Pushpa 2 The Rule 1st Day Collections Prediction: అల్లు అర్జున్, సుకుమార్‌ల మోస్ట్ అవైటెడ్ సినిమా ‘పుష్ప 2 ది రూల్’. 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. ఈ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు (డిసెంబర్ 4వ తేదీ) రాత్రి 9:30 గంటల నుంచి ‘పుష్ప 2 ది రూల్’ ప్రీమియర్ షోలు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఆల్ టైమ్ రికార్డు కన్ఫర్మ్...
‘పుష్ప 2 ది రూల్’ వసూళ్ల పరంగా మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి సినిమాగా నిలవడం దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లే. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే దాదాపు రూ.140 కోట్లకు పైగా వసూళ్లను ఈ సినిమా సాధించింది. ఇందులో కేవలం ఇండియా అడ్వాన్స్ బుకింగ్సే రూ.100 కోట్ల వరకు ఉన్నాయి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రూ.40 కోట్ల వరకు ఉన్నాయి. ముందు రోజు వేసిన లిమిటెడ్ ప్రీమియర్స్‌కే ఇప్పటి వరకు రూ.10.34 కోట్ల వసూళ్లు వచ్చాయి. భారత దేశ సినిమా చరిత్రలో 15 రాష్ట్రాల్లో రూ.కోటికి పైగా అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన మొదటి సినిమాగా ‘పుష్ప 2’ నిలిచింది. బీహార్, ఒడిశా, ఛత్తీస్‌ఘర్ లాంటి రాష్ట్రాలు కేవలం 500 షోలతోనే రూ.కోటికి పైగా గ్రాస్‌ను సాధించాయి.
ఇందులో తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ రూ.50 కోట్ల వరకు ఉన్నాయి. హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ రూ.32.20 కోట్ల వరకు ఉన్నాయి. కానీ షోల సంఖ్య మాత్రం తెలుగు కంటే హిందీకి దాదాపు రెట్టింపు ఉన్నాయి. తెలుగు వెర్షన్‌కు పడే షోలు ఎనిమిది వేల వరకు ఉండగా... హిందీ వెర్షన్ షోల సంఖ్య ఏకంగా 16 వేలకు పైగా ఉంది.
Also Read: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
రేట్లు మామూలుగా లేవు...
‘పుష్ప 2 ది రూల్’ సినిమాకు ప్రభుత్వాలు అనుమతించిన రేట్లు కూడా ఒక రేంజ్‌లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పడే ప్రీమియర్లకు అయితే భారీ రేట్లు అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్ల రేట్లు రూ.1000 వరకు ఉండగా, తెలంగాణలో అయితే దాదాపు రూ.1300కు చేరుకున్నాయి.
సాధారణ షోలకు కూడా రికార్డు రేట్లను ‘పుష్ప 2 ది రూల్’ సాధించింది. మల్టీఫ్లెక్స్‌ల్లో మొదటి నాలుగు రోజులు ఏకంగా రూ.531కు టికెట్లను విక్రయించనున్నారు. సింగిల్ స్క్రీన్లలో కూడా టికెట్ రేట్ రూ.350 వరకు ఉంది. ఏకంగా 29వ రోజు వరకు కూడా రూ.354 ధరతో ఈ సినిమా టికెట్లను విక్రయించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అంటే దాదాపు సంక్రాంతి సినిమాలు వచ్చేవరకు ‘పుష్ప 2’ టికెట్ రేట్లు ఒక రేంజ్‌లోనే ఉంటాయన్న మాట.