె పేర్కొన్నారు.
ఆగస్టు 8, 2024... నాగ చైతన్య, శోభితకు నిశ్చితార్థం జరిగింది. ఆ రోజే వాళ్లిద్దరి పెళ్లి అని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. అంతకు ముందు ప్రేమలో ఉన్నారని ప్రేక్షకులకు, పరిశ్రమ ప్రముఖులకూ తెలిసినా ఎప్పుడూ అక్కినేని ఫ్యామిలీ పైకి చెప్పింది లేదు. నాగార్జున ప్రకటించిన కాసేపటికి చైతు, శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేశారు.
చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు తమ తమ సతీమణులతో కలిసి వివాహానికి రానున్నారు. నయనతార, పీవీ సింధు సైతం వస్తారని సమాచారం. ప్రభాస్, అల్లు అర్జున్, రాజమౌళితో పాటు పలువురికి ఆహ్వానాలు వెళ్లాయని తెలిసింది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం ఈ పెళ్లికి వస్తారని టాక్.
ఇవాళ మధ్యాహ్నమే అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అఖిల్ వేర్వేరు కార్లలో పెళ్లి వేదిక అయినటువంటి అన్నపూర్ణ స్టూడియో చేరుకున్నారు.
నాగ చైతన్య పెళ్లి కోసం అక్కినేని ఇల్లు ముస్తాబు అయ్యింది. ఆ ఇల్లు ఎలా ఉందో చెప్పండి.
#SoChay... అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి నేపథ్యంలో ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
'ఏ మాయ చేసావె' సినిమాలో తనకు జోడీగా నటించిన సమంతతో నాగ చైతన్య ప్రేమలో పడ్డారు. అక్టోబర్ 6, 2017లో గోవాలో హిందూ - క్రిస్టియన్ పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు, నాలుగేళ్ళ వైవాహిక జీవితం తర్వాత అక్టోబర్ తొలి వారంలో, 2024లో విడిపోతున్నట్టు ప్రకటించారు.
Sobhita Dhulipala Age - Date Of Birth: శోభితా ధూళిపాళ వయసు 32 ఏళ్ళు. ఆమె మే 31, 1992లో జన్మించారు. నాగ చైతన్య కంటే ఆవిడ ఆరేళ్ళు చిన్న.
శోభితా ధూళిపాళ తెలుగు అమ్మాయి. ఆమె తండ్రి నేవీ మర్చంట్ ఆఫీసర్. వాళ్ళది విశాఖ. అయితే, ఆమెకు 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ముంబై వెళ్లారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 'రమణ్ రాఘవ్ 2.0తో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత హిందీ వెబ్ సిరీస్, సినిమాలు చేశారు. 'గూఢచారి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. తర్వాత 'మేజర్' వంటివి చేశారు.
Naga Chaitanya Age - Date Of Birth: ప్రస్తుతం నాగ చైతన్య వయసు 38 ఏళ్ళు. ఆయన నవంబర్ 23, 1886లో జన్మించారు. ఆయన తల్లి పేరు లక్ష్మి.
Background
స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు మనవడు, కింగ్ నాగార్జున కుమారుడు, యంగ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ఈ రోజు ఓ ఇంటి వాడు కానున్నారు. తెలుగు అమ్మాయి, పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసిన నటి శోభిత ధూళిపాళతో ఏడు అడుగులు వేయనున్నారు. వీళ్లిద్దరి పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆ మ్యారేజ్ లైవ్ అప్డేట్స్ చూడండి
ఏయన్నార్ ఆశీస్సులు ఉండాలని... ఉంటాయని!
నాగచైతన్య శోభిత వివాహం అన్నపూర్ణ స్టూడియోలో చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. చిత్ర సీమలో అక్కినేని కుటుంబానికి ఒక దారి చూపించిన మూలపురుషుడు ఏఎన్నార్. ఆయన లెగసీని ఫ్యామిలీ కంటిన్యూ చేస్తోంది. ఏఎన్ఆర్ గుర్తుగా ఆయన విగ్రహాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ప్రతిష్టించారు. ఆయన ముందు వివాహం చేసుకోవడం వల్ల నాగచైతన్య శోభిత దంపతులకు ఆయన ఆశీస్సులు ఉంటాయని అక్కినేని కుటుంబం నమ్ముతోంది.
కుటుంబమంతా ఎంతో హ్యాపీగా... ఆనందంగా!
నాగ చైతన్య పెళ్లి నేపథ్యంలో అటు దగ్గుబాటి, ఇటు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఆల్రెడీ పెళ్లి సందడి మొదలైంది. అక్కినేని ఇంటికి దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు చాలా మంది చేరుకున్నారు. నాగచైతన్యను పెళ్ళి కొడుకును చేశారు. శోభిత ధూళిపాల తనను పెళ్లి కుమార్తె చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వధూవరుల కుటుంబ సభ్యులు అందరూ ఈ పెళ్లి కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు.
చిత్ర సీమలో హేమాహేమీలంతా హాజరు కానున్నారు!
చిత్ర సీమలో నాగార్జునకు అజాత శత్రువుగా పేరు ఉంది. అందరితోనూ ఆయన కలుపుగోలుగా వెళుతూ ఉంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో, మెగాస్టార్ చిరంజీవితో నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినిమాలు పక్కన పెడితే వాళ్ళిద్దరూ కలిసి వ్యాపారాలు కూడా చేశారు. అప్పట్లో స్టార్ మా లో ఇద్దరిదీ భాగస్వామ్యం ఉండేది. ఇప్పుడు ఈ నాగచైతన్య పెళ్లికి చిరంజీవి కుటుంబమంతా హాజరుకానుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రతతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.
పెళ్లి తర్వాత శోభిత సినిమాలు మానేస్తారా? చేస్తారా?
ప్రేక్షకులతో పాటు పరిశ్రమలో చాలా మందికి ఇప్పుడు ఒక సందేహం ఉంది. నాగచైతన్యతో వివాహం తర్వాత శోభిత ధూళిపాళ నటిగా తన కెరీర్ కంటిన్యూ చేస్తారా? సినిమాలలో నటిస్తారా? లేదంటే పెళ్లి తర్వాత ఆవిడ సినిమాలు మానేస్తారా? అని! అక్కినేని ఫ్యామిలీ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... తమ ఇంటికి రాబోయే కోడలికి ఎటువంటి కండిషన్లు పెట్టలేదట. శోభితను సినిమాలు చేసుకోమని చెప్పారట. నటిగా ఆవిడ సినిమాలు చేయడం పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని వివరించారట.
పెళ్లికి ముందు నాగ చైతన్య పూర్తి చేసిన సినిమా 'తండేల్'. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఆ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శోభితా ధూళిపాళ విషయానికి వస్తే... సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు.
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?
- - - - - - - - - Advertisement - - - - - - - - -