Top Selling Smartphones: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడు చాలా మంది తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లను ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మనం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకుందాం.
అగ్రస్థానంలో ఐఫోన్ 15
కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అనే సంస్థ... ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏ స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువగా అమ్ముడయ్యాయో తెలుపుతూ నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో యాపిల్ ఐఫోన్ 15 అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఉన్నాయి. ఆసక్తికరంగా 2022లో లాంచ్ అయిన ఐఫోన్ 14 కూడా ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది.
Also Read: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
శాంసంగ్ నుంచి ఐదు ఫోన్లు
ఈ జాబితాలో శాంసంగ్ కూడా స్థానాన్ని సంపాదించుకుంది. ఒకటి లేదా రెండు కాదు ఏకంగా ఐదు శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లు ఈ లిస్ట్‌లో ఉండటం విశేషం. ఇవి ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 ఫోన్ల జాబితాలో ఉన్నాయి. వీటిలో నాలుగు మోడల్‌లు గెలాక్సీ ఏ సిరీస్‌కు చెందినవి. అవి శాంసంగ్ గెలాక్సీ ఏ15 4జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ05, శాంసంగ్ గెలాక్సీ ఏ35. ఇది కాకుండా శాంసంగ్ గెలాక్సీ ఎస్24 మూడో త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.
యాపిల్, శాంసంగ్ కాకుండా షావోమీ రెడ్‌మీ 13సీ కూడా ఈ జాబితాలోకి చేరింది. ఈ ఫోన్ 2023 డిసెంబర్‌లో రూ. 10,000 కంటే తక్కువ ధరతో మార్కెట్లో లాంచ్ అయింది. ఇది వినియోగదారులకు బాగా నచ్చింది.
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే
ఐఫోన్ 15 (iPhone 15)
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)
ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro)
శాంసంగ్ గెలాక్సీ ఏ15 4జీ (Samsung Galaxy A15 4G)
శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ (Samsung Galaxy A15 5G)
శాంసంగ్ గెలాక్సీ ఏ05 (Samsung Galaxy A05)
రెడ్‌మీ 13సీ 4జీ (Redmi 13C 4G)
శాంసంగ్ గెలాక్సీ ఏ35 (Samsung Galaxy A35)
ఐఫోన్ 14 (iPhone 14)
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 (Samsung Galaxy S24)
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో యాపిల్, శాంసంగ్ హవా కొనసాగుతున్నట్లు ఈ జాబితాను బట్టి స్పష్టంగా చెప్పవచ్చు. దీంతో పాటు షావోమీ రెడ్‌మీ 13సీ వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు కూడా కస్టమర్లలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ లిస్ట్‌లో ప్రీమియం ఫోన్లు, బడ్జెట్ ఫోన్లు రెండూ ఉన్నాయి కాబట్టి వినియోగదారులు ఫోన్ల విషయంలో ఎంత విభిన్నంగా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
Also Read: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?