'పుష్ప 2: ది రూల్' (Pushpa 2 The Rule) చిత్రానికి తమన్ (Thaman) నేపథ్య సంగీతం అందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించగా... ఆయనతో పాటు తమన్, సామ్ సిఎస్, అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ ముగ్గురిలో... తన కోసం 'పుష్ప 2' వెయిటింగ్ అంటూ సింగర్ కార్తీక్ మ్యూజిక్ కాన్సెర్ట్‌లో తమన్ కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాలో తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చారు.
నేనొక పార్ట్ మాత్రమే...
మొత్తం బాధ్యత తీసుకోలేదు!
Thaman Clarity On Pushpa 2: 'పుష్ప 2: ది రూల్' సినిమాలో తానొక పార్ట్ మాత్రమే అని తమన్ తెలిపారు. ఆ సినిమా మొత్తానికి నేపథ్య సంగీతం అందించే బాధ్యతను తాను తీసుకోలేదని ఆయన వివరించారు. పదిహేను రోజుల్లో ఓ సినిమాకు నేపథ్య సంగీతం చేయలేము అని ఆయన స్పష్టం చేశారు.
'పుష్ప 2' సినిమా అంతటికి నేపథ్య సంగీతం అందించే బాధ్యతను తాను తీసుకోలేకపోయినట్లు తమను తెలిపారు. 'పుష్ప 2' చాలా పెద్ద సినిమా అని, వ్యాపార పరంగానూ ఎన్నో లెక్కలు ఉంటాయని, కొన్నిసార్లు కొన్ని అంశాలను సవాలుగా తీసుకొని చేయవచ్చు అని, అయితే 15 రోజుల్లో చేయడం కుదరదు కనుక కొంత పార్ట్ వరకు తాను నేపథ్య సంగీతం చేశానని చెప్పారు. సినిమా అంతా తాను చూశానని, చాలా అద్భుతంగా ఉంది అని, 'పుష్ప 2' గొప్ప సినిమా అని ఆయన చెప్పారు. ఈ సినిమా ట్రైలర్ పాట్నాలో ఈ నెల 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అందులో నేపథ్య సంగీత దర్శకుల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నేపథ్య సంగీతంలో తమన్ ఎంత చేశారు? దేవి శ్రీ ప్రసాద్ ఎంత చేశారు? అనేది ఆసక్తికరంగా మారుతుందని చెప్పడంలో సందేహాలు అవసరం లేదు.
Also Read: కంగువ ఫస్ట్ డే కలెక్షన్స్... టార్గెట్ రీచ్ అయ్యిందా? సూర్యకు పాన్ ఇండియా సక్సెస్ వచ్చిందా?
నట సింహం నందమూరి బాలకృష్ణతో తమన్ ఆరోసారి పని చేస్తున్నారు. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న 'డాకు మహారాజ్' చిత్రానికి ఆయన సంగీత దర్శకుడు. ఆ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన టీజర్ విడుదల కార్యక్రమంలో 'పుష్ప 2' గురించి తమన్ మాట్లాడారు.
డిసెంబర్ ఐదో తేదీన 'పుష్ప 2' ప్రేక్షకుల ముందుకు వస్తుండగా... అది వచ్చిన ఓ నెల రోజులకు తమన్ సంగీతం అందిస్తున్న రెండు భారీ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్ చేంజర్' సినిమాతో పాటు బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్రానికి ఆయనే సంగీత దర్శకుడు. ఆ రెండు సినిమాలు సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ఒకటి, జనవరి 12న మరొకటి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం ఆ సినిమా పనుల్లో తమన్ బిజీగా ఉన్నారు.
Also Read: వరుణ్ తేజ్‌కు మరో షాక్... 'మట్కా' ఫస్ట్ డే కలెక్షన్స్ అంతేనా?