Smartphones Under 20K: భారత మార్కెట్లో 5జీ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలు తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం భారతదేశ మార్కెట్లో రూ. 20,000 రేంజ్‌లోని ఏ స్మార్ట్‌ఫోన్‌లు మంచి ఆప్షన్లు అనిపించుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్ట్‌లో వన్‌ప్లస్ నుంచి రెడ్‌మీ వరకు అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.


రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ (Redmi Note 13 Pro 5G)
ఈ స్మార్ట్‌ఫోన్ 128 జీబీ స్టోరేజ్‌తో పాటు 8 జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఇది కంపెనీ అందిస్తున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ అని చెప్పుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఉంది. ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు. పవర్ కోసం శక్తివంతమైన 5100 ఎంఏహెచ్‌ బ్యాటరీ రెడ్‌మీ నోట్ 13 5జీలో ఉంది. ఈ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది.


ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ ఆక్టాకోర్ ప్రాసెసర్ అమర్చారు. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. దీని ధరల గురించి చెప్పాలంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 18,225కి కొనుగోలు చేయవచ్చు.



Also Read: 2024లో ఎక్కువ ఉపయోగించిన పాస్‌కోడ్‌లు ఇవే - మీది ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిందే!


వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ (OnePlus Nord CE4 Lite 5G)
వన్‌ప్లస్ అందిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో ఇది కూడా ఒకటి. ఈ ఫోన్‌లో కంపెనీ 8 జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ స్టోరేజ్‌ను కూడా అందిస్తుంది. ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. డివైస్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇందులో 5500 ఎంఏహెచ్ బలమైన బ్యాటరీ అందించారు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.


ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ధర గురించి చెప్పాలంటే ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 18,190కి లిస్ట్ అయింది. మీరు దీన్ని మంచి తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.


రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ (Realme Narzo 70 Pro 5G)
ఈ రియల్‌మీ ఫోన్ స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఆక్టా కోర్ ప్రాసెసర్ అందుబాటులో ఉంది. అదే సమయంలో ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. పవర్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 17,613కి లిస్ట్ అయింది. దీన్ని గొప్ప బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ అని కూడా చెప్పవచ్చు.


ఐకూ జెడ్9 5జీ (iQOO Z9 5G)
ఐకూ జెడ్9 గేమింగ్ చేసే వారికి గొప్ప ఆప్షన్. ఇందులో డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంది. అలాగే ఫోన్‌లో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. అదే సమయంలో ఇందులో 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44W ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.17,986గా ఉంది.



Also Read: స్మార్ట్ ఫోన్ కెమెరా క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్త - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే లెన్స్ పోయినట్లే!