Naga Chaitanya On Married Life: తన వైవాహిక జీవితం గురించి యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మాట్లాడారు. పెళ్లి, పిల్లల గురించి ఓపెన్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే...


వెంకీ మామలా నలుగురు వద్దు కానీ...
నాగ చైతన్యను చూస్తే రిజర్వ్డ్ పర్సన్ అనిపిస్తారు. ఆయన పర్సనల్ లైఫ్ గురించి కామన్ ఆడియన్స్‌కు తెలిసింది చాలా తక్కువ. ఆయన కూడా ఓపెన్ అవ్వరు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్... తన వైవాహిక జీవితం గురించి, పిల్లల గురించి తన బావ రానా దగ్గుబాటి (Rana Daggubati) హోస్ట్ చేస్తున్న షోలో చైతన్య మాట్లాడారు.


'నీ ఫ్యామిలీ ఎలా ఉండాలని నువ్వు ఊహించుకున్నావ్' అని నాగ చైతన్యను రానా అడిగారు. ''హ్యాపీలీ మ్యారీడ్, కపుల్ ఆఫ్ కిడ్స్'' అని చైతూ చెప్పారు. ఆ వెంటనే 'కపుల్ ఆఫ్ కిడ్స్ అంటే ఎలా? వెంకీ మామలా నలుగురా? ఇద్దరా? ముగ్గురా?' అని రానా ప్రశ్నించారు. ''వెంకీ మామలా కాదు...'' అని చైతూ చెప్పారు. అంటే... తనకు నలుగురు పిల్లలు వద్దు అని స్పష్టం చేశారు. సో... పెళ్లి తర్వాత త్వరలో చైతు తన ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తారని అనుకోవచ్చు.


Also Readకంగువ ఫస్ట్ డే కలెక్షన్స్... టార్గెట్ రీచ్ అయ్యిందా? సూర్యకు పాన్ ఇండియా సక్సెస్ వచ్చిందా?






డిసెంబర్ 4న శోభితతో చైతూ పెళ్లి!
Naga Chaitanya Sobhita Dhulipala Wedding Date: రానా దగ్గుబాటి, నాగ చైతన్య మధ్య మంచి అనుబంధం ఉంది. అందువల్ల, సరదాగా మాట్లాడుకుని ఉండొచ్చు. పెళ్లి, పిల్లల గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య... సమంతతో విడాకుల గురించి మాట్లాడారా? లేదా? అనేది తెలియాలి.


తెలుగు అమ్మాయి, యువ కథానాయిక శోభితా ధూళిపాళతో అక్కినేని నాగ చైతన్య ఏడు అడుగులు వేయనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న వీళ్లిద్దరి వివాహం జరగనుంది. అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోలో వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో పెళ్లి జరుగుతుందని సమాచారం. ఇప్పటి వరకు పెళ్లి తేదీ గురించి చైతూ గానీ, శోభితా గానీ అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు.


Also Read: 'పుష్ప 2' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తమన్ క్లారిటీ... బన్నీ మూవీకి ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?



Naga Chaitanya Upcoming Movies: ఇప్పుడు నాగ చైతన్య చేస్తున్న సినిమాలకు వస్తే... తనకు గతంలో 'ప్రేమమ్' వంటి విజయం ఇచ్చిన చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిల్మ్ 'తండేల్' చేస్తున్నారు. ఆ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఆ సినిమా కోసం చైతన్య ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడనున్నారు. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారట.