OnePlus 11R 5G Discount Offer: వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు భారతీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో వినియోగదారులు గొప్ప ఫీచర్లతో పాటు గొప్ప కెమెరా సెటప్‌ను కూడా పొందుతారు. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గాయి. నిజానికి ఈ డిస్కౌంట్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.


వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ధర ఎంత?
16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన వన్‌ప్లస్ 11ఆర్ 5జీ అసలు ధర రూ. 44,999గా ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో ఇది 17 శాతం తగ్గింపుతో రూ. 36,900కే అందుబాటులో ఉంది. అంటే దీనిపై ఏకంగా 17 శాతం ధర తగ్గింపు లభించిందన్న మాట. ఇది మాత్రమే కాకుండా మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే ఐదు శాతం అదనపు క్యాష్‌బ్యాక్, రూ. 1250 వరకు ఈఎంఐ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందుతారు.


వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫీచర్లు


డిస్‌ప్లే
ఇది 6.74 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది.


కెమెరాలు
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు.
50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్
2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.


ప్రాసెసర్
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌పై పని చేయనుంది. ఇది 4 ఎన్ఎం టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. దీని శక్తివంతమైన పనితీరు మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం కచ్చితంగా సరిపోతుంది.


బ్యాటరీ, ఛార్జింగ్
ఈ స్మార్ట్‌ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ OS 13తో వస్తుంది.



Also Read: స్మార్ట్ ఫోన్ కెమెరా క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్త - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే లెన్స్ పోయినట్లే!


స్టోరేజ్ ఎంత?
వన్‌ప్లస్ 11ఆర్‌లో 18 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌ను కలిగి ఉంది. దీని వెనుక ప్యానెల్ గ్లాస్ ఫినిష్‌ను అందించారు. ఫ్రేమ్‌ను ప్లాస్టిక్‌తో రూపొందించారు.


వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ప్రీమియం కేటగిరీలో వస్తుంది. దాని శక్తివంతమైన ఫీచర్ల కారణంగా వినియోగదారుల మధ్య ప్రజాదరణ పొందింది. అద్భుతమైన కెమెరా, వేగవంతమైన ఛార్జింగ్, మంచి పెర్ఫార్మెన్స్‌ల కారణంగా ఇతర స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఇది భిన్నంగా ఉంటుంది.


మోటొరోలా స్మార్ట్‌ఫోన్‌లపై కూడా డిస్కౌంట్
మోటొరోలా జీ85 5జీ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 14 శాతం తగ్గింపును పొందుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.20,999గా ఉంది. కానీ డిస్కౌంట్ తర్వాత మీరు దీన్ని రూ.17,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 1850 అదనపు తగ్గింపును పొందుతారు.


ఈ స్మార్ట్‌ఫోన్‌లో పీఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. దీంతో పాటు 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.



Also Read: 2024లో ఎక్కువ ఉపయోగించిన పాస్‌కోడ్‌లు ఇవే - మీది ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిందే!